ఐదుగురు లైంగికదాడికి పాల్పడ్డారు.. | three gang rape accused arrested in Khammam | Sakshi
Sakshi News home page

ఐదుగురు లైంగికదాడికి పాల్పడ్డారు..

Published Tue, Sep 1 2015 5:14 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

three gang rape accused arrested in Khammam

* బాధితురాలి వాంగ్మూలం
* కొణిజర్ల ఘటనపై డీఎస్పీ విచారణ
కొణిజర్ల: మొత్తం ఐదుగురు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మరొకరు వారికి సహకరించారని బాధిత బాలిక పోలీసుల ఎదుట వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. మూడురోజుల క్రితం కొణిజర్ల, తనికెళ్ల యువకులు ఖమ్మంకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై సత్తుపల్లి డీఎస్పీ కవిత సోమవారం విచారణ చేపట్టారు. బాలిక, ఆమె తల్లిని కొణిజర్లలో విచారించి పూర్తి వివరాలు సేకరించారు.

నాలుగు రోజుల క్రితం ఖమ్మం ఇందిరానగర్ సమీపంలో నివాసం ఉండే బాలిక తల్లితో గొడవ పడి ఇంటి నుంచి బయటకువెళ్లింది. తనికెళ్లకు చెందిన ఇద్దరు యువకులు ఆమెకు మాయమాటలు చెప్పి ద్విచక్రవాహనంపై కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోకి తీసుకొచ్చారు. అక్కడ పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. రాత్రి కొణిజర్ల తీసుకొచ్చి అక్కడ ఓ వస్త్ర దుకాణంలో కొత్త దుస్తులు కొనిచ్చి ఖమ్మం వైపు వెళ్లే స్కార్పియో వాహనంలో ఎక్కించారు.  

అందులో ప్రయాణిస్తున్న కొణిజర్లకు చెందిన ముగ్గురు యువకులు ఆమెను ఖమ్మం శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. స్కార్పియో డ్రైవర్, మరో యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారికి మరో యువకుడు సహకరిం చాడు. మరుసటి రోజు వేకువజామున బాలికను కొణిజర్ల తీసుకొచ్చి వదిలేశారు. ఆచూకీ తెలుసుకొని తల్లి వచ్చి ఇంటికి తీసుకెళ్లింది.  జరిగిన విషయం తెలుసుకొని బాధితురాలి తల్లి ఆదివారంకొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా,  ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు  యువకులను, సహకరించిన మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement