
అక్రమ కలప పట్టివేత
ఆదిలాబాద్: కరీంనగర్ జిల్లా కప్పార్‌రావుపేట గోదావరి తీరం గుండా సోమవారం మోడెల ద్వారా అక్రమంగా తరలిస్తున్న కలపను ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ అటవీ శాఖ అధికారి ప్రతాప రెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 30 దుంగలు లభ్యం అయ్యాయని వాటి విలువ రూ.45 వేలు ఉంటుందని చెప్పారు. కలపను తాళ్లపేట రేంజికి తరలించామన్నారు.
(దండేపల్లి)