సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించే అవకాశాలున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 22తో సమావేశాలు ముగియాల్సి ఉంది. అయితే 23న ఆదివారం కావడంతో మరో రెండు పనిదినాలు సమావేశాలను పొడిగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పొడిగింపు జరిగిన పక్షంలో మంగళవారంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.