జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామంలో ఆదివారం పసుపులేటి రాంబాబు(23) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.