p.mahendar reddy
-
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
చేవెళ్ల: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా రూ.ఐదువేల కోట్లు విడుదల చేసిందని అన్నారు. కూరగాయలు, పూలు, ఇతర పంట ఉత్పత్తుల రవాణాకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైట్‌హాల్ట్ బస్సును (ప్రతిరోజు ఉదయం 4 గంటలకు చేవెళ్ల నుంచి నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు వెళ్తుంది) ఆయన చేవెళ్లలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ.. కూరగాయలు, పూలు ఎక్కువగా పం డించే గ్రామాలకు మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌కు త్వరలో 100 వోల్వో బస్సులు రానున్నాయని చెప్పారు. ఐటీ కంపెనీల్లో 75వేల మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికోసం కొత్తగా 15బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రతి పల్లెకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని పునరుద్ఘాటించారు. రోడ్లు బాగాలేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి బస్సులను వేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, ఎంపీపీ ఎం. బాల్‌రాజ్, జెడ్పీటీసీ చింపుల శైలజ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సామ మాణిక్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు సున్నపు పద్మవసంతం, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ రగడ.. బస్సు ప్రారంభ కార్యక్రమానికి తమకు కనీస సమాచారంలేదని, ప్రొటోకాల్ పాటించలేదని ఎంపీపీ బాల్‌రాజ్, సర్పంచ్ నాగమ్మ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. బస్సు ప్రారంభానికి విచ్చేసిన మంత్రికి ఈ విషయంపై ఫిర్యాదుచేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పందించిన మంత్రి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులు, పార్టీ నాయకులకు సూచించారు. -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ!
వికారాబాద్: కామారెడ్డిగూడలో ఏర్పాటు చేయతలబెట్టిన ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కాగితాలకే పరిమితమైంది. ఆర్టీసీ డ్రైవర్ల శిక్షణకు ఎంతో ఉపయోగపడేవిధంగా రాష్ట్రంలోనే తొలి సారిగా అల్ట్రా మోడల్ టెస్ట్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించినప్పటికి అది అమలుకు నోచుకోలేదు. జిల్లాకు చెందిన పి.మహేందర్‌రెడ్డి రోడ్డురవాణాశాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత తరుణంలోనైనా ఈ కల సాకారం కాగలదని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీకి సుశిక్షితులైన డ్రైవర్ల వ్యవస్థ కీలకం. వీరికి ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ ట్రాక్ లేకపోవడంతో రోడ్లపైనే మెళకువలు నేర్పుతున్నారు. కొత్తగా విధుల్లో చేరే ఆర్టీసీ డ్రైవర్లు మెరుగైన శిక్షణను అందించాలంటే రోజురోజుకు రోడ్లపై ట్రాఫిక్పెరిగిపోవడంతో అది అంత సులువుగా సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకుగానూ మూడేళ్ల కిందట వికారాబాద్ మండలపరిధిలో కామారెడ్డిగూడలో 30ఎకరాల ప్రభుత్వభూమిని పరిశీలించింది. ఇందులో రాష్ట్రంలోనే తొలిసారిగా అల్ట్రా మోడల్ టెస్ట్ ట్రాక్‌ను ఏర్పాటుచేయాలనేది లక్ష్యం. ముఖ్యంగా ఉద్యోగశ్రీ, ఆర్టీసీ ఎంపికచేసిన డ్రైవర్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా అప్పట్లోనే ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సర్వేనంబర్ 101లోని 30ఎకరాలను పరిశీలించారు. ఆ భూమిని తమకు అప్పగించాలంటూ రెవెన్యూశాఖకు రూ.30లక్షల నిధులను ఆర్టీసీ అధికారులు అందజేశారు. అయితే ఆ తర్వాత ఆ ఫైల్‌ను పట్టించుకునేవారే కరవయ్యారు. రెవెన్యూ అధికారుల అలసత్వం వల్లే జిల్లా కలెక్టరేట్లో స్థలానికి సంబంధించిన ఫైల్ రెండేళ్లపాటు మూలిగిందని పేరు తెలపడానికి ఇష్టపడని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమశాఖ సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాతే ఆరునెలల కిందట ఆ ఫైల్ వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వచ్చిందని సదరు అధికారి పేర్కొన్నారు. రెండు నెలల కిందట సబ్‌కలెక్టర్ స్థలాన్ని పరిశీలించి సాధ్యమైనంత తొందరలో ఆర్టీసీకి అప్పగించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు కానీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ అవరోధం..... రైతులకు సంబంధించిన నాలుగు ఎకరాల పట్టాభూమి ఆర్టీసీకి కేటాయించిన 30 ఎకరాల భూమి మధ్యలో ఉంది. ఈ నేపథ్య ంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి రైతులతో పలుమార్లు మాట్లాడి ‘నష్టపరిహారం ఇస్తాం, వెంటనే మీ భూమిని మాకు అప్పగించాల’ని కోరినప్పటికి రైతులు ససేమిరా అంటున్నట్లు సమాచారం.భూమికి బదులు భూమే ఇవ్వండి, నష్ట పరిహారం కింద డబ్బులు అక్కర్లేదని రైతులు సబ్‌కలెక్టర్‌తో పేర్కొన్నట్లు సమాచారం. మంత్రిపైనే భారం ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాతనైనా ఆర్టీసీ డ్రైవర్ల శిక్షణ కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రిగా జిల్లాకు చెందిన మహేందర్‌రెడ్డి ఉన్నందున వెంటనే దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులు మంత్రిని కోరినట్లు తెలిసింది. -
పరిశ్రమలకు జిల్లా అనుకూలం
తాండూరు: కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు జిల్లాలో భూములు సిద్ధంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ పిలుపుతో అనేక పరిశ్రమలు తరలివస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లు పెద్ద కంపెనీలకు ఆహ్వానం పంపగా వారి నుంచి సానుకూల స్పందన వస్తున్నదని, అదే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అధిక మొత్తంలో భూములు ఇస్తామన్నా కంపెనీలు ఆసక్తి చూపడంలేదని అన్నారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా అనుకూలంగా ఉంటుందని, ఆయా కంపెనీలకు అన్ని రకాల అనుమతులు త్వరితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లాలోని భూములను గుర్తించి, పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విభజన ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, కేంద్రం ఆర్టీసీ విభజన, ఆస్తుల పంపకంపై ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసిందని, ఈ విషయమై కేంద్రంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్తున్నామని మంత్రి చెప్పారు. రూ.1,061కోట్ల రుణాలు మాఫీ జిల్లాలో 2.15లక్షల మంది రైతులకు సుమారు రూ.1,061కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి వెల్లడించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో 30,549మంది రైతులకు సుమారు రూ.151కోట్ల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అదే విధంగా జిల్లాలోని పలు మండలాల్లో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావుతో మాట్లాడినట్టు వివరించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, కోట్‌పల్లిలో కొత్తగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, మిగితా నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించామని మంత్రి చెప్పారు. రెండు, మూడు నెలల్లో కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పత్తి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పెసర్లు, మినములు, కంది, ఆముదాల పంటలను ప్రభుత్వం సాధారణ పంటలుగా గుర్తించి, పంట బీమా సదుపాయాన్ని ఈనెల 30వరకు పొడిగించినట్టు వివరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా రూ.50కోట్లతో పాఠశాలల భవనాలు, మౌలిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. టీచర్ల కొరత తీర్చేందుకు సర్కారు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. -
మన ఊరు- మన ప్రణాళిక కింద 3,847 అభివృద్ధి పనులు
సాక్షి, హైదరాబాద్: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకుసాగాలని రవాణా శాఖ వుంత్రి పి.మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వుువ్వెన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సర్వోతోమఖాభివృద్ధికి పునరంకితవువుదావుని, జిల్లాను అన్ని రంగాల్లో వుదుకు తీసుకెళ్లెందుకు కృషి చేస్తానని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వలిక సదుపాయూలు కల్పించేందుకు మన ఊరు-మన ప్రణాళిక కింద జిల్లాలో రూ.1,744.56 కోట్లతో 3,847 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వుంత్రి వివరించారు. ప్రతి గ్రామ పరిధిలో వుూడు పనులు, వుండల స్థారులో పది, జిల్లా స్థారుులో 40 పనులు తక్షణమే చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రధానంగా తాగునీరు, అంతర్గత రోడ్లు, సంపూర్ణ పారిశుద్ధ్యం, డంపింగ్ యూర్డులు, శ్మశానవాటిక,పార్కుల వంటి అభివృద్ధి పనులు చేపడుతావున్నారు. జిల్లాలో పాలవుూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 18 వుండలాలలోని 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.5.73 కోట్లతో సర్వే పనులు చేపట్టడానికి ప్రభుత్వం నిధులు వుంజూరు చేసిందన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనువుగా ఉన్న 18 వేల ఎకరాల భూమిని గుర్తించావున్నారు. వికారాబాద్ సమీపంలోని పూడూరులో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం 2900 ఎకరాల భూమిని కేటారుుంచినట్లు ఆయున తెలిపారు. చేవెళ్ల, సర్థార్‌నగర్, నాదర్గుల్, శంషాబాద్‌లో ఆర్టీసీ బస్సు డిపోల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశావుని, కొత్తగా 14 డిపోల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టు ప్రకటించారు. రైతు రుణవూఫీలో భాగంగా జిల్లాలో 2.26 లక్షల వుంది రైతులకు రూ.998 కోట్ల రుణాలు మఫీ చేసినట్లు వుంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 1.21 లక్షల వుంది రైతులకు రూ.31 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడితోపాటు ఖరీఫ్, రబీ పంటలకు రూ.714.66 కోట్లు పంట రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. రూ.4.25 కోట్లతో ట్రాక్టర్లు, విత్తన యుంత్రాలు వంటి పరికరాలు ఇస్తున్నావున్నారు. వున ఊరు- వున కూరగాయులు కార్యక్రవూన్ని చెన్వెల్లి, దేవునిఎర్రవల్లి, కొత్తగడి క్లస్టర్ ప్రాంతాలను ఎంపికచేసి 50శాతం రారుుతీపై ైెహ బ్రీడ్ కూరగాయుల విత్లనాలు అందిస్తున్నావున్నారు. దళితులను అన్ని విధాలుగా ఆదుకునే కార్యక్రవుంలో భాగంగా మొదటి విడతగా నియోజకవర్గానికి ఒక గ్రావూన్ని ఎంపికచేసి 15వుంది లబ్థిదారులకు 45ఎకరాల భూమిని పంపిణీ చేశావున్నారు. దళిత, గిరిజన యుువతులకు కళ్యాణ పథకం కింద రూ.50 వేల ఆర్థిక సాయూన్ని అందిస్తామన్నారు. ఐదు వందలకు పైగా జనాభా ఉన్న 60 గిరిజన తాండాలను గ్రావు పంచారుుతీలుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17 కోట్లు పంచాయుతీలకు విడుదల చేశావున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, వలిక సదుపాయూల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నావున్నారు. 3,928 వుంది ఎస్సీలకు రూ.53 కోట్లు, 8,011 వుంది ఎస్టీలకు రూ.101 కోట్ల ఆర్థిక సాయూన్ని అందించావున్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు జ్యుడీషీయుల్ అధికారులతో ప్రత్యేక ట్రిబ్యూనల్ల ఏర్పాటు చేశావున్నారు. వుహిళా సాధికారత కోసం 15,402 గ్రూపులకు రూ.482 కోట్ల వడ్డీలేని రుణాలు అందజేశావున్నారు. జిల్లాలో ఈ ఏడాది 60 లక్షల మొక్కలు నాటనున్నామని, వచ్చే ఏడాది 1.20 కోట్ల మొక్కలు నాటేందుకు వంద నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రవుంలో ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయువుూర్తి, కలెక్టర్ నడిమిట్ల శ్రీధర్, జేసీ చంపాలాల్, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సవురమోధులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ శాఖల అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంసృ్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
త్వరలో ఆర్టీసీ విభజన
తాండూరు: త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ విభజన జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఏపీఎస్ఆర్టీసీని రెండుగా విభజించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. రెండు మూడు నెలల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవుతుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. తెలంగాణలో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర సీఎం చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇక్కడ ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయి, వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆర్టీసీ అధికారులతో సమీక్షిస్తున్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారని, ఆదాయం కూడా అధికమేనని మంత్రి అన్నారు. తెలంగాణలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ముంబయి తరహాలో సిటీ బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నందన్నారు. ఈనెల 20వ తేదీ తరువాత ముంబయికి తాను వెళ్లనున్నట్టు చెప్పారు. ముంబయిలో ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, నగర ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సిటీ బస్సులు నడుపుతున్న పద్ధతులు, ట్రాఫిక్ నియంత్రణకు పాటిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయడానికి ముంబయికి వెళ్లనున్నట్టు మంత్రి వివరించారు. ముంబయి తరహాలో తెలంగాణలోని జిల్లాల్లో సిటీ బస్సులు నడిపించేందుకు ఇటీవలనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిసి, 500 బస్సులు కావాలని కోరినట్టు మంత్రి తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు సుమారు 200-300 కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలలో రూ.80కోట్లతో 80 సిటీ బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ 50 శాతం, కేంద్ర ప్రభుత్వం 35 శాతం, రాష్ట్రం 15 శాతం నిధులను భరిస్తాయని మంత్రి వివరించారు. ఆయా జిల్లాల్లో ఐదు నిమిషాలకు ఒకసారి సిటీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలో తీవ్ర రూపం దాల్చిన విద్యుత్ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. రెండుమూడేళ్లు తెలంగాణలో కరెంట్కష్టాలు తప్పవన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కరెంట్ కొనుగోలు చేసేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. క్రెడిట్ కో-ఆపరేటివ్ సోసైటీ(సీసీఎస్) నిధుల వ్యయం విషయమై సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ.జయశంకర్ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, దాని పేరు మార్పుపై తాను మాట్లాడలేనని పేర్కొన్నారు. -
మహిళాభివృద్ధికి రూ.500 కోట్లు
మొయినాబాద్: జిల్లాలోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మించిన సాంకేతిక శిక్షణ, అభివృద్ధి కేంద్రం సమావేశ మందిర భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. సమావేశ మందిరంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని మహిళాసంఘాలకు రూ.500 కోట్లు బ్యాంకులింకేజీ రుణాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలో 37 వేల సంఘాలలోని 4 లక్షల మందికి రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తీసుకున్న రుణాల రికవరీ 98 శాతం ఉందని, దాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.40 లక్షలు జిల్లా పరిషత్ నుంచి మంజూరు చేయిస్తామన్నారు. తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. 19న సమగ్ర సర్వే... ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని చెప్పారు. అధికారులు సైతం సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా చేయాలన్నారు. మన ఊరు-మన ప్రణాళిక ద్వారా అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక సిద్ధమయ్యిందన్నారు. రాబోయే రోజుల్లో వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేసి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఐటీ కంపెనీలు, సంస్థలు రావడానికి అవకాశం ఉందని, మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి: ఎమ్మెల్యే కాలె యాదయ్య రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొయినాబాద్‌లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని, మంజీరా నీళ్లు అందించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు 111 జీవోతోపాటు ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా మహిళా సమాఖ్యకు రూ.13.51 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి చేతులు మీదుగా అందజేశారు. ప్రాంగణం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ పద్మమ్మ, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జేడీఎం హమీద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ గంగాధర్, ఏఈలు భాస్కర్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నాగరాజు, సర్పంచ్‌లు సంగీత, సుధాకర్, మల్లేష్, నవీన్, రాంచంద్రయ్య, ఎంపీటీసీలు సహదేవ్, పెంటయ్య, మాణిక్‌రెడ్డి, రాంరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, కొండల్‌గౌడ్, హన్మంత్‌రెడ్డి, శ్రీహరియాదవ్, సంజీవరెడ్డి, రమేష్, హన్మంత్‌యాదవ్, దర్శన్, రవీందర్‌రెడ్డి, నీలకంఠం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమార్కులపై చర్యలు
తాండూరు: ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన తాండూరు మున్సిపల్ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాండూరులోని కాగ్నా నది (వాగు) నుంచి ఇసుక తవ్వకాలను అరికట్టేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఉపేక్షించమని,వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన తాండూరులో సిమెంట్ కంపెనీలు, నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్నాయన్నారు. ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా కోసం తాండూరుకు నిత్యం వందలాది లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నందున ట్రాఫిక్ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదాలు తగ్గించి, ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించేందుకు తాండూరులో ఔట ర్ రింగురోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు సు మారు రూ.50 కోట్లు అవసరమవుతాయని మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. రూ.80 కోట్ల కేంద్రం నిధులతో కోట్‌పల్లి ప్రాజె క్టు నుంచి తాం డూరు పట్టణంలోని అన్ని వార్డులకు తాగునీరు సరఫరా మెరుగు పర్చడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ నిధులు త్వరగా మంజూరయ్యేలా చూస్తానన్నారు. కాగ్నాలో రూ.8.52కోట్లతో చెక్‌డ్యాం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చూస్తానన్నారు. తాండూరులో ప్రొ.జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పట్టణ మధ్యలో ఉన్న లారీ పార్కింగ్‌కు అవసరమైన స్థలం కేటాయిస్తామన్నారు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం కేసీఆర్ కచ్చితంగా నెరవేరుస్తారన్నారు. ఎంత భారం పడినా, ఇబ్బందులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. పల్లెలు,పట్టణాల్లో చిన్న ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. జిల్లా,ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో గుర్తించిన ప్రజల అవసరాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా తీర్చడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడతానన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. తాండూ రు మున్సిపాలిటీకి సుమారు రూ.56లక్షలు, వికారాబాద్‌కు రూ.70లక్షల బీఆర్జీఎఫ్ నిధులను మంజూరు చేయనున్నట్టు ఆమె చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రణాళిక’లో సర్పంచ్‌లే కీలకం
వికారాబాద్: ‘మనగ్రామం-మన ప్రణాళిక’లో సర్పంచ్‌లే కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లో ‘మన మండలం-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయ సమావేశపు గదిలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ .. ఈనెల 30న జిల్లా ప్రణాళిక రూపొందుతోందన్నారు. ఇదివరకు ఉన్న పాలనలో వికారాబాద్, తాండూర్ ప్రాంతాలు చాలా వెనకబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలు కోరిన విధంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆయా శాఖల నుంచి ప్రాధాన్యతలను బట్టి గ్రామాలకు నిధులు వస్తాయన్నారు. స్థానికంగా ప్రజాప్రతినిధులు చెప్పిన కార్యక్రమాలన్నీ చేపడతామని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని పేదలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు మహర్దశ తెలంగాణలో రంగారెడ్డి జిల్లాయే అన్ని విధాలుగా ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో పెద్ద పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే రైతుల రుణమాఫీతో పాటు దళితుల వివాహాలకు రూ.50వేల ఆర్థిక సహాయం, భూమిలేని దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తుందన్నారు. వికలాంగులకు దసరా నుంచి రూ.1500, వితంతువులు, వృద్ధులకు రూ.వెయ్యి పింఛన్ ఇస్తుందన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతున్న తరుణంలో తాండూరు, పరిగి ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్ చుట్టూ 60 కి.మీల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా హార్టికల్చర్, కూరగాయల సాగును వృద్ధి చేస్తామని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి వీటి దిగుమతిని తగ్గిస్తామన్నారు. డ్వాక్రా భవనాల నిర్మాణం, అంగన్వాడీల నిర్మాణం చేపడుతామన్నారు. బస్సు సౌకర్యంలేని గ్రామాలను గుర్తించి బస్సులు మంజూరు చేయిస్తామన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రాంతంలో ఉన్న చెరువుల మరమ్మతులు త్వరలోనే చేపట్టి రైతులకు వ్యవసాయానికి అవసరమైన నీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మండలంలో దళితులకు భూపంపిణీ చేసే విషయంలో మద్గుల్ చిట్టంపల్లిలో ఎంపిక చేశామన్నారు. పాఠశాలలకు రూ. 9కోట్ల నిధులు: కలెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మండలస్థాయి అధికారులను పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా నియమించి అభివృద్ధికి కేటాయించే నిధులు సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామానికి అవసరమైన వసతులు సమకూర్చే బాధ్యతను గ్రామసర్పం చులు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు ఇబ్బందుల పడ కుండా మౌలిక వసతుల కల్పనకు రూ.9కోట్లు మంజూరు చేశామన్నారు. సర్పంచులకు, యంపీటీసీలకు ప్రభుత్వ పథకాలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. సబ్ కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. రేషన్‌కార్డులో ఆధార్ అనుసంధానం పూర్తయితేనే అసలైనా లబ్ధిదారులను సులువుగా గుర్తించవచ్చన్నారు. పెన్షన్‌కోసం దరఖాస్తు చేసుకునే వారు రేషన్‌కార్డులో ఉన్న వయస్సును సరిచేసుకోవాలని, 65 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులన్నారు. రేషన్‌కార్డులో ఉన్న సవరణలను మీసేవ ద్వారా సరిచేసుకోవచ్చన్నారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్తాహార్ షరీఫ్,ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, ప్రత్యేకాధికారి దివ్యజ్యోతి, ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ గౌతం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పదవుల పంపకాల్లో సమన్యాయం
తాండూరు: జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకాల్లో సమన్యాయాన్ని పాటిస్తానని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.శనివారం ముస్లింల ఇఫ్తారు విందులో పాల్గొనేందుకు తాండూరుకు విచ్చేసిన మంత్రి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల్లో అన్ని స్థాయిల్లో పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులను కేటాయించడం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో తన సొంత నియోజవర్గమైన తాండూరుతోపాటు జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజవర్గాలకు పదవుల పంపకాల్లో సమన్యాయాన్ని కచ్చితంగా పాటిస్తానని వివరించారు. అయితే పదవుల పంపకాల కేటాయింపునకు ఒకటిరెండు నెలలు పట్టవచ్చని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పెట్టబడుల కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐటీ మంత్రి తారకరామారావు రిలయన్స్ అధినేత అంబానీ, పెద్ద పెద్ద కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నందున ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెద్ద కంపెనీలు సముఖంగానే ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు జిల్లాలో అవసరమైన భూముల కేటాయింపుతోపాటు అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్అధికారిని కూడా నియమించిందని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు 15రోజుల్లో ప్రభుత్వం అన్ని సౌకార్యలు కల్పిస్తామని వివరించారు. పరిశ్రమలు పెద్ధ ఎత్తున రాబోతుండటంతో జిల్లాలోని ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. వికారాబాద్ తదితర గ్రామీణప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ప్రణాళికబద్ధంగా పల్లెల అభివృద్ధి ‘మన ఊరు-మన ప్రణాళిక’ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ఐదేళ్లలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తాగునీరు, పారిశుధ్యం, డంపింగ్‌యార్డు తదితరాలతోపాటు ప్రజల అవసరాలకనుగుణంగా పల్లెలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని తెలిపారు. ప్రభుత్వభూమి లేకపోతే ప్రైవేట్ భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామన్నారు. దసరా నుంచి నవంబర్ మధ్యలో ఈ ప్రక్రియను మొదలు పెడతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం నెర్చవేర్చుతారన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చడం టీడీపీ,కాంగ్రెస్ హయాంలో హామీలకే పరిమితమైందని, సీఎం దాని నిజం చేయనున్నారని మంత్రి తెలియజేశారు. -
ఆర్టీసీ విలీనంపై ముఖ్యమంత్రిదే నిర్ణయం
కొత్తగా 30 నుంచి 50 డిపోలు: మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చే అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే అతి పెద్ద రవాణా సంస్థ అయిన ఆర్టీసీ నష్టాల్లో ఉందని, విభజన తర్వాత తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు. సంస్థను పూర్తిస్థాయిలో నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. డిపోల వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. చార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. పది జిల్లాల పరిధిలో 30 నుంచి 50 కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
కేసీఆర్ మాట తప్పని సీఎం:మంత్రి మహేందర్‌రెడ్డి
వికారాబాద్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటిని అమలు చేస్తామని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట తప్పరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అందుకు తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ సంబురాల్లో భాగంగా ఆదివారం జిల్లా ముగింపు ఉత్సవాలను వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌం డ్స్‌లో నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏళ్ల ఉద్య మం, అమరుల త్యాగం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. తెలంగాణ సాధనకు కృషి చేసినట్లుగానే బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో పార్లమెంట్ ముందు మొయినాబాద్‌కు చెందిన యాదిరెడ్డి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ హామీ తప్పకుండా నెరవేరుతుందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి లోటు లేకుండా విత్తనాలు, ఎరువులను సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ను కోరారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని, త్వరలో సర్వే పనులు ప్రారంభమవుతాయన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జేసీలు చంపాలాల్, ఎంవీ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఆర్వీఎం పీడీ కిషన్‌రావు, జడ్పీ సీఈవో చక్రధరరావు, జిల్లా సీడీపీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ అనంతం, చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి.హఫీజ్, జిల్లా జేఏసీ, ఉద్యోగ జేఏసీ నాయకులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.