
‘కృష్ణా’పై ఏకపక్ష నిర్ణయాలా..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీపై తెలంగాణ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారంలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని విషయాల్లో ఏపీకి వంతపాడుతున్నార ని భావిస్తోంది. ప్రాజెక్టుల నియంత్రణ, టెలీ మెట్రీ అంశాల్లో సమీర్ చటర్జీ వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలె త్తుతున్నాయని, ఆయనను పదవి నుంచి తొలగించాలని త్వరలోనే కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది.
నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహ రిస్తున్నారని తొలి నుంచీ ఆయనపై రాష్ట్రం గుర్రుగా ఉన్నా, కేంద్రానికి నేరుగా ఫిర్యాదు చేయలేదు. ఇటీవల కృష్ణా బేసిన్‌లో టెలీమెట్రీ పరికరాల అంశంలో చటర్జీ ఏకపక్షంగా వ్యవ హరించారు. పోతిరెడ్డి పాడు, సాగర్ ఎడమ కాల్వలపై టెలీమెట్రీ అమర్చే క్రమంలో తెలంగాణకు కనీస సమాచారం ఇవ్వకుం డానే మార్పులు చేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులు లేనం దున, ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవస రం లేదని పలు వేదికలపై తెలంగాణ విన్నవిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా తామిచ్చిన ఢ్రాప్ట్ నోటిఫి కేషన్‌పై ఇటీవల సమీర్ చటర్జీ రాష్ట్ర అభిప్రా యాలు కోరారు. ఇది కూడా రాష్ట్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ దృష్ట్యా సమీర్ చటర్జీ వ్యవహారాన్ని నేరుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది.