పన్ను ఎగవేతదారులకు ఇన్‌ఫార్మర్లతో కళ్లెం!
- మంత్రి తలసానితో చర్చించిన కమిషనర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల శాఖల తరహాలో రాష్ట్ర వాణిజ్యపన్నుల(సీటీ) శాఖకు ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను తీసుకొచే ్చ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సెంట్రల్ ఎక్సైజ్, ఆదాయపన్ను శాఖల్లో ఇప్పటికే అమలవుతున్న ఈ విధానాన్ని తొలి సారిగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పన్ను ఎగవేతదారుల పై ప్రయోగించనున్నారు. హై దరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని నిర్ణయిం చింది. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. వాణిజ్యపన్నుల శాఖకు మంత్రిగా నియమితులైన తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సీటీ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చర్చలు జరిపారు.
కంపెనీల మాజీలపై వల: అక్రమార్కులు ప్రభుత్వం కళ్లు కప్పినా, ఆయా కంపెనీలు, వ్యాపార సంస్థ ల్లో పనిచేసే వారితోపాటు, అందులో మాజీ ఉద్యోగులకు పన్ను ఎగవేతదారులు, జీరో దందా చేసే వారి వివరాలు తెలుస్తాయన్న ఆలోచనతో ఉన్న అధికారు లు వారిపై వల వేయాలని నిర్ణయించారు. పన్ను ఎగవేతదారులు, జీరో దందా చేసే అక్రమార్కుల గురించి సరైన వివరాలు అందించే ఇన్‌ఫార్మర్లకు రూ. 50 వేల వరకు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు.
ఇలా ముందుకు వచ్చే వ్యక్తులతో ఉన్నతాధికారులతో కూ డిన ఓ కమిటీ మాత్రమే సంబంధాలు ఏర్పా టుచేసుకొని, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం లేదా కొత్తగా ఏర్పాటు చే యాలని భావిస్తున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌టీంతో దాడు లుచేయించాలని భావిస్తోంది. కాగా, ఇన్‌ఫార్మర్లు ఎవరనే విషయం సీటీవో స్థాయి అధికారులకు కూడా తెలి యనీయకూడదని నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపా రు. వారంలోగా విధివిధానాలను రూపొందించి, ఇన్‌ఫార్మర్లను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది.