నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
వరంగల్ క్రైం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న స్టయిఫండరీ ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షలను విజయవంత ం చేయాలని వరంగల్ రూర ల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. పరీక్షా కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించొద్దని సూచించారు. ఏప్రిల్ 17,24వ తేదీల్లో నిర్వహించే స్టయిఫండరీ ఎస్సై, కానిస్టేబుళ్ల రాత పరీక్షల నిర్వహణపై పోలీస్ అధికారులు, ఇన్విజిలేటర్లతో వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు పర్యవేక్షణలో గురువారం స్థానిక చైతన్య డిగ్రీ కళాశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబర్‌కిషోర్ ఝా మాట్లాడుతూ స్టయిఫండరీ ఎస్సై రాత పరీక్షను ఏప్రిల్ 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరంగల్ నగరంలోని 31 కేంద్రాల్లో నిర్వహిస్తామని చెప్పారు.
ఈ పరీక్షకు 21,250 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని చెప్పా రు ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్టయిఫండరీ కానిస్టేబుళ్ల రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పా రు. కమీషనరేట్ పరిధిలో 58 పరీక్ష కేంద్రాలతో పాటు, నర్సంపేటలో 31, జనగామ 20 కేంద్రాల్లో జరిగే ఈ రాత పరీక్షకు 37,750 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని రూరల్ ఎస్పీ తెలిపారు. పరీక్ష సజావుగా నిర్వహిం చేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
అదేవిధంగా పరీక్షలు నిర్వహించే సమయంలో ముఖ్యమైన కూడళ్లలో అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు, కో కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వనాథ్, అదనపు డీసీపీ యాదయ్య, జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు, నర్సంపేట, జనగాం కో ఆర్డినేటర్లు డాక్టర్ బి.చంద్రమౌళి, కమాల క్రిస్టియన్, ఏసీపీలు శోభన్‌కుమార్, సురేంధ్రనాథ్, రవీందర్‌రావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.