జోగిపేట : పట్టణంలో గత నెల జరిగిన హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జోగిపేటలో గురువారం కలకలం రేపింది. వివరాలి లా ఉన్నాయి.. మే 29వ తేదీ వేకువజామున నర్రా ఆంజనేయులు (30)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఆంజనేయులు హత్యకు సంబంధించిన వివరాలు అత డి సోదరుడైన పెంటయ్యకు తెలిసి ఉం టాయని కుటుంబ సభ్యులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెంటయ్యను శనివారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు.
హత్యకు సంబంధించిన వివరాలు తెలిసి ఉంటే చెప్పాలని కోరినా అతడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆదివారం ఇంటికి పంపి సోమవారం తిరిగి రావాలని సూచించారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన పెంటయ్య గురువారం పశువుల పాక వద్ద గల చింత చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన పెంటయ్య తల్లి రత్నమ్మ కుటుంబ సభ్యులకు తెలి యజేసింది. సమాచారం అందుకున్న సీఐ నాగయ్య, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు గ్రా మానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటనా స్థలంలో ఉన్న ఖాళీ బీరు బాటిల్, సిల్‌తో ఉన్న గుళికల ప్యాకెట్‌ను గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు
గత నెల పెద్ద కూతురు వివాహం చే యడంతో ఆర్థిక ఇబ్బందులు, అదే నెలలో సోదరుడు ఆంజనేయులు మృతితో మానసికంగా కృంగిపోయిన తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుశీల జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి పెద్ద కుమార్తె నవనీతకు వివాహం కాగా కుమారుడు శివకుమార్, మరో కుమార్తె భవానీలు ఉన్నారు. జోగిపేట ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్య
Published Fri, Jun 19 2015 1:20 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement