కలెక్టరేట్ : జిల్లాలో తహశీల్‌దార్ల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్ బదిలీల పర్వం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తహశీల్దార్‌లకు ఆయా మండలాల్లో నియామక పత్రాలు అందించిన వారం రోజులకే మళ్లీ వారిని బదిలీ చేస్తూ స్థానభ్రంశం కలిగిస్తున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ పాలన మరీ ఇంతా బలహీనంగానా అంటూ అప్పుడే అధికారిక వర్గాల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి.
ఆ మంత్రి చెప్పాడని ఈ తహశీల్దార్‌ని, ఈ ఎమ్యెల్యే చెప్పాడని ఆ తహశీల్దార్‌ను నిబంధనలకు బదిలీ చేస్తూ మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఆర్డర్లు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి ఫిబ్రవరిలో బదిలీ అయిన తహశీల్దార్‌లు ఇతర జిల్లాలో విధులు నిర్వహించి జూన్ 10న తిరిగి సొంత జిల్లాలకు బదిలీపై వచ్చారు. మొత్తం 25 మంది తహశీల్దార్లు. మరో ఐదుగురికి తహశీల్దార్‌గా పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్ నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాగా అప్పటి కలెక్టర్ ప్రద్యుమ్న సీసీఎల్ నుంచి ఉత్తర్వులు వచ్చిన అనంతరం రెండు రోజులు అధ్యయనం చేసి, తహశీల్దార్లకు ఆయా మండలాలలో పోస్టింగులు ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన రెండుమూడు రోజులలో ప్రద్యుమ్న బదిలీపై వెళ్లిపోయారు. ఆయన వెళ్లారో లేదో పాలన గాడి తప్పిం ది. ప్రద్యుమ్న ఇచ్చిన నియామాకాలను రద్దు చే స్తూ రోజుకో ఆర్డర్‌ను జారీ చేస్తున్నారు. ఒక్కో తహశీల్దార్‌కు నాలుగేసి మండలాల కు బదిలీలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా రెవెన్యూ శాఖలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఎప్పుడు ఏ తహశీల్దార్ ఎక్కడికి బదిలీ అవుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
కొన్ని బదిలీలు ఇలా..
కోటగిరి తహశీల్‌దార్‌గా శంకర్‌సింగ్‌ను గత కలెక్టర్ ప్రద్యుమ్న నియమించారు. ప్రద్యుమ్న వెళ్లిన నాలుగు రోజులకే శంకర్‌సింగ్‌ను బీర్కూర్ తహశీల్‌దార్‌గా,అటునుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి తహశీల్దార్ ప్రసాద్‌ను పది రోజుల్లో భిక్కనూర్ తహశీల్‌దార్‌గా, అక్కడి నుంచి నిజామాబాద్ ఆర్‌డీఓ కార్యాలయంలో ఏఓ పోస్టింగ్, వెనువెంటనే బీర్కూర్ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. నిజాంసాగర్ తహశీల్దార్ సాలంబియాను వారం తిరక్క ముందే కామరెడ్డి ఆర్‌డీఓలో ఏఒగా నియమించారు.
మళ్లీ రెండు రోజులు గడువకముందే లింగంపేట్ తహశీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఎల్లారెడ్డి తహశీల్దార్ గణేష్‌ను రెంజల్‌కు పంపించారు. తాడ్వాయి తహశీల్‌దార్ రాజును మూడే రోజుల్లో నవీపేట్ తహశీల్‌దార్‌గా బదిలీ చేశారు. భిక్కనూర్ తహశీల్దార్ నాగజ్యోతిని కలెక్టరేట్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలని అధికారు లు ఆదేశించారు. ఇలా రోజుకో తహశీల్దార్ బదిలీ కావడంతో రెవె న్యూ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
బదిలీలాట
Published Thu, Jul 10 2014 4:13 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement