సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయరంగం కాళేశ్వరం ప్రాజెక్టుతో సమూలంగా మారబోతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయ రంగం కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు, కాళేశ్వరం ప్రాజెక్టుకు తరువాత అని మాట్లాడుకుంటారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టికి ఈ ప్రాజెక్టు తార్కాణంగా నిలుస్తుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వెట్ రన్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిరంతరం కష్టించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లూ గోదావరి నీళ్లన్నీ వృధాగా సముద్రంలో కలిసిపోయాయని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు గోదారి నీళ్లు మళ్లించేందుకు పాలకులు ఎవరూ చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా కాళేశ్వ రం నిలవబోతుందని, తెలంగాణ బీళ్లు గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కాబోతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment