rice reserves
-
29 నుంచి మూడో విడత ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: పేదలకు మూడవ విడత ఉచిత సరుకులు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. కరోనా విపత్తు సమయంలో ఉపాధిలేని పేదలకు ఆకలి బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పటికే రెండు విడతలుగా ఉచిత సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మూడో విడత పంపిణీ సందర్భంగా రెవిన్యూ అధికారులకు, డీలర్లకు ప్రత్యేక జాగ్రత్తలు సూచిస్తూ పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ► కరోనా నేపథ్యంలో ఒక్కో దుకాణం పరిధిలో రోజుకు 30 మంది లబ్ధిదారులకు టైం స్లాట్ టోకన్లు ఇచ్చి పంపిణీ చేయాలి. ► మొదటి, రెండో విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించగా ఈసారి మాత్రం లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలి. ► అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు ఉంచాలి. ► ప్రతి లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి. ఏడాదికి సరిపడా ఆహార నిల్వలు సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా వేళ ఆహార ధాన్యాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వద్ద 16.89 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నందున సెప్టెంబర్ నాటికి మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. లాక్డౌన్ ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29 నుంచి ఏప్రిల్ 29వ వరకు 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డుదారులకు మూడు విడతలుగా ఉచితంగా బియ్యంతో పాటు కిలో కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఈనెల అదనంగా మరో 70 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఎఫ్‌సీఐ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ► రాష్ట్రంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గొడౌన్ల నుంచి ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడుకు 1,93,330 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపారు. యానాంకు 189 మెట్రిక్ టన్నులు, అండమాన్ నికోబార్ దీవులకు 304.310 మెట్రిక్ టన్నులు పంపారు. ► వలస కార్మికుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి మేరకు విశాఖపట్నానికి 10 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సబ్సిడీపై కేటాయించింది. ► ఎఫ్‌సీఐ వద్ద 7.35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 11,082 మెట్రిక్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉన్నాయి. -
‘అంగన్వాడి’లో భోజనం బంద్
♦ వంద కేంద్రాల్లో నిండుకున్న బియ్యం నిల్వలు ♦ గుడ్డుతో సరిపెడుతున్న టీచర్లు ♦ కొన్ని కేంద్రాల్లో గుడ్లూ లేవు అర్ధాకలితో అంగన్వాడీ పిల్లలు రామాయంపేట: అంగన్వాడి కేంద్రాల్లో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. స్థానిక ఐసీడీఎస్ పరిధిలో రామాయపేట, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి మండలాలుండగా, వీటి పరిధిలో 280 అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా చివరి వారానికల్లా బియ్యం బస్తాలు రావాల్సి ఉండగా, ఈసారి ఆర్వోలు రాకపోవడంతో ఇంకా బియ్యం మంజూరు కాలేదు. దీనితో 4 మండలాల పరిధిలోని వంద కేంద్రాల్లో భోజనం బందయ్యింది. ఈ కేంద్రాల్లో గుడ్లు మాత్రమే ఇచ్చి పిల్లలను ఇళ్లకు పంపారు. గ్రామాల్లో నమోదైన గ ర్భిణిలు, బాలింతలకు సైతం గుడ్లు, పాలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాత్రం టీచర్లు తమ ఇళ్ల నుంచి బియ్యం తెచ్చి పిల్లలకు వండి పెట్టారు. ఇటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఎదురు కాలేదని టీచర్లు అంటున్నారు. కాగా ఈ మండలాల పరిధిలోని కొన్ని కేంద్రాల్లో గుడ్ల స్టాకు కూడా లేకుండాపోయింది. పరిస్థితి చక్కదిద్దుతాం ప్రాజెక్టు పరిధిలోని 4 మండలాల్లోని 70 అంగన్వాడి కేంద్రాల్లో బియ్యం నిల్వలు లేవు. బియ్యం మంజూరుకు సంబంధించి ఈసారి ఆర్వో రిలీజ్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. -
అయితే హాజరు.. లేదంటే సెలవు!
► హాజరు రిజిష్టరులో సంతకం.. ఆపై సెలవు చీటీ ► ఎవరూ చూడకపోతే మరుసటి రోజు చీటీ చింపడం ► ఎండీఎం బియ్యంలోనూ అవకతవకలు ► ఇదీ మచ్చాపూర్ డీఎన్టీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం తీరు గుడిహత్నూర్ : పాఠశాలకు ఎవరైనా ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చారనుకోండి.. అక్కడ ఎవరైనా ఉపాధ్యాయుడు గైర్హాజరు ఉంటే.. సెలవు చీటీ చూపిస్తూ.. సహ ఉపాధ్యాయుడు ఇచ్చే సమాధానం.. ‘సార్‌కు ఆరోగ్యం బాగాలేదు. సెలవుపై ఉన్నారు’ కానీ అప్పటి వరకు హాజరు పట్టీలో ఈ విషయం రికార్డు చేయరు. ఎవరూ రాలేదనుకొండి మరుసటి రోజు సెలవు చీటీ చించేసి హాజరేసుకోవడమే.. మండలంలోని మచ్చాపూర్ డీఎన్టీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం గణేష్ ఉదయం పాఠశాలకు హాజరై హాజరు పట్టీలో సంతకం చేసి 10గంటల ప్రాంతంలో వెళ్లి పోయారు. వెళ్లే ముందు సెలవు పత్రం రాసి అదే హాజరు రిజిష్టరులో పెట్టి.. ఎవరైనా వస్తే ఎం చెప్పాలో కూడా ఉపాధ్యాయుడికి చెప్పి వెళ్లిపోయాడు. కాగా ఒక పూటకు సంతకం చేసి అనారోగ్యం కారణంగా వెళ్తున్నాని సెలవు చీటీలో పేర్కొన్న హెచ్ఎం ఒక రోజు సెలవు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి గాను 4 నుంచి 4.5 కిలోలు వెచ్చిస్తున్నట్లు రిజిస్టర్లో రికార్డు చేశారు. ఇదే విషయాన్ని ఎండీఎం నిర్వాహకులకు అడగగా నిత్యం 3కిలోల నుంచి 3.5 కిలోలు వండుతున్నట్లు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులకు అందించాల్సిన సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో సైతం హెచ్ఎం గణేష్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదంటూ స్థానికులు విద్యా శాఖ కమిషనుర్ టోల్ ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈవో నారాయణను వివరణ కోరగా.. అత్యవరసరంగా పాఠశాల నుంచి సెలవుపై వెళ్లాల్సి వస్తే మూవ్మెంటు రిజిష్టరులో నమోదు చేస్తూ.. హెచ్ఎం బాధ్యతలు మరో ఉపాధ్యాయుడికి అప్పగించి కాంప్లెక్స్ హెచ్ఎంకు గానీ, ఎంఈవోకు గాని సమాచారం అందించాలని తెలిపారు. ఎండీఎం బియ్యం నిల్వలు పాఠశాలలోనే ఉండాలని వేరే చోట ఉండడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పటివరకూ తమ దృష్టికి రాలేదని పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. -
జిల్లాలో భారీగా రేషన్ బియ్యం నిల్వలు సీజ్
డోర్నకల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ఫోర్సుమెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు, పోలీసులు దాడులు చేసి భారీగా బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. రీసైక్లింగ్ చేసేందుకు రేషన్ బియ్యం నిల్వ చేస్తున్న అక్రమార్కుల ఆటకట్టించారు. వివరాలిలా ఉన్నారుు. పాత డోర్నకల్‌లోని గండి సత్యనారాయణకు చెందిన పాతరైస్మిల్, సెకండ్ మెయిన్ రోడ్డులోని సుశీల్‌కుమార్‌కు చెందిన ఇళ్లు, ముల్కలపల్లిలోని ముక్కా వెంకటనారాయణకు చెందిన ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గండి సత్యనారాయణ పాతమిల్లులో ఎడమకంటి రమేష్ అనే వ్యాపారి తరలించేందుకు సిద్ధంగా ఉంచి న 244 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.10,89,000 విలువైన ఈ బియూన్ని రేషన్ షాపుల నుంచే నేరుగా ఇక్కడికి తరలించినట్లు అధికారులు గుర్తించా రు. బియ్యంతోపాటు అక్కడే ఉన్న లారీ, డీసీఎం, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెకండ్ మెయిన్‌రోడ్డులోని సుశీల్కుమార్జైన్ ఇంటి ఆవరణలో రూ.8,06, 000 విలువైన 239 క్వింటాళ్ల బియ్యంతోపాటు బొలేరో వాహనం, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ముల్కలపల్లి గ్రామంలో వ్యాపారి ముక్కా వెంకటనారాయణ ఇంట్లో సుమారు రూ.1,51,000 విలువైన 89 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అనంతరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ రీజనల్ అదనపు ఎస్పీ వి.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బియ్యాన్ని నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని సంతోషిమాత రైస్‌మిల్‌కు తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, కాకినాడ ఫోర్ట్‌కు కూడా తరలిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మహబూబాబాద్‌లో 11 మంది వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడిం చారు. విజిలెన్స్ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ వెంకటేష్, ఎస్సై సర్వర్, విజిలెన్స్ తహసీల్దార్ వెంకటరెడ్డి, సివిల్ సప్లై ఏఎస్ఓ శంతన్‌కుమార్, డీటీ సురేష్, వీఆర్ఓలు పాల్గొన్నారు. పడమరకోటలో 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఖిలావరంగల్ : అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఉన్న ఓ ఇంటిపై మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించారు. ఖిలావరంగల్ పడమరకోటలోని కొత్త మల్లయ్య రైస్‌మిల్ పక్కనే ఉన్న ఇంటిపై మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు విశ్వేశ్వర్, శ్రీదేవితో కలిసి వరంగల్ డీఎస్పీ సురేంద్రనాథ్ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఓ గదిలో ఆక్రమంగా నిల్వ చేసిన 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డారుు. దీంతో ఆ గదిని సీజ్ చేసి సంబంధిత వరంగల్ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సురేంద్రనాథ్ మాట్లాడుతూ కరీమాబాద్‌కు చెందిన వడ్డెపెల్లి జనార్దన్, ఎల్లంబజారుకు చెందిన రమేష్ కలిసి కొంతకాలంగా ఈ ప్రాంతంలోని కార్డుదారులు, రేషన్ డీలర్ల వద్ద పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. సివిల్ సప్లయ్ అధికారులు ఎస్ఓ అనీల్‌కుమార్, వరంగల్ డీటీ(సీఎస్) రత్నవీరాచారి, వర్ధన్నపేట డీటీ(సీఎస్) రాజ్‌కుమార్, వీఆర్ ఏ విక్రమ్ చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 340 బస్తాల రేషన్ బియాన్ని కాంటా వేయగా సుమారు 170 క్వింటాళ్ల బియ్యం లెక్క తెలింది. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపా రు. వ్యాపారులు రమేష్, జనార్దన్‌పై నిత్యావసర సరుకుల చట్లం 6(ఏ) కింద కేసునమోదు చేసి బియ్యాన్ని హన్మకొండ మండలం నక్కలపెల్లి గ్రామశివారులోని లక్ష్మీ రైస్‌మిల్లుకు తరలించి భద్రపరిచినట్లు తెలిపారు. రేషన్ డీలర్ల అక్రమాలపై 18004251304 ట్రోల్ ఫ్రీ నంబర్‌కు కాల్చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో మిల్స్‌కాలనీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బియ్యం అక్రమ నిల్వలపై దాడులు
245 బస్తాల బియ్యం ప్రభుత్వ గోదాముకు తరలింపు బండకిందపల్లెలో ఘటన సోమల: మండలంలోని బండకిందపల్లెలో బుధవారం తహశీల్దార్ నరసింహులు, ఎస్ఐ చిన్న రెడ్డెప్పలు అక్రమ బియ్యం వ్యాపారంపై దాడులు చేశారు. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 245 బస్తాల బియ్యాన్ని సదుం వద్ద ఉన్న ప్రభుత్వ గోదాముకు తరలించారు. బండకిందపల్లె వద్ద ఉన్న ఓ రైతు ఇంటిలో అక్రమ బియ్యం నిల్వలు ఉన్నాయని ఎస్ఐ చిన్నరెడ్డెప్పకు రహస్య సమాచారం అందింది. దీంతో ఆయన సిబ్బంది తో కలసి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 245 బస్తాల బి య్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులను విచారించగా రాయచోటికి చెందిన ఓవ్యక్తి కొంతకాలంగా అక్రమబియ్యం వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అతనికి చెందిన 50 కేజీల బరువున్న బస్తాల నుంచి బియ్యం వేరుచేసి, వాటికి ఆయిల్ కలిపి 21, 22 కేజీల బరువుతో ప్యాకింగ్ చేస్తున్నట్టు తెలిపారు. బియ్యం నిల్వలకు సంబంధించిన రికార్డులను చూపమని ఎస్ఐ కోరగా వారు ఎలాంటి రిక్డాలు లేవని సమాధానం చెప్పారు. దీంతో తహశీల్దార్ నరసింహులుకు ఎస్ఐ సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఆర్ఐ మహేశ్వరితో కలసి ఆయన చేరుకున్నారు. పంచనామా నిర్వహించి 50 కేజీల బరువున్న 70 బస్తా లు, 22 కేజీల బరువున్న 49 బస్తాలు, 21 కేజీల బరువుగల 126 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ అక్రమ బియ్యం వ్యాపారం మూడు నెలలుగా జరుగుతోందని, నిత్యం కల్లూరుకు టెంపోల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీనిపై తహశీల్దార్‌ను వివరణ కోరగా 245 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ గోదాముకు తరలించామని తెలిపారు. విషయం ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ ప్రభావతమ్మ, వీఆర్ఏ పురుషోత్తం పాల్గొన్నారు.