హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 61.41శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగా బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సరైన సమయంలో ఫలితాలను విడుదల చేసినందుకు కడియం శ్రీహరి ఈ సందర్భంగా అధ్యాపకులకు, ఇంటర్ బోర్డును అభినందించారు.
ఈ ఏడాది 3లక్షల 78వేల 978 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... 61.4శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 55.91 శాతం కాగా... బాలికలు 66.86శాతం ఉత్తీర్ణతలో పైచేయి సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. 75 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా, 58శాతం ఉత్తీర్ణతతో నల్లగొండ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడవు మే 6తో ముగియనుంది.
విద్యార్థులు www.sakshieducation.com, http://examresults.tc.nic.in, http://re sults.cgg.gov.in తదితర వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు. కళాశాలల ప్రధానోపాధ్యాయులు తమ కళాశాల ఫలితాలను - http://bie.telangana.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
Published Mon, Apr 27 2015 10:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement