'తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది'
మెదక్ టౌన్ : తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషి ఎనలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులకు సంబంధించిన హెల్త్‌కార్డుల ధరఖాస్తు ఫారాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎలా అయితే పని చేశారో బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ పాత్రికేయులు అలాగే పనిచేయాలన్నారు. సమాజంలోని లోటుపాట్లను ప్రజలకు తెలియజేసేది మీడియానేనన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాత్రికేయుల కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.10కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దేవయ్య, శ్రీనివాస్‌రెడ్డి, కామాటి కిషన్, శంకర్ దయాల్‌చారి, నాగరాజు, సురెందర్‌రెడ్డి, గోపాల్, సంగమేశ్వర్, రహ్మత్ అలీ తదితరులు ఉన్నారు.