
ప్రాణం తీసింది
మరికల్: ధన్వాడ మండలం లాల్‌కోట చౌరస్తా సమీపంలో ఈనెల 7న సంచలనం రేపిన వ్యక్తి హత్యకేసు మిస్టరీని పోలీ సులు ఛేదించారు. వివరాలను సోమవా రం మరికల్ ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు. చిన్నచింతకుంట మం డలం పర్దీపూర్ గ్రామానికి చెందిన వడ్ల సత్యానారాయణ(36) అదే గ్రామానికి చెందిన పంతులు విజయ్‌భాస్కర్ భార్య తో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలుసుకున్న భర్త భార్య, సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు.
అయినా వారి ప్రవర్తనలో మార్పురాలేదు. చివరికి సత్యనారాయణను మట్టుబె ట్టేందుకు పథకం రచించాడు. ఇదిలాఉండగా, విజయ్‌భాస్కర్ వృత్తిరీత్యా డ్రైవర్. వరంగల్ జిల్లా కుర్వి మండలం నారాయణపురం గ్రామం కొత్తతండాకు చెందిన ఐదుగురు యువకులతో పరిచయం ఏర్పర్చుకున్నాడు.
తన భార్య వివాహేతర సంబంధం విషయాన్ని వారికి వివరించారు. కొత్తతండాకు చెందిన ఐదుగురు యువకులతో నెలరోజుల క్రితం ధన్వాడ మండలం పర్దీపూర్ పక్కనే ఉన్న పళ్లమారి గ్రామానికి చేరుకుని తన స్నేహితుడు రాజుతో కలిసి హత్యకు పథకం రచించారు. ఈ క్రమంలో సత్యనారాయణ రోజువారీ కార్యకలాపాలను ఆరాతీశారు.
ఏం జరిగిందంటే..
ఎలక్ట్రికల్ వర్కర్ అయిన సత్యనారాయ ణ ఈనెల 7న సామగ్రి కోసం దేవరకద్ర కు వెళ్లి బైక్‌పై పర్దీపూర్‌కు వస్తుండగా.. మార్గమధ్యంలో ధన్వాడ మండలం లాల్‌కోట చౌరస్తా సమీపంలో గల రైల్వేవంతెనపై భూక్యా శ్రీధర్ అతడిని ఢీకొట్టాడు. బానోత్ ఆంజనేయులు, బానోత్ లాలు అనే వ్యక్తులు కళ్లలో కారంపొడి చల్లగా బానోత్ కిషన్, మాల్గోతు లింగన్న, శ్రీధ ర్ కలిసి సత్యనారాయణను వేటకోడవళ్ల తో దారుణంగా నరికిచంపారు.
అక్కడినుంచి దుండగులు దేవరకద్ర వైపునకు పరారయ్యారు. అన్నికోణాల్లో విచారిం చిన పోలీసులు ఈనెల 17న లాల్‌కోట చౌరస్తా సమీపంలో నిందితుల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. హత్యకు సూత్రధారి రాజు పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్ వెల్లడించారు.