విద్యుత్ తీగలు తగిలి ఓ గిరిజన యువకుడు మృతిచెందాడు.
విద్యుత్ తీగలు తగిలి ఓ గిరిజన యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మదకం మహేష్(24) వేటాడటం కోసం విద్యుత్ తీగలతో ఉచ్చు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తానే ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకి అక్కడిక క్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.