జిల్లాలో భారీగా రేషన్ బియ్యం నిల్వలు సీజ్ | The district seized a large ration of rice reserves | Sakshi
Sakshi News home page

జిల్లాలో భారీగా రేషన్ బియ్యం నిల్వలు సీజ్

Published Sat, May 16 2015 4:21 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

The district seized a large ration of rice reserves

డోర్నకల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్సుమెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు, పోలీసులు దాడులు చేసి భారీగా బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. రీసైక్లింగ్ చేసేందుకు రేషన్ బియ్యం నిల్వ చేస్తున్న అక్రమార్కుల ఆటకట్టించారు. వివరాలిలా ఉన్నారుు. పాత డోర్నకల్‌లోని గండి సత్యనారాయణకు చెందిన పాతరైస్‌మిల్, సెకండ్ మెయిన్ రోడ్డులోని సుశీల్‌కుమార్‌కు చెందిన ఇళ్లు, ముల్కలపల్లిలోని ముక్కా వెంకటనారాయణకు చెందిన ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గండి సత్యనారాయణ పాతమిల్లులో ఎడమకంటి రమేష్ అనే వ్యాపారి తరలించేందుకు సిద్ధంగా ఉంచి న 244 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.10,89,000 విలువైన ఈ బియూన్ని రేషన్ షాపుల నుంచే నేరుగా ఇక్కడికి తరలించినట్లు అధికారులు గుర్తించా రు. బియ్యంతోపాటు అక్కడే ఉన్న లారీ, డీసీఎం, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే సెకండ్ మెయిన్‌రోడ్డులోని సుశీల్‌కుమార్‌జైన్ ఇంటి ఆవరణలో రూ.8,06, 000 విలువైన 239 క్వింటాళ్ల బియ్యంతోపాటు బొలేరో వాహనం, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ముల్కలపల్లి గ్రామంలో వ్యాపారి ముక్కా వెంకటనారాయణ ఇంట్లో సుమారు రూ.1,51,000 విలువైన 89 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్ రీజనల్ అదనపు ఎస్పీ వి.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బియ్యాన్ని నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని సంతోషిమాత రైస్‌మిల్‌కు తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, కాకినాడ ఫోర్ట్‌కు కూడా తరలిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మహబూబాబాద్‌లో 11 మంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడిం చారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ వెంకటేష్, ఎస్సై సర్వర్, విజిలెన్స్ తహసీల్దార్ వెంకటరెడ్డి, సివిల్ సప్లై ఏఎస్‌ఓ శంతన్‌కుమార్, డీటీ సురేష్, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.

పడమరకోటలో 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం
ఖిలావరంగల్ :  అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఉన్న ఓ ఇంటిపై మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. ఖిలావరంగల్ పడమరకోటలోని కొత్త మల్లయ్య రైస్‌మిల్ పక్కనే ఉన్న ఇంటిపై మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు విశ్వేశ్వర్, శ్రీదేవితో కలిసి వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఓ గదిలో ఆక్రమంగా నిల్వ చేసిన 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డారుు. దీంతో ఆ గదిని సీజ్ చేసి సంబంధిత వరంగల్ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సురేంద్రనాథ్ మాట్లాడుతూ కరీమాబాద్‌కు చెందిన వడ్డెపెల్లి జనార్దన్, ఎల్లంబజారుకు చెందిన రమేష్ కలిసి కొంతకాలంగా ఈ ప్రాంతంలోని కార్డుదారులు, రేషన్ డీలర్ల వద్ద పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

సివిల్ సప్లయ్ అధికారులు ఎస్‌ఓ అనీల్‌కుమార్, వరంగల్ డీటీ(సీఎస్) రత్నవీరాచారి, వర్ధన్నపేట డీటీ(సీఎస్) రాజ్‌కుమార్, వీఆర్ ఏ విక్రమ్ చేరుకుని బియ్యాన్ని  స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 340 బస్తాల రేషన్ బియాన్ని కాంటా వేయగా సుమారు 170 క్వింటాళ్ల బియ్యం లెక్క తెలింది. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపా రు. వ్యాపారులు రమేష్, జనార్దన్‌పై నిత్యావసర సరుకుల చట్లం 6(ఏ) కింద కేసునమోదు చేసి బియ్యాన్ని హన్మకొండ మండలం నక్కలపెల్లి గ్రామశివారులోని లక్ష్మీ రైస్‌మిల్లుకు తరలించి భద్రపరిచినట్లు తెలిపారు. రేషన్ డీలర్ల అక్రమాలపై 18004251304 ట్రోల్ ఫ్రీ నంబర్‌కు కాల్‌చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో  మిల్స్‌కాలనీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement