
ట్యాంక్‌బండ్‌పై సాహూ విగ్రహం నెలకొల్పాలి
సాహూ సతీమణి శోభ
మాణిక్యాపూర్(భీమదేవరపల్లి) : కొమురంభీం చరిత్రను వెలికితీసి, గోండుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజాకవి కామ్రెడ్ సాహూ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పాలని సాహూ సతీమణి శనిగరం శోభ కోరారు. సాహూ వర్ధంతి సభ ఆయన స్వగ్రామం మాణిక్యాపూర్‌లో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సాహూ మెమోరియ ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులతో ర్యాలీ నిర్వహించారు. శోభ మాట్లాడుతూ తన భర్త నక్సలైట్ ఉద్యమంలో కొనసాగుతూ ఆదిలాబాద్‌లోని గోండుల సమస్యల పరిష్కారానికి వారి భాష నేర్చుకుని పోరాడారన్నారు.
సాహూ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. సర్పంచ్ వనపర్తి రాజయ్య, ఎంపీటీసీ గడ్డం వెంకన్న, జేఏసీ నాయకులు డ్యాగల సారయ్య, చెప్యాల ప్రభాకర్, మానవ వికాస వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రొంటాల బుచ్చయ్య, లోక్‌సత్తా నాయకులు బెల్లి రాజయ్య, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ఇంద్రసేన, పెట్టం రాంనారాయణ, పులి జగ న్నాథం, ట్రస్ట్ సభ్యులు ఉగ్గె శేఖర్, బండి రమేశ్, తూముల స్వామి, తాళ్లపల్లి జగన్, ప్రభాకర్, సాంబరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.