చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నీటి వసతి కోసం వేయించిన బోర్లు వట్టిపోయాయి. సాగు చేసిన పొలం ఎండిపోయింది. ఈ పరిణామాలతో కలత చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రామచంద్రు(53)కు రెండెకరాల పొలం ఉంది. దీనికి తోడు ఆయన ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం పొలంలో వరి సాగు చేశాడు. ఉన్న బోరు ఎండిపోవటంతో మరో ఆరు బోర్లు వేయించాడు. నీరు పడకపోవటంతో సాగు చేసిన పొలం ఎండిపోయింది. మొత్తం రూ.4 లక్షల వరకు అప్పు మిగిలింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన రామచంద్రు గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.