హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి అంటే తాగడం, తినడం కాదని.. ఎదుటివారిని గౌరవించడం, ప్రేమించడమే తెలంగాణ సంస్కృతి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. అన్నా హజారే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సంపూర్ణ మద్యనిషేధం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రకుమార్ మాట్లాడుతూ... మద్యం మత్తు వీడినప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మద్యరహిత సమాజాన్ని ప్రజలు కోరుకున్నారని గుర్తు చేశారు. నాటి ప్రజల స్వప్నాన్ని సాకారం చేసేలా మద్యరహిత సమాజాన్ని స్థాపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అన్నా హజారే ఫౌండేషన్ అధ్యక్షులు రంగయ్య గౌడ్, పీవోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య,అఖిల భారత మహిళా ఫెడరేషన్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రేమించడమే తెలంగాణ సంస్కృతి
Published Sun, Oct 26 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM
Advertisement