ellam goud
-
దొంగనోట్ల కేసులో నిందితుడిపై కత్తులతో దాడి
హైదరాబాద్: దొంగనోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్‌పై ప్రత్యర్థులు విచక్షణా రహితంగా దాడి చేసింది. కత్తులతో దాడిచేయడంతో ఎల్లంగౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఎల్లంగౌడ్‌ను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. 2014 సంవత్సరం శామీర్‌పేట్‌లో ఎల్లంగౌడ్ పోలీసులపై దాడి చేశాడు. ఈ సంఘటనలో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మృతిచెందగా..ఎస్ఐ వెంకట్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసు కాల్పుల్లో ఎల్లంగౌడ్ గ్యాంగ్ సభ్యుడు కూడా మృతిచెందాడు. అప్పటి నుంచి ఎల్లంగౌడ్ పరారీలో ఉన్నాడు. ఇటీవల ఎల్లంగౌడ్‌ను మహారాష్ట్రలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి నేపథ్యంలో మరో మారు ఎల్లంగౌడ్ తెరపైకి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎల్లంగౌడ్‌పై అరెస్ట్ వారెంట్
వేములవాడ : మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా వార్తల్లోకెక్కిన ఎల్లం గౌడ్‌పై వేములవాడ ఠాణా పరిధిలోనూ అరెస్ట్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. మంగళవారం ఆయన హైదరాబాద్ కోర్టులో లొంగిపోయిన దరిమిలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2006లో జరిగిన ఓ దారిదోపిడీలో నిందితుడిగా ఉన్న ఆయన రెండేళ్లుగా కోర్టుకు గైర్హాజరవుతుండడంతో అరెస్ట్వారెంట్ జారీ అయ్యింది. వేములవాడకు చెందిన ఉపాధ్యాయ దంపతులు బోయినపల్లి మండలం కొదురుపాకలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తుండగా ఈదారిదోపిడీ జరిగింది. అంబటి ఎల్లంగౌడ్తోపాటూ కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సయ్యద్ అన్వర్, ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన పత్తెం మహేందర్ ఉరఫ్ మహేశ్ ఈదోపిడీ ముఠాలో భాగస్వాములయ్యారు. పోలీసులకు పట్టుబడ్డ ఈ ముఠా కోర్టుద్వారా బెయిల్ పొందింది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరు రెండేళ్లుగా కోర్టుకు గైర్హాజరవుతుండటంతో అరెస్టు వారంట్ జారీ అయినట్లు వేములవాడ టౌన్ సీఐ సీహెచ్.దేవారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కోర్టులో లొంగిపోయిన ఎల్లంగౌడ్‌ను త్వరలోనే వేములవాడ కోర్టులో హాజరు పరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మీడియా ముందుకు ఎల్లంగౌడ్
-
నన్ను ఎన్కౌంటర్ చేయొద్దు: ఎల్లంగౌడ్
సాక్షి, హైదరాబాద్: దయచేసి తనను ఎన్కౌంటర్ చేయొద్దని నకిలీ నోట్ల తయారీ ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ పోలీసులను వేడుకుంటున్నట్లుగా ఉన్న సీడీలు కలకలం రేపాయి. ఈ సీడీలు గురువారం పలు మీడియా సంస్థల కార్యాలయాలకు చేరాయి. అందులో తనను ఎన్కౌంటర్ చేయొద్దని, పోలీసుల ముందు లొంగిపోతున్నానని ఉంది. ఎల్లంగౌడ్ మంగళవారం సైబరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ సీడీలను రూపొందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీసులు మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎల్లంగౌడ్ ఇంట్లో గురువారం సోదాలు నిర్వహించారు. స్కానర్‌తోపాటు ఇతర వస్తువులు, నకిలీ నోట్లు లభించినట్లు తెలిసింది. -
‘నకిలీ నోట్ల’ ఎల్లంగౌడ్ లొంగుబాటు
కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలతో సంబంధాలపై ఆరా ఫలించిన కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరికలు హైదరాబాద్: సైబరాబాద్ పోలీసుల హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ ఎట్టకేలకు లొంగిపోయాడు. మజీద్‌పురా డెకాయి ఆపరేషన్‌లో కానిస్టేబుల్ ఈశ్వర్రావును చంపి పరారైన ఎల్లంగౌడ్ కోసం 18 రోజులుగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14న శంషాబాద్ ఎన్కౌంటర్లో చైన్‌స్నాచర్ శివ మృతి చెందిన సందర్భంగా కమిషనర్ ఎల్లం గౌడ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకకు పారిపోయిన అతడు మెదక్ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది, బీజేపీ నేతతో కలసి సైబరాబాద్ పోలీసుల ఎదుట మంగళవారం రాత్రి వచ్చి తుపాకీ సహా లొంగిపోయాడు. నకిలీ నోట్ల తయారీ ముఠాలోని మెదక్ జిల్లా సిద్దిపేటకు చెంది ముస్తఫా, శ్రీకాంత్, ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు అదే ముఠాకు చెందిన రఘు, నరేష్లతో బాలానగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకట్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఈ నెల 1న మజీద్‌పూర్ చౌరస్తా వద్ద డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లం గౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు కత్తిపోట్లకు గురై మృతి చెందగా.. వెంకట్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన మస్తాన్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముఠా నాయకుడు ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు కమిషనర్ సీవీ ఆనంద్ నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో అతను కర్ణాటకకు పారిపోయాడు. తాజాగా కమిషనర్ హెచ్చరికలతో న్యాయవాదితో వచ్చి లొంగిపోయాడు. ఆరా తీస్తున్న పోలీసులు...: మెదక్ జిల్లా సిద్దిపేట కేంద్రంగా నకిలీ నోట్ల దందా కొసాగిస్తున్న ఎల్లం గౌడ్‌కు కర్ణాటక, మహారాష్ట్రలలోని మరిన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఎల్లం గౌడ్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి నకిలీ నోట్లు ఏఏ రాష్ట్రాలకు వెళ్లాయి...ఈ ముఠా వెనుక ఇంకెందరున్నారు, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయాలపై విచారిస్తున్నారు. ఎల్లం గౌడ్‌పై కర్ణాటక, మహారాష్ట్రలలో పెండింగ్ ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లపైనా ఆరా తీస్తున్నారు. ఎల్లం గౌడ్ ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం వీరి అరెస్టును చూపించే అవకాశాలు ఉన్నాయి. -
నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టు
-
నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టు
నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. అతడిని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట ప్రాంతంలో ఎల్లంగౌడ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఎల్లంగౌడ్ పోలీసుల మీదే కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడి అనుచరుడితో పాటు కానిస్టేబుల్ కూడా మృతి చెందారు. ఇదే కాల్పుల్లో ఎస్ఐ వెంకట్ రెడ్డి కూడా తీవ్రంగా గాయపడి చాలాకాలం పాటు చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఎల్లంగౌడ్ అరెస్టు కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్లంగౌడ్ మహారాష్ట్రకు పారిపోయి ఉంటాడనే పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు తరచు తన భార్యకు ఫోన్ చేస్తుండటంతో ఆమె కాల్ డేటా ఆధారంగా అతడున్న ప్రాంతం వివరాలు సేకరించి అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. అయితే, అతడు స్వయంగా కమిషనర్ ముందు లొంగిపోయాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.