నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను బదిలీ చేయాలని కోరుతూ ఆ జిల్లా ఎమ్మెల్యేలు కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నిజామాబాద్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను బదిలీ చేయాలని కోరుతూ ఆ జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. మంత్రి పోచారంతోపాటు ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, గంపాగోవర్దన్, బాజిరెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, హనుమంతుషిండే, గణేశ్ గుప్త, షకీల్‌అహ్మద్ తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం కలిశారు.
తెలంగాణ సంబురాలను వారం రోజుల పాటు నిర్వహిస్తే ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగంతో కలెక్టరు నిర్వహిం చుకున్నారని వారు ఫిర్యాదు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం ఫోన్లు చేసినా, ఎమ్మెల్యేలు కార్యాలయాలకు వెళ్లినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టుగా ఎమ్మెల్యేలు వెల్లడించారు.