'నిలదీస్తామని భయంతోనే సస్పెన్షన్'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని సభ నుంచి సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే జాతీయ గీతాన్ని అడ్డం పెట్టుకొని సభనుంచి సస్పెండ్ చేశారని వారిద్దరూ విమర్శించారు.
జాతీయ గీతం విషయంలో ఎన్నిసార్లు అయినా క్షమాపణలు చెపుతామన్నారు. గవర్నర్ సాక్షిగా మాపై దాడి చేసిన టీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. కేసీఆర్, అల్లుడు, కుమారుడు సభలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎర్రబెల్లి, రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వం తెలంగాణ టీడీపీపై కక్ష సాక్షింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వరకూ పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.