
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న మాల్దీవులు, లక్ష దీవుల ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. హిందూ మహాసముద్రం, సుమత్రా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే రాష్ట్రంపై వాటి ప్రభావం ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవు. ఆదిలాబాద్‌లో మాత్రం రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలు, మెదక్‌లో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.