సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని మంగళవారం తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు న్యాయమూర్తుల బదిలీలు, ప్రమోషన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రమోషన్లతో కూడిన న్యాయమూర్తుల వార్షిక బదిలీలను కూడా నిలిలివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత, అత్యవసర దరఖాస్తులను పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మూసివేసిన విషయం తెలిసిందే. అత్యవసర పిటిషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment