ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు | Telangana government announces State Level Awards for 52 members | Sakshi
Sakshi News home page

ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు

Published Wed, May 31 2017 5:34 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు

ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు

జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. 2017 ఏడాదికిగానూ పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 52 మంది ప్రముఖులను ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదన మేరకు ఈ ప్రముఖులకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో అవార్డులు అందజేసి, సత్కరించనున్నారు.

          రంగం         -            అవార్డు అందుకోనున్న ప్రముఖులు

  • సాహిత్యం - వెలపాటి రమారెడ్డి, అశారాజు, జుపాక సుభద్ర, అస్లాం ఫర్షోరి(ఉర్దూ)
  • శాస్త్రీయ నృత్యం - రాఘవరాజ్ భట్-మంగళా భట్, బి. సుదీర్ రావు
  • పేరిణి - పేరిణి కుమార్
  • జానపదం - దురిశెట్టి రామయ్య, కేతావత్ సోమ్లాల్, గడ్డమ్ సమ్మయ్య
  • సంగీతం - ఎం. రాజోల్కర్, వార్సి సోదరులు
  • సామాజిక సేవ - వందేమాతరం ఫౌండేషన్, యాకుబ్ బీ
  • జర్నలిజం - పీవీ శ్రీనివాస్, ఏ రమణకుమార్, బిత్తిరి సత్తి- సావిత్రి (రవి - శివజ్యోతి) ఎలక్ట్రానిక్ మీడియా, వి.సతీష్, మహ్మద్ మునీర్
  • ఫొటో జర్నలిజం - అనిల్ కుమార్
  • సినిమా జర్నలిజం - హెచ్. రమేశ్ బాబు
  • వైద్య రంగం - డాక్టర్ బిరప్ప, నిమ్స్, డాక్టర్ చారి (వెంకటాచారి), సిద్ధా మెడికల్ ఆఫీసర్
  • టీచర్స్ - డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి, టీఎస్ఎం అండ్ జీ జూనియర్ కాలేజీ, వీణవంక, కరీంనగర్
  • అంగన్‌వాడీ టీచర్ - ఎం బిక్షపమ్మ
  • ఉద్యమ గానం- కోడారి శ్రీను, వొళ్లాల వాణి, అవునూరి కోమల, అభినయ శ్రీనివాస్
  • పెయింటింగ్ - తోట వైకుంఠం
  • శిల్పకళలు - శ్రీనివాస్ రెడ్డి
  • శాస్త్రవేత్త - డా. ఎస్ చంద్రశేఖర్, ఐఐసీటీ డైరెక్టర్
  • కామెంటరీ/ యాంకరింగ్ - మడిపల్లి దక్షిణామూర్తి
  • అర్చకుడు - పురాణం నాగయ్య స్వామి, కొక్కెర కిష్టయ్య (మేడారం)
  • ఆథ్యాత్మికవేత్త - ఎం సంగ్రామ్ మహరాజ్, ఉమాపతి పద్మనాభ శర్మ, మహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్ హదీస్ (మౌల్వీ), ప్రొఫెసర్ పెనుమాళ్ల ప్రవీణ్ ప్రబు సుధీర్ (బిషప్/ ఫాదర్)
  • థియేటర్ - దెంచనాల శ్రీనివాస్, వల్లంపట్ల నాగేవ్వర్ రావు
  • క్రీడలు - తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ - హకీంపేట్, యెండల సౌందర్య (హాకీ)
  • వేదపండిత్‌ - నరేంద్ర కాప్రె
  • బెస్ట్‌ లాయర్‌ - జె.రాజేశ్వరరావు
  • మున్సిపాలిటీ - సిద్దిపేట
  • గ్రామ పంచాయతీ - శ్రీనివాస్‌నగర్‌ (మానకొండూరు)  
  • ఉత్తమ ఉద్యోగి - నేతి మురళీధర్‌ (ఎండీ, టెస్కాబ్‌ ), ఎన్ అంజిరెడ్డి, ఏఈఎస్
  • ఉత్తమ రైతు - కండ్రె బాలాజీ (కెరమెరి గ్రామం, కొమురం భీమ్ జిల్లా)  
  • స్పెషల్ కేటగిరీ (ఈల పాట) - గడ్డం నర్సయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement