సాక్షి, హైదరాబాద్: నగరంలోని షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయాలని, చేయకూడదన్న చట్టం/నియమావళి ఏదీ లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్కింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ముసా యిదా పార్కింగ్ విధానంపై పరిశీలన జరుపుతోందన్నారు. మంగళవారం ఈ మేరకు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు.
రాష్ట్రంలోని 5 జిల్లాలు, 68 మండలాలు, 2,703 గ్రామాలు, 2,432 గ్రామ పంచాయతీలను ఇప్పటి వరకు బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలు (ఓడీఎఫ్)గా ప్రకటించామని తెలిపారు. ఇంకా 25 జిల్లాలు, 370 మండ లాలు, 8,327 గ్రామాలు, 6,252 గ్రామ పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించాల్సి ఉందన్నారు. 60 శాతం కేంద్ర, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి మొత్తం రూ.2,335.37 కోట్లతో 18,18,825 గ్రామీణ గృహాల్లో మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment