
'పండుగ వేళ చావుడప్పు మోగడం బాధాకరం'
పండుగ వేళ రైతుల ముంగిట్లో చావుడప్పు మోగడం బాధాకరమన్నారు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి.
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగడం విషాదమని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి అన్నారు. రుణాలు లభించకపోవడం, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో ఇప్పటివరకు 200 మందిపైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. పండుగ వేళ రైతుల ముంగిట్లో చావుడప్పు మోగడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆత్మహత్యలు నివారించేలా అన్నదాతలకు భరోసా ఇవ్వాలన్నారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 శాతం రుణమాఫీ బ్యాంకుల్లో జమ అయినా కొత్త రుణాలు రావడం లేదని ఆరోపించారు. రుణమాఫీ జాప్యం కావడంతో రైతులు పంటబీమా అవకాశం కోల్పోతున్నారని పొన్నాల, జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.