వేములవాడ : మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా వార్తల్లోకెక్కిన ఎల్లం గౌడ్‌పై వేములవాడ ఠాణా పరిధిలోనూ అరెస్ట్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. మంగళవారం ఆయన హైదరాబాద్ కోర్టులో లొంగిపోయిన దరిమిలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2006లో జరిగిన ఓ దారిదోపిడీలో నిందితుడిగా ఉన్న ఆయన రెండేళ్లుగా కోర్టుకు గైర్హాజరవుతుండడంతో అరెస్ట్‌వారెంట్ జారీ అయ్యింది. వేములవాడకు చెందిన ఉపాధ్యాయ దంపతులు బోయినపల్లి మండలం కొదురుపాకలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తుండగా ఈదారిదోపిడీ జరిగింది.
అంబటి ఎల్లంగౌడ్‌తోపాటూ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సయ్యద్ అన్వర్, ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన పత్తెం మహేందర్ ఉరఫ్ మహేశ్ ఈదోపిడీ ముఠాలో భాగస్వాములయ్యారు. పోలీసులకు పట్టుబడ్డ ఈ ముఠా కోర్టుద్వారా బెయిల్ పొందింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరు రెండేళ్లుగా కోర్టుకు గైర్హాజరవుతుండటంతో అరెస్టు వారంట్ జారీ అయినట్లు వేములవాడ టౌన్ సీఐ సీహెచ్.దేవారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కోర్టులో లొంగిపోయిన ఎల్లంగౌడ్‌ను త్వరలోనే వేములవాడ కోర్టులో హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఎల్లంగౌడ్‌పై అరెస్ట్ వారెంట్
Published Wed, Aug 27 2014 1:54 AM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM
Advertisement