
ఉద్రిక్తతకు దారి తీసిన బంద్
పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా వామపక్షాలు పిలుపునిచ్చిన బంద్ మేడ్చల్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది.
♦ పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల మధ్య తోపులాట
♦ పలువురి అరెస్టు
♦ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు
మేడ్చల్ : పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా వామపక్షాలు పిలుపునిచ్చిన బంద్ మేడ్చల్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పలువురి కార్మికులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పారిశుద్ధ్య కార్మికుల సవుస్యలు, సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సీఐటీయూ, ఏఐటీయుూసీ నాయుకులు శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయుం నుంచి పట్టణంలో కార్మికులు పలు దుకాణాలను వుూసివేరుుంచారు.
అనంతరం ర్యాలీగా బస్ డిపో వద్దకు చేరుకున్న వీరికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు డిపో వద్దకు చేరుకుని ఆందోళన విరమించాలని తెలుపడంతో కార్మిక నాయుకులు ససేమిరా అనడంతో పోలీసులు, ఆందోళనకారులకు వుధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించి పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యుత్నించగా.. వీరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కార్మిక నాయుకులను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన
కార్మిక నాయుకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కార్మికులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. శాంతియుుతంగా నిరసన తెలుపుతున్న తమ నాయకులను అరెస్టు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులను విడుదల చేయూలని డివూండ్ చేశారు. అయితే ఆందోళన విరమించకుంటే.. మిమ్మల్నికూడా అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో ఆందోళనకారులు వెనక్కు తగ్గారు. కార్యక్రవుంలో సీటీయూ నాయుకులు అశోక్, ప్రభాకర్, ఏఐటీయుూసీ నాయుకులు కృష్ణవుూర్తి, ఆంజనేయుులు, కాంగ్రెస్ నాయుకులు బాలవుల్లేష్, సుధాకర్‌రెడ్డి, సంతోష్, కార్మికులు భిక్షపతి, సత్తయ్యు, బాలవుణి తదితరులు పాల్గొన్నారు. కాగా.. సొంత పూచీ కత్తుపై కార్మికుల నాయకులను పోలీసులు విడుదల చేశారు.
మున్సిపల్ కార్మికుల రాస్తారోకో
తాండూరు : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ఏఐటీయూసీ, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియ న్ ఆధ్వర్యంలో కార్మికులు, యూనియన్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాచౌక్‌లో సుమారు గంటకుపైగా నిర్వహించిన రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సునీత, కౌన్సిలర్లు లింగదళ్లి రవికుమార్, ఎం శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు సీసీఐ రాములతో పాటు పలువురు సీపీఐ నాయకులు మద్దతు పలికి రాస్తారోకోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్దనరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల ఉన్నందున జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచి, మిగితా మున్సిపాలిటీ కార్మికులకు పెంచకపోవడాన్ని తప్పుబట్టారు. తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్క్ యూనియన్ అధ్యక్షుడు అరవింద్‌కుమార్ మాట్లాడుతూ కార్మికుల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందని విమర్శించారు.
కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసాచారి, సంతోష్‌గౌడ్, కార్మికులు పాల్గొన్నారు. కాగా.. ఆందోళన చేస్తున్న వారిలో 12 మందిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశామని, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశామని ఎస్‌ఐ నాగార్జున చెప్పారు.