హైదరాబాద్: రేషన్ షాపుల్లో వినియోగదారులకు ఇవ్వాల్సిన సరుకులు దారి తప్పుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలోనే రేషన్ షాపుల ఫిర్యాదులకు 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆరు కేజీల బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గురువారం సికింద్రాబాద్ లో రేషన్ షాపుల పనితీరుపై సమీక్ష నిర్వహించిన తలసాని అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారులు నిత్యం తనిఖీలు చేసి ప్రజలకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్న రేషన్ షాపులను మార్చాలని ఆయన సూచించారు. నెలలంతా నిర్ణీత వేళలో షాపులు తెరచి ఉంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు.