సాక్షి, హైదరాబాద్: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకుసాగాలని రవాణా శాఖ వుంత్రి పి.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వుువ్వెన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సర్వోతోమఖాభివృద్ధికి పునరంకితవువుదావుని, జిల్లాను అన్ని రంగాల్లో వుదుకు తీసుకెళ్లెందుకు కృషి చేస్తానని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు వలిక సదుపాయూలు కల్పించేందుకు మన ఊరు-మన ప్రణాళిక కింద జిల్లాలో రూ.1,744.56 కోట్లతో 3,847 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వుంత్రి వివరించారు. ప్రతి గ్రామ పరిధిలో వుూడు పనులు, వుండల స్థారులో పది, జిల్లా స్థారుులో 40 పనులు తక్షణమే చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రధానంగా తాగునీరు, అంతర్గత రోడ్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం, డంపింగ్ యూర్డులు, శ్మశానవాటిక,పార్కుల వంటి అభివృద్ధి పనులు చేపడుతావున్నారు. జిల్లాలో పాలవుూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 18 వుండలాలలోని 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.5.73 కోట్లతో సర్వే పనులు చేపట్టడానికి ప్రభుత్వం నిధులు వుంజూరు చేసిందన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనువుగా ఉన్న 18 వేల ఎకరాల భూమిని గుర్తించావున్నారు.
వికారాబాద్ సమీపంలోని పూడూరులో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం 2900 ఎకరాల భూమిని కేటారుుంచినట్లు ఆయున తెలిపారు. చేవెళ్ల, సర్థార్‌నగర్, నాదర్‌గుల్, శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సు డిపోల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశావుని, కొత్తగా 14 డిపోల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టు ప్రకటించారు. రైతు రుణవూఫీలో భాగంగా జిల్లాలో 2.26 లక్షల వుంది రైతులకు రూ.998 కోట్ల రుణాలు మఫీ చేసినట్లు వుంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 1.21 లక్షల వుంది రైతులకు రూ.31 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడితోపాటు ఖరీఫ్, రబీ పంటలకు రూ.714.66 కోట్లు పంట రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. రూ.4.25 కోట్లతో ట్రాక్టర్లు, విత్తన యుంత్రాలు వంటి పరికరాలు ఇస్తున్నావున్నారు.
వున ఊరు- వున కూరగాయులు కార్యక్రవూన్ని చెన్వెల్లి, దేవునిఎర్రవల్లి, కొత్తగడి క్లస్టర్ ప్రాంతాలను ఎంపికచేసి 50శాతం రారుుతీపై ైెహ బ్రీడ్ కూరగాయుల విత్లనాలు అందిస్తున్నావున్నారు. దళితులను అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రవుంలో భాగంగా మొదటి విడతగా నియోజకవర్గానికి ఒక గ్రావూన్ని ఎంపికచేసి 15వుంది లబ్థిదారులకు 45ఎకరాల భూమిని పంపిణీ చేశావున్నారు. దళిత, గిరిజన యుువతులకు కళ్యాణ పథకం కింద రూ.50 వేల ఆర్థిక సాయూన్ని అందిస్తామన్నారు. ఐదు వందలకు పైగా జనాభా ఉన్న 60 గిరిజన తాండాలను గ్రావు పంచారుుతీలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.
13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17 కోట్లు పంచాయుతీలకు విడుదల చేశావున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, వలిక సదుపాయూల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నావున్నారు. 3,928 వుంది ఎస్సీలకు రూ.53 కోట్లు, 8,011 వుంది ఎస్టీలకు రూ.101 కోట్ల ఆర్థిక సాయూన్ని అందించావున్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు జ్యుడీషీయుల్ అధికారులతో ప్రత్యేక ట్రిబ్యూనల్‌ల ఏర్పాటు చేశావున్నారు. వుహిళా సాధికారత కోసం 15,402 గ్రూపులకు రూ.482 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశావున్నారు. జిల్లాలో ఈ ఏడాది 60 లక్షల మొక్కలు నాటనున్నామని, వచ్చే ఏడాది 1.20 కోట్ల మొక్కలు నాటేందుకు వంద నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రవుంలో ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయువుూర్తి, కలెక్టర్ నడిమిట్ల శ్రీధర్, జేసీ చంపాలాల్, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సవురమోధులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంసృ్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మన ఊరు- మన ప్రణాళిక కింద 3,847 అభివృద్ధి పనులు
Published Fri, Aug 15 2014 11:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement