ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం
రేపు పోలింగ్
బరిలో 23 మంది అభ్యర్థులు
హన్మకొండ : ఇరవై రోజులుగా ఊరువాడా హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. వరంగల్ ఉప ఎన్నిక ను అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్‌ను ప్రకటించి అన్ని పార్టీల కంటే ముందే ప్రచారం ప్రారంభిం చాయి. ఆ తర్వాత టీఆర్‌ఎస్ తర్జనభర్జనల అనంతరం పసునూరి దయాకర్‌ను బరిలో నిలి పింది. దయాకర్ తరఫున రాష్ర్ట మంత్రులు విస్తృత ప్రచారం చేయగా.. నియోజకర్గానికో మంత్రికి బాధ్యతలు అప్పగించారు. అనూహ్య పరిస్థితుల మధ్య సర్వే సత్యనారాయణ కాంగ్రె స్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు.
తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జాతీయస్థాయి నేతలు దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్, గులాంనబీ ఆజాద్, సుశీల్‌కుమార్‌షిం డే వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత జానారెడ్డి వరంగల్ కేంద్రంగా ఉంటూ ప్రచారానికి నేతృత్వం వహించారు. బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా నిలిచిన దేవయ్య తరఫున కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్‌గంగారం ఆహిర్‌తో పాటు కిషన్‌రెడ్డి ఊరువాడా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు తరఫున ఆ పార్టీ అధినేత జగన్‌మెహన్‌రెడ్డి నాలుగు రోజుల పాటు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారానికి మంచి స్పందన లభించిం ది. ఇక ప్రచారంలో ఎల్‌ఈడీ వాహనాలు, వీడి యో క్లిప్పింగులు ఆకర్షణగా నిలవగా.. బడా నాయకుల రాకతో హోటళ్లన్నీ కిక్కిరిపోయాయి.
రేపు అసలు పరీక్ష
ఇరవై రోజుల పాటు ఉధృతంగా ఎన్నికల ప్రచా రం నిర్వహించిన అభ్యర్థులకు శనివారం అసలైన పరీక్ష ఎదురు కానుంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీలతో పా టు స్వతంత్ర అభ్యర్థులు 23 మంది బరిలో ఉ న్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి ఏడు అసెం బ్లీ నియోజకర్గాల్లో ఉన్న పన్నెండు మండలాల్లో 1778 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. పో లింగ్ సందర్భంగా పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పారామిలిటరీతో పాటు స్పెషల్ పార్టీ, పక్క జిల్లాలకు చెందిన పోలీసు బలగాల ను రప్పించారు. గురువారం సాయంత్రం 5 గం టల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. కాగా, అభ్యర్థులు చేసిన ప్రచారం ఖర్చు వివరాలతో పాటు గడువు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించే వారిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది.
సప్పుడు బంద్
Published Fri, Nov 20 2015 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement