ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి | They are responsible for the deaths CM: Bhatti | Sakshi
Sakshi News home page

ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి

Published Sat, Jan 24 2015 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి - Sakshi

ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి

సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మరణాలకు సీఎం చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం వల్లే స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందిందని, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు.ప్రభుత్వం ఏర్పడి 8నెలలు కావస్తున్నా పాలనపై దృష్టి పెట్టకుండా కాశీమజిలీ కథలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని విమర్శించారు. స్వైన్‌ఫ్లూ విస్తరించే అవకాశం ఉందని గతంలో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే సీహెచ్ వంశీచంద్‌రెడ్డి దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement