గండుగులపల్లి (దమ్మపేట): అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అశ్వారావుపేట నియోజకవర్గ అధికారులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయన శనివారం గండుగులపల్లిలోని స్వగృహంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి నియోజకవర్గంలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆయన ఏమన్నారంటే...
ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలవడం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్ల బాగోగులు చూడటంలో అధికారులు విఫలమయ్యూరు ( (అధికారులపై అసహనం).
గండుగులపల్లిలోని రోడ్డుకు ఆరేళ్ల క్రితం వర్షాలతో గండి పడితే ఇప్పటివరకు మరమ్మతు చేయలేదు. ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తోందా..(ఆగ్రహం)?
మీ పనితీరులో నేటి నుంచే మార్పు రావాలి. బాధ్యతగా పనిచేయాలి. స్థానికంగా నివాసముండాలి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించండి. ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాలతో సమానంగా చూడండి.అశ్వారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మోడల్‌గా తీర్చిదిద్దాలి.
జనవరి 1 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి. కార్యాలయ ఆవరణలో గార్డెన్ పెంచాలి.
జనవరి మొదటి వారం నుంచి సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా అవుతుంది. దీనిని ఎంపీడీఓలు పర్యవేక్షించాలి.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలి. మీరు (అధికారులు) పనులను సక్రమంగా చేస్తే.. ఆ కీర్తి మీకే దక్కుతుంది. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే.. వారి పని విధానమే కారణం. మీరు కూడా వారిలాగా పేరు తెచ్చుకోవాలి.
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో పైరవీలకు ప్రాధాన్యమిస్తే సహించను (హెచ్చరిక).
ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయూలని, సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో ఆయన శనివారం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే...
తల్లిదండ్రులు, ఈ సమాజం దయతో మనందరికీ మంచి అవకాశాలు వచ్చారుు. సమాజంపట్ల అంకితభావంతో పనిచేయాలి.
సత్తుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే మార్గదర్శకం(రోల్ మోడల్)గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
రాజకీయ నాయకులు వస్తారు.. పోతారు. మాకన్నా మీ పైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి.
మిమ్మల్ని మంత్రిగా ఆదేశించటం లేదు.. ప్రాధేయపడుతున్నా. ప్రజల కోసం మనందరం కలిసి సత్సంకల్పంతో పనిచేద్దాం.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదు (హెచ్చరిక).
పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల విచారణను ఇప్పటివరకు పూర్తిచేయలేకపోయారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది..? గ్రామాలలో ఎవరు లబ్ధిదారులో.. ఎవరు కాదో తేల్చడానికి వీఆర్వోలు, వీఆర్‌ఏలకు ఎందుకింత సమయం పడుతోంది?
ఏ ఆధారం లేని వారికి తినటానికి బియ్యం ఇద్దామన్నా మీ కారణంగా ఆలస్యమవుతోంది. పేదల విషయంలో తప్పు చేయవద్దు. అర్హులకు అన్యాయం జరగకూడదు. ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈసారి పర్యటనప్పుడు.. ‘పెన్షన్ రాలేదు.. కార్డులు రాలేదు.. సంక్షేమ పథకాలు అందలేదు’ అనే ఫిర్యాదులు రాకూడదు.
మీకు పై అధికారుల నుంచి పరిపాలనాపరంగా ఇబ్బందులేమైనా వస్తే నేరుగా నా దృష్టికి తీసుకురండి. వాటిని తొలగించాల్సిన బాధ్యతను నేను తీసుకుంటా.
నిధుల కొరత లేదు. అభివృద్ధిని పరుగులు పెట్టించండి.
ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఖమ్మం ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Published Sun, Dec 28 2014 1:47 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement