Timber
-
మంచంపైనే ఉండి కోట్ల సంపాదన.. సంకల్పం ఉండాలంతే!
రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల వ్యాపారి.. కోట్ల విలువైన కలప బిజినెస్‌ను చేస్తున్నారు. మంచానికే పరిమితమైనా సరే.. తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్నారు. కలపకు సంబంధించిన టింబర్ డిపోల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకొని, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. టీఏ షానవాస్ స్వస్థలం కాసరగోడ్ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్. వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో 2010, మే 6న అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించడంతో ఆయనకు స్పైనల్ కార్డ్ దెబ్బతిందని, ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని డాక్టర్లు సూచించారు. దీంతో నాలుగు నెలలు ఆయన ఐసీయూలో మంచానికే పరిమితమయ్యారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆపరేషన్ చేసి ఆస్పత్రిలోనే 5 నెలలు ఉంచారు. ఆయన మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడంతో మెడ కొంచెం కదిలించడానికి వీలవుతోందని వైద్యులు తెలిపారు. 9 నెలల తర్వాత తన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నారు. తన భార్య సాయంతో ఓ లారీ కలప కొని వ్యాపారం ప్రారంభించారు. లాభాలు రావడంతో మరలా కలప కొని అమ్మడం ప్రారంభించారు. ఇలా వ్యాపారం మళ్లీ గాడిలో పడింది. అయితే ఇదంతా కూడా ఆయన మంచం మీది నుంచే పర్వవేక్షణ చేశారు. ఇప్పుడు షనవాస్ ఆఫ్రికా, మలేషియా, మాల్దీవుల నుంచి కూడా కలప తెప్పిస్తున్నారు. కేరళలో భవన నిర్మాణాలకు అవసరమైన కలప విక్రయిస్తున్నారు. అయితే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం వాటిని స్వీకరించాలని అంటున్నారు షాన్వాస్. వ్యాపారం విజయవంతంగా కొనసాగించడంలో తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఎంతో ఉందని తెలిపారు. -
వాల్టాకు తూట్లు
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఓ వైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంటే... మరో వైపు కలప అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. వాల్టా చట్టం అక్రమార్కులకు చుట్టంగా మారుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వృక్షాలను నరుకుతున్నారు. గ్రామాల్లో భారీ వృక్షాలు కనుమరుగవుతున్నా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కలపను అక్రమంగా తరలిస్తున్నారని ఫారెస్ట్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇస్తే వారి జేబులు నింపేసుకుంటున్నారనే తప్ప వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు. లారీల్లో కలప రవాణా చేసేందుకు సిద్ధంగా ఉందని చెబితే అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు మామూళ్లు తీసుకుని వెళ్లిపోతున్న సంఘటనలు కోకొల్లలు. అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలంలో కలప అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మండల పరిధిలోని రెడ్డిపల్లి, వెంకట్రావ్పేట, గడిపెద్దాపూర్, ముస్లాపూర్, చిల్వెర గ్రామాల్లో అక్రమార్కులు చెట్లను నరికి పట్టపగలే లారీల్లో తరలిస్తున్నారు. హైదరాబాద్, పెద్దశంకరంపేట, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన వ్యాపారులు స్థానిక ఫారెస్ట్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ యథేచ్ఛగా తమ పని కానిచ్చేస్తున్నారు. జిల్లా ఫారెస్టు అధికారులు మాత్రం కలప అక్రమ వ్యాపారాన్ని చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వాల్టా చట్టం ప్రయోగించి వాహనాలను సీజ్ చేస్తామని చెబుతున్నా... ఎక్కడా అమలు కావడం లేదు. చెట్లను నరికిన కలప దుంగలను రోడ్డు పక్కనే తరలించేందుకు సిద్ధంగా ఉంచినా అధికారులు మాత్రం వాటి జోలికి పోకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పంట పొలాల్లోని చెట్లను నరుక్కోవాలంటే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. చెట్లను కొట్టాలంటే కొంత రుసుం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతూ కట్టెకోత మిషన్లకు, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం 10 లారీల వరకు కలప రవాణా కొనసాగుతోంది. అక్రమంగా నిల్వ అల్లాదుర్గం మండలంలోని కట్టెకోత మిషన్ల యజమానులు కలప వ్యాపారం చేపడుతున్నారు. అనుమతులు లేకున్నా చెట్లను నరుకుతూ భారీ ఎత్తున కొత మిషన్లలో నిల్వ ఉంచుతున్నా... వీరిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫారెస్టు అధికారులు ఒక్కో లారీకి రూ.రెండు వేలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్కమార్కులు తమ పలుకుబడిని ఉపయోగించి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో రాత్రిపూట కలపను లారీల్లో భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఇవ్వలేదు కలప రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కలప అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేస్తాం. వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కట్టెకోత మిషన్ల ద్వారా రైతులకు సంబంధించిన పనిముట్లు, వంట చెరుకుగా వినియోగించుకోవచ్చు. అనుమతిలేకుండా కలపను రవాణా చేస్తే చర్యలు తప్పవు. కలప అక్రమ వ్యాపారాన్ని అరికడతాం. – వెంకట్రామయ్య, పెద్దశంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ -
అటవీ అధికారుల మాయ..!
పట్టుకున్నది ఎక్కువ..తరలించింది తక్కువ మీడియా దృష్టికి రావడంతో రాత్రికి రాత్రే కార్యాలయానికి చేర్చివేత చర్చనీయాంశంగా మారిన అధికారుల తీరు ములుగు : గృహ అవసరాల నిమిత్తం కలపను తరలిస్తున్న వారిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టుకున్నది కొండంత అయితే అటవీ కార్యాలయానికి మాత్రం కొంత మాత్రమే తరలించి మిగతాది స్వాహా చేద్దామనుకున్నారు. ఇంతలోనే గుట్టు రట్టవడంతో స్వాహా చేద్దామనుకున్న కర్రను తీసుకొచ్చారని తెలిసింది. ఈ తతంగంపై అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సైతం విచారణ చేపట్టినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11న నల్లబెల్లి మండలం మేడపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి మూడు ఎడ్లబండ్ల ద్వారా రాత్రి పూట ఇంటి అవసరాలకు కలపను తరలిస్తున్నారు. ములుగు మండలం సర్వాపురం సమీపంలో తోగు వద్ద ఎడ్లకు నీళ్లు తాగిస్తుండగా కొంత మంది స్థానికులు కలపను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్షన్ అధికారి హట్కర్ రమేశ్, బీట్ అధికారి హనుమ, ఇతర సిబ్బంది రాయినిగూడెం సమీపంలో ఎడ్ల బండ్ల ద్వారా తరలిస్తున్న కలపను పట్టుకున్నారు. ఎడ్లు నడిచే పరిస్థితి లేకపోవడంతో రెండు ట్రాక్టర్లలో కలపను వేసుకొని ములుగు అటవీ కార్యాలయానికి తరలించారు.కలపను తరలిస్తున్న వారితో రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకోవడానికి అధికారులు ప్రయత్నించినా ఫలించలేదని తెలిసింది. దీంతో కర్ర తరలిస్తున్న వారిని ముప్పు తిప్పులు పెట్టినట్లు సమాచారం. వారిని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు గుంజడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. కలప మాయమైంది ఇలా.. కలపను పట్టుకున్న అధికారులు కొంత మొత్తం మాత్రమే ములుగు కార్యాలయానికి తరలించారు. ఇందులో కేవలం 30 దుంగలు, దూలాలు మాత్రమే ఉన్నాయి. మిగతా మూడు దూలాలు, 30 పెద్దేగి సైజులు, మూడు చెక్కలను కొత్తూరు, దేవగిరిపట్నంలో దాచి ఉంచినట్లు సమాచారం. పట్టుకున్న కలపను మొ త్తం తీసుకురాకుండా రెండొంతులు మధ్యలో లాక్కున్నారని కలప తరలిస్తున్న వారు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆదివారం రాత్రి దాచిన కలప దుంగలను ములుగు కార్యాలయానికి తరలించారని తెలిసింది. నాలుగు రోజులుగా మూగ జీవాల రోదన గత శుక్రవారం రాత్రి పట్టుకున్న ఎడ్ల బండ్లను అధికారులు ములుగు అటవీ కార్యాలయానికి తరలించారు. అదే రోజు కేసు నమోదు చేసి పంపిచాల్సిన అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు. నాలుగు రోజులుగా మూగజీవాలు మంచినీటికి , మేతకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇదే విషయమై రైతులు అధికారులను ఎన్ని సార్లు వేడుకున్నా పట్టించుకోలేదని కర్ర తరలించిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పట్టుకున్న ఎడ్లబండ్లు, పశువులను కేసు నమోదు చేసి వదలిపెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫ్లయింగ్ స్క్వాడ్ విచారణ పట్టుకున్న కలపలో కొంత కలపను దాచిన విషయం బయటకు పొక్కడంతో సోమవారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారి సందీప్ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. సంబంధిత సెక్షన్ అధికారి, బీట్ అధికారితో పాటు ఇతర సిబ్బందిని విచారించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు జరిగిన పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి చిన్న విషయంలో శాఖ పరమైన నిబంధనల ప్రకారం స్పందించే అటవీ శాఖ తమ సొంత శాఖ సిబ్బంది తీరుపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అంశం. -
జోరుగా చెట్ల నరికివేత
♦ మితిమీరుతున్న కలప వ్యాపారుల ఆగడాలు ♦ పచ్చదనాన్ని మటుమాయం చేస్తున్న వైనం ♦ కరువు విలయ తాండవం చేస్తున్నా పచ్చని చెట్లను వదలని అక్రమార్కులు ♦ చోద్యం చూస్తున్న అధికారులు మెదక్: కరువు కాటకాల నివారణకు ఏకైక ఆయుధం చెట్లు పెంచడమేనని పాలకులు పదే పదే చెబుతూ హరితహారం పథకం ప్రారంభించారు. కానీ అక్రమ కలప వ్యాపారుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఎక్కడ చెట్టు కనిపించినా అక్కడ గబ్బిలంలా వాలిపోయి రైతులకు ఎంతో కొంత ముట్టజెప్పి గంటల వ్యవధిలో నేల కూలుస్తున్నారు. ఓ పక్క కరువు విలయ తాండవం చేస్తున్నా ఊరుకోని వ్యాపారులు ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చిన్నశంకరంపేట, బొల్లారం, గుమ్మడిదల, చేగుంట, జిన్నారం, బీహెచ్ఈఎల్, పటాన్చెరు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలకు కలప అవసరం ఉండడంతో జిల్లాలోని చెట్లన్ని ఇబ్బడి ముబ్బడిగా నరికేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఊరూరా కలప వ్యాపారులను తయారు చేసి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఈ పచ్చదనంపైకి ఉసిగొల్పుతున్నారు. అసలే కరువు, కాటకాలతో విలవిలలాడుతున్న అన్నదాతలు పైసా సంపాదించే దారిలేక వారిచ్చే ఎంతో కొంత డబ్బులు తీసుకొని పొలం గట్లపైనున్న చెట్లను అమ్ముతున్నారు. దీంతో అక్రమ కలప వ్యాపారులు మామూళ్లతో అధికారుల నోళ్లు మూయించి తమ దందాను మూడు చెట్లు, ఆరు లారీలు అన్న చందంగా కొనసాగిస్తున్నారు. గడిచిన రెండునెలలుగా మెదక్ మండలంలోని ఫరీద్పూర్, జక్కన్నపేట, సర్ధన, ముత్తాయిపల్లి, కూచన్‌పల్లి తదితర గ్రామాల శివారులో నుంచి నిత్యం పదుల సంఖ్యలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా ఫారెస్ట్ అధికారుల కళ్లముందే జరుగుతున్నా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా మూడు రోజులుగా మెదక్ మండలం ఫరీద్పూర్ గ్రామ శివారులోని చెట్లను నరుకుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు పాలకులు హరితహారం పథకంలో మొక్కలు నాటాలని ప్రచారం చేస్తోంటే అధికారులు మాత్రం దగ్గరుండి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కలప వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా విషయం మా దృష్టికి రాలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
హరితం.. ఆవిరి
♦ గడప దాటుతోన్న కలప ♦ మామూళ్ల మత్తులో అధికారులు ♦ జోరుగా అక్రమ దందా హరితం ఆవిరవుతోంది. కలప గడప దాటిపోతోంది. అక్రమార్కులు పచ్చని చెట్లను నరికి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో నిత్యం కలప అక్రమ రవాణా అవుతున్నా అడ్డుకునే వారు లేకుండా పోయారు. వాల్టా చట్టం ఉన్నా అమలు చేసేవారు లేరు. మామూళ్లకు ఆశపడుతున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తోండడంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నంగునూరు, కొండపాక, సిద్దిపేట మం డలాలకు చెందిన కలప వ్యాపారులు గుట్టుగా అక్రమ దందాను సాగిస్తోన్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల, ఖాత, అక్కెనపల్లి, నర్మేట, ఆంక్షాపూర్, తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, నాగరాజుపల్లి, నంగునూరు, ఓబులాపూర్ తదితర గ్రామాల్లో చింత, మామిడి, తుమ్మ చెట్లను ఇష్టారీతిగా నరికివేస్తున్నారు. చెట్లను నరకాలంటే తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. అనంతరం ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ అనంతరం వారు ఇచ్చే ఎస్టిమేషన్ ఆధారంగా డీడీ తీసుకొని అటవీ అధికారులకు అందజేయాలి. కానీ కలప వ్యాపారులు ఇదేమి పట్టించుకోకుండా అనుమతులు లేకుండా ఇష్టారీతిగా చెట్లను కూల్చివేస్తున్నారు. ఆపై కలపను అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నర్మేట నుంచి దుద్దెడకు అక్రమ రవాణా... కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేటకు చెందిన సామిల్ వ్యాపారులు నంగునూరు మండలంలోని చాలా గ్రామాల నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. ఉదయం పూట చెట్లను నరికి చీకటి పడగానే నర్మేట నుంచి కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి మీదుగా బందారం నుంచి దుద్దెడకు అ క్రమ రవాణా సాగిస్తున్నారు. నంగునూరు మండలానికి చెందిన పలువులు కలప వ్యాపారులు దుద్దెడలోని సామిల్ వ్యాపారులతో బే రం కుదుర్చుకొని చెట్లను అమ్ముకుంటున్నారు. 15 రోజుల కిందట కలపను తరలిస్తున్న క్రమంలో ముండ్రాయి శివారులో లారీ బోల్తా పడడంతో కూలీలకు దెబ్బలు తగిలినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని అటవీ అధికారులకు ఫోన్ చేస్తే ప ట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. నెలనెలా మామూళ్లు ఇవ్వకుంటే కేసులు... కొందరు వ్యక్తులు గ్రామాల్లోని రైతుల వద్ద తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేసి రెట్టింపు ధరకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. సాయంత్రం చెట్లను నరికివేస్తూ రాత్రికి రాత్రే రవాణా చేస్తున్నారు. ప్ర తినెలా ఫారెస్ట్ అధికారులకు మాముళ్లు ఇ స్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తారో ముందుగా అధికారులకు చెబు తూ గుట్టుగా అక్రమ దందా సాగిస్తున్నా రు. నంగునూరు మండలం నుంచి రోజు ఐదు ట్రాక్టర్ల ద్వారా కలపను తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా అధికారు లు స్పందించి అంతరించిపోతున్న వనాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
రూ. 3 లక్షల విలువైన కలప స్వాధీనం
రెడ్డిగూడెం: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన కలపను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు రావడం గమనించి కలప దొంగలు ట్రాక్టర్లో నుంచి దుంగలను పడేసి ట్రాక్టర్‌తో పరారయ్యారు. అధికారులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. -
జడ్చర్లలో పోలీసుల దాడులు
జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలోని పారిశ్రామిక వాడలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు బుధవారం ఉదయం దాడులు చేసిన పోలీసులు 10 టన్నుల బరువున్న 80 దుంగలను సీజ్ చేశారు. అయితే, అవి ఎర్రచందనం దుంగలా? లేక టేకు కలపా అనేది నిర్ధారణ కాలేదు. ఇందుకోసం వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించాకనే ఏమిటనేది నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. -
8 టేకు దుంగలు స్వాధీనం
తిర్యాని: ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎఫ్ఎస్ఓ రవికుమార్ సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 8 దుంగలను పట్టుకున్నారు. వాహనంలోని వ్యక్తులు కారును పరారయ్యారు. దుంగలను, కారును అటవీశాఖ సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
కరీంనగర్ జిల్లా : అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి పట్టుకున్నారు. మహదేవ్ పూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనంలో కలప తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. -
రూ. 7 లక్షల కలప దుంగలు స్వాధీనం
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 13 కలప బండ్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో భూపాలపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటుగా వస్తున్న బండ్లను తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న దుంగలు కనిపించాయి. స్వాధీనం చేసుకున్న కలప బండ్ల విలువ రూ. 7 లక్షల వరకు ఉంటుందని పోలీసుల తెలిపారు. -
రూ.2 లక్షల విలువైన కలప స్వాధీనం
కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం దాదాపు 100 మంది అటవీ అధికారులు, సిబ్బంది కలసి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇల్లిల్లూ సోదాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల విలువైన కలపను పట్టుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని వారు తెలిపారు. -
కారులో టేకు అక్రమ రవాణా
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ శాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు అందులోని 12 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాసిపేట్ మండలం నుంచి మంచిర్యాలకు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది. -
100 టేకు దుంగలు స్వాధీనం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామారెడ్డిలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పలు టింబర్ డిపోలపై అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 100 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 5 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
ఏటూరునాగారం: కిరాణా షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన భవాని కిరాణ దుకాణంలో అక్రమంగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో దుకాణంలో సోదాలు జరిపి రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దుకాణ యజమాని శివప్రసాద్ రూ. 1.20 లక్షల విలువ చేసే టేకు చక్కలను అక్రమంగా నిల్వ ఉంచినట్టు పోలీసలు గుర్తించారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని టేకు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఇండికా కారులో బయటపడ్డ టేకు కర్రలు
సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన ఓ చిన్న రోడ్డు ప్రమాదంతో కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు కర్రలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే లారీ వెళ్లిపోగా కారు అక్కడే నిలిచిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ కారు వద్దకు చేరుకుని తనిఖీ చేయగా అందులో రూ.40 వేలు నుంచి రూ.50 వేల విలువ చేసే టేకు కర్రలు తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఆ కారును స్టేషన్‌కు తరలించారు. -
టేకు దుంగల పట్టివేత
ఆదిలాబాద్ : అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు..అటవీ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇండికా వాహనంలో ఆరు టేకు దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని, టేకు దుంగలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కాగా, దుంగలు తరలిస్తున్న నిందితులు వాహనాన్ని వదిలేసి పరారైనట్లు అటవీ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (కానాపూర్) -
కలపకు కాళ్లు !
తాడేపల్లి రూరల్ : అక్రమంగా కలప తరలింపు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్న వారి దందా అధికమైంది. అడిగే వారు లేకపోవడంతో యథేచ్ఛగా దోచుకుంటున్నారు. తాడేపల్లి మండలం గుండిమెడలో జరుగుతున్న అక్రమ కలప తరలింపు వ్యవహారం ఇది.. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని ఇసుక క్వారీ సమీపంలో కృష్ణానదీ చెంత దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇక్కడ ఇంగ్లిషు కంప చెట్లు ఇతర చెట్లు భారీగానే ఉన్నాయి. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. ఇంకేముంది వెనుకా ముందు ఆలోచించకుండా పర్యవరణానికి మేలు చేసే చెట్లను విక్షణారహితంగా నరికివేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీని కోసం కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిత్యం గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాలకు ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. పెద్ద పెద్ద దుంగలను నరికి గుట్టలుగా పేర్చి అమ్ముకుంటున్నారు. అయితే, ఊరికి దూరంగా ఎక్కడో లోపల ఇసుక క్వారీకి అవతల ఈ తతంగం అంతా జరుగుతుండడంతో, బాహ్య ప్రపంచానికి కలప అక్రమ తరలింపు గురించి తెలియడం లే దు. అక్రమ ఆదాయానికి అలవాటు పడ్డ కొందరు ఈ చెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. రోజు కూలికి ఆశపడి వచ్చే కూలీలు ఇవేమీ తెలియక చెట్లు నరికే పనిలో నిమగ్నమైపోతున్నారు. అసైన్డ్ భూమిలోకి అందునా పంచాయతీ లంక భూముల్లోకి ప్రవేశించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరిగా ఉండాలి. కానీ, అక్రమార్కులు ఇవేమీ లేకుండానే చెట్లను నరుకుతూ, పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. మరో వైపు లక్షలు సంపాదిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లక్షల విలువ చేసే ప్రభుత్వ సంపద అక్రమంగా తరలి పోతుంటే ఏ అధికారి స్పందించక పోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఇకనైనా అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. -
అక్రమ కలప పట్టివేత
ఆదిలాబాద్: కరీంనగర్ జిల్లా కప్పార్రావుపేట గోదావరి తీరం గుండా సోమవారం మోడెల ద్వారా అక్రమంగా తరలిస్తున్న కలపను ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ అటవీ శాఖ అధికారి ప్రతాప రెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 30 దుంగలు లభ్యం అయ్యాయని వాటి విలువ రూ.45 వేలు ఉంటుందని చెప్పారు. కలపను తాళ్లపేట రేంజికి తరలించామన్నారు. (దండేపల్లి) -
అంబులెన్స్‌లో అక్రమంగా కలప రవాణా
హైదరాబాద్: అక్రమ రవాణకు అంబులెన్స్‌ను ఉపయోగించి అధికారులకు దొరికిపోయారు. ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో ఈ ఘటన జరిగింది. తులసిపాక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం అంబులెన్స్‌లో అక్రమంగా కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కలపను స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు?
ఆవరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థల దృష్ట్యా భారత దేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి. విలువైన కలప, వంట చెరకు రూపంలో అడవులు ఆకర్షణీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఆర్థికంగా అనేక విధాలుగా తోడ్పడుతున్నందు వల్ల వీటిని ‘జాతీయ సంపద’గా పరిగణిస్తారు. భారతదేశ సహజ ఉద్భిజ్జ సంపద భారతదేశంలోని వృక్ష సంపదను ఉష్ణోగ్రత, వర్షపాతం, నిమ్నోన్నతాలు ప్రభావితం చేస్తున్నాయి. వీటి ఆధారంగా భారతదేశంలో అడవులను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. సతత హరిత అరణ్యాలు: ఇవి ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అడవులు, అర్ధసతత హరిత అడవులు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి 500 - 1500 మీటర్ల ఎత్తులో, 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. పశ్చిమ కనుమల దక్షిణ భాగం (కేరళ, కర్ణాటక రాష్ట్రాలు), ఈశాన్య రాష్ట్రాలు (అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్), అండమాన్ నికోబార్ దీవులు మొదలైన ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా మైదానాల్లోనూ కనిపిస్తాయి. ఈ వృక్షాలు చాలా దట్టంగా ఉండి 45-60 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. రోజ్‌వుడ్ (నల్ల ఇరుగుడుచేవ), నల్లతుమ్మ (్కఅఊ), అయిని, తెల్సూర్, చంపక వృక్షం, టూన్, గుర్జాన్, ఐరన్ ఉడ్, ఎబోని, సిమార్, లారిల్ మొదలైనవి ఈ అడవుల్లో పెరిగే ప్రధాన వృక్ష జాతులు. ఈ అరణ్యాల కలప చాలా గట్టిగా ఉండటం వల్ల వీటిని ‘కఠినదారు వృక్షాలు’ అంటారు. వీటిని వినియోగించడం కష్టతరమైన పని కాబట్టి వీటి వాణిజ్య విలువ చాలా తక్కువ. వీటిని ఎక్కువగా కలప, కాగితం, అగ్గిపెట్టెలు మొదలైన వాటికి ఉపయోగిస్తారు. 2. ఆకురాల్చే అడవులు: ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఎ) ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులు: ఇవి 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉన్న కొండ ప్రాంతాలు, పీఠభూమి ఉపరితలాల్లో పెరుగుతాయి. ఇవి ముఖ్యంగా పశ్చిమ కనుమలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఛోటానాగ్పూర్ పీఠభూమి, శివాలిక్ కొండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి పొడవైన వృక్షాలుగా, పొదలు దగ్గర దగ్గరగా దట్టంగా పెరిగే విలక్షణమైన అడవులు. వీటిని ‘రుతుపవన అడవులు’, ‘బహిరంగ తృణ భూములు’ అని కూడా అంటారు. ఈ అడవుల్లోని వృక్షాలు 25-60 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. ఇవి వేడి శుష్క వాతావరణ కాలంలో 6-8 వారాలపాటు ఆకులను రాలుస్తాయి. ఈ అడవుల్లో ‘టేకు’ వృక్షాలు ప్రబలంగా ఉంటాయి. వీటితో పాటు గుగ్గిలం (శివాలిక్ కొండలు), మంచి గంధం (కర్ణాటక), షీషమ్, వెదురు, హుర్రా, ఖైర్ మొదలైన వృక్షాలు పెరుగుతాయి. వీటి ఉత్పత్తులను కలప, కొయ్య సామగ్రి, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బి) ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అడవులు: ఇవి 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉండే పీఠభూమి, మైదానాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిలో అధికంగా ఉన్నాయి. గంగా మైదానం, పశ్చిమాన ‘థార్’ ఎడారి వరకు, హిమాలయాలు, పశ్చిమ కనుమలకు మధ్య ఉన్న విశాల భూభాగంలో ఈ అడవులున్నాయి. శుష్క (వేసవి) రుతువుల్లో ఆకులను విస్తారంగా రాల్చడం, వృక్షాలు బోడిగా కనపడటం ఈ అడవుల ముఖ్య లక్షణం. ఈ అడవుల్లో పెరిగే వృక్ష జాతులు - టేకు, వెదురు, గుగ్గిలం, ఖేర్ మొదలైనవి. 3. ఉష్ణమండల ముళ్ల జాతి అడవులు: ఈ రకమైన అరణ్యాలు ముఖ్యంగా 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉండే శుష్క ప్రాంతాల్లో పెరుగుతాయి. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మైదానాలు, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు, సముద్రానికి సమీపంగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి 6-10 మీటర్ల ఎత్తు వరకు పెరిగి ముళ్ల పొదలుగా, గిడసబారిన చెట్లుగా ఉంటాయి. ఈ అడవుల్లో అకేసియా, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి మొక్కలు సర్వసాధారణంగా ఉంటాయి. ఈ అరణ్యాల్లో తుమ్మ (బాబుల్), నల్లతుమ్మ మొదలైన వృక్ష జాతులు ముఖ్యమైనవి. తేమతో కూడిన పల్లపు భూముల్లో అడవి ఖర్జూరం చెట్లు పెరుగుతాయి. ఆకురాల్చే అడవుల్లో ముఖ్యమైన జంతు సంపద ఉత్పత్తి లక్క. ఇది జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికంగా ఉత్పత్తి అవుతోంది. దీన్ని ఎక్కువగా విద్యుత్ నిరోధకంగా, సీల్స్ వేయడానికి ఉపయోగిస్తారు. 4. మడ అడవులు లేదా టైడల్ అడవులు: ఇవి ముఖ్యంగా బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు, పోటుపాట్లకు గురయ్యే ఉప్పు నీటి, మంచి నీటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి ప్రధానంగా తీరాంచల ప్రాంతాలు, గంగా, మహానది, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని ఏరులు, దీవుల్లో పెరుగుతాయి. ఇవి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటికి శ్వాసవేర్లు ఉంటాయి. ఈ వేర్లు బురద నుంచి పైకి చొచ్చుకు వచ్చి ఉంటాయి. ‘మడ’ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ‘మడ అడవులు’ అంటారు. ‘బెంగాల్’ డెల్టాలో ‘సుందరి’ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వీటిని ‘సుందర వనాలు’ అంటారు. పేము, తాటి వృక్ష జాతులు వీటిలో ముఖ్యమైనవి. ఈ అడవులలోని వృక్షాలు మాంగ్రోవ్ వంశానికి చెందడం వల్ల వీటిని ‘మాంగ్రోవ్ అరణ్యాలు’ అని కూడా అంటారు. ఈ అరణ్యాల కలపను నౌకా నిర్మాణం, న్యూస్ పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. 5. పర్వతీయ అరణ్యాలు: ఇవి రెండు రకాలు. ఎ) హిమాలయాల్లోని సమశీతోష్ణ అడవులు: ఇవి ముఖ్యంగా హిమాలయాల్లోని మధ్య హిమాలయ శ్రేణులు (హిమాచల్)లో 1600 - 3000 మీ. ఎత్తు వరకు, 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉండే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఓక్, తమాల (పొన్న), చెస్ట్నట్, వాల్నట్, మాపుల్, సంపెంగ జాతి, ఆల్డర్లు లాంటి వెడల్పాటి ఆకులున్న వృక్షాలు పెరుగుతాయి. వీటినే ‘శృంగాకార అరణ్యాలు’ అంటారు. బి) ఆల్ఫైన్ అడవులు: ఇవి ముఖ్యంగా 3,500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతాల్లో (హిమాద్రి శ్రేణుల్లో) పెరుగుతాయి. వీటిలో ముఖ్యమైన వృక్ష జాతులు - దేవదారు, సిడారు, వెదురు, రోడో డెండ్రాన్లు, విల్లో, బిర్చ, జునిఫెర్, సిల్వర్ ఫెర్, పైన్ మొదలైనవి. ఈ అరణ్యాల్లోని కలపను అగ్గిపెట్టెలు, హస్తకళలు, జిగురు, కర్రగుజ్జు, టర్పంటైన్, రైల్వే స్వీపర్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు ఉన్న ప్రాంతం ‘కోరింగ’. అటవీ భూమి విస్తరణ భారతదేశంలో 2000-01 సంవత్సరం లెక్కల ప్రకారం 6,75,538 చ.కి.మీ. విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇది దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.55 శాతం. 1952 - జాతీయ అటవీ విధానం’ ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20 శాతం, పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60 శాతం.. మొత్తం మీద దేశ బౌగోళిక విస్తీర్ణంలో 1/3వ వంతు భూభాగంలో (33.3 శాతం) అడవులు విస్తరించి ఉండాలి. 2000-01 లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ (77,265 చ.కి.మీ.). అత్యల్ప విస్తీర్ణం ఉన్న రాష్ట్రం హర్యానా (1754 చ.కి.మీ.). ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చి చూసినప్పుడు (శాతాల్లో) అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ (62.1 శాతం), అత్యల్ప అడవులున్న రాష్ట్రం హర్యానా (3.8 శాతం). ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట - 2013 దీని ప్రకారం భారతదేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 6,97,898 చ.కి.మీ. ఇది దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 21.23 శాతం. దేశంలో విస్తీర్ణపరంగా అడవులు అధికంగా ఉన్న రాష్ట్రాలు 1) మధ్యప్రదేశ్ (77,522 చ.కి.మీ.) 2) అరుణాచల్ ప్రదేశ్ (67,321 చ.కి.మీ.) దేశంలో విస్తీర్ణపరంగా అత్యల్పంగా అడవులున్న రాష్ట్రాలు 1) హర్యానా (1586 చ.కి.మీ.) 2) పంజాబ్ (1772 చ.కి.మీ.) ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చి చూసినప్పుడు (శాతాల్లో) దేశంలో అత్యధికంగా అడవుల భూభాగం ఉన్న రాష్ట్రం మిజోరాం (90.38 శాతం). అతి తక్కువ అడవుల భూభాగం ఉన్న రాష్ట్రం పంజాబ్ (3.52 శాతం). కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణపరంగా అడవులు అండమాన్ నికోబార్ దీవుల్లో అధికంగా, డామన్ డయ్యూలో అత్యల్పంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం 1988లో రెండో అటవీ విధానాన్ని ప్రకటించింది. 2006లో నూతన పర్యావరణ విధానాన్ని తీసుకొచ్చారు. {పపంచ పర్యావరణ దినోత్సవం ‘జూన్ 5’. సామాజిక అడవులు అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళిక (1974-79)లో ప్రారంభించింది. ఇది 6వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1980-85) లో ఎక్కువగా అమలైంది. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల కోసం అడవులకు సంబంధించి ఏయే అంశాలను చదవాలి? - ఆర్.అలేఖ్య, ఆదిలాబాద్. భూగోళ శాస్త్రంలో ‘అడవులు’ పాఠ్యభాగానికి భౌగోళికంగా ప్రత్యేక స్థానం ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల ‘భారత దేశ సహజ ఉద్భిజ్జ సంపద’కు సంబం ధించిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి. దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే రకమైన అడవులున్నాయి? అవి ఆయా ప్రదేశాల్లోనే పెరగడానికి కారణాలు, వాటిలోని ముఖ్యమైన వృక్షజాతులు, అటవీ ఉత్పత్తులు - వినియోగిస్తున్న పరిశ్రమలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. వీటి కోసం 6 నుంచి 10 వ తరగతి వరకు ఉన్న సాంఘికశాస్త్ర పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. మనదేశంలో ప్రధానంగా ఉష్ణమండల, సమశీతోష్ణస్థితికి చెందిన రకాలైన అడవులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ప్రదేశ ఎత్తు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. భారతదేశ నైసర్గిక స్వరూపంపై పూర్తిగా అవగాహన పెంచు కుంటే చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి. మాదిరి ప్రశ్నలు 1. 2001 లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం ఉన్న రాష్ట్రం? 1) హర్యానా 2) పంజాబ్ 3) ఛత్తీస్‌గఢ్ 4) మధ్యప్రదేశ్ 2. హిమాలయాల్లో 3000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రాంతాల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1) టైడల్ అడవులు 2) ముళ్లజాతి అడవులు 3) ఆల్ఫైన్ అడవులు 4) ఆకురాల్చే అడవులు 3. టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు? 1) మడ అడవులు 2) ఆల్ఫైన్ అడవులు 3) ఆకురాల్చే అడవులు 4) సతత హరిత అడవులు సమాధానాలు: 1) 4; 2) 3; 3) 3. ముల్కల రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, హరీష్ అకాడమీ, హన్మకొండ. -
కలప స్మగ్లింగ్ గుట్టు రట్టు
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : కొందరు అక్రమార్కులు వందేళ్ల చరిత్ర ఉన్న కలపను నిమిషాల్లో నేల కూలుస్తున్నారు. సామిల్ ముసుగులో అక్రమ వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. బుధవారం రాత్రి అటవీ శాఖ అధికారు ల దాడులతో అక్రమార్కుల బండారం బయటపడిం ది. జిల్లా కేంద్రంలోని దుబ్బ రోడ్డులో గల గ్యాస్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన దుంగలను చూసిన అధికారులకు దిమ్మతిరిగినంత పనైంది. ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఒ వేణుబాబు శనివారం ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడారు. పట్టుబడ్డ టేకు దుంగలు 10.46 క్యూబిక్ మీటర్లు ఉన్నాయని, వాటి విలువ రూ 3 లక్షల కుపైగా ఉంటుందని పేర్కొన్నారు. దుంగలను వాహనంలో నింపుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిం చగా ఆసక్తికర విషయాలు తెలిశాయన్నారు. వీటిని కంఠేశ్వర్ నుంచి అర్సపల్లి వెళ్లే బైపాస్ రెడ్డులో గల శివశక్తి సామిల్‌కు తరలిస్తున్నట్లు వారు తెలిపారన్నారు. పట్టుబడ్డ నలుగురిపై అటవీచట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు వేణుబాబు తెలిపారు. 30 ఏళ్లలో ఇదే అతిపెద్ద కలప రాకెట్ అని, నిందితులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. రాజకీయ, ఇంటిదొంగల అండదండలతో.. శివశక్తి సామిల్ యజమానుల్లో ఒకరైన ముత్యంరెడ్డి అధికార పార్టీ నాయకుల అండదండలతో చాలా ఏళ్లుగా ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పక్క జిల్లాల నుంచి అక్రమంగా కలప తీసుకు వచ్చి నగరంలో విక్రయిస్తుంటాడని సమాచారం. ప్రస్తుతం పట్టుబడ్డ కలపను చత్తీస్గడ్ నుంచి తెచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది. ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలోని క్షేత్రస్థాయి సిబ్బంది ఒకరు కలప స్మగ్లర్లకు కొరియర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి దాడుల గురించి అతడు ముందే సమాచారం అందించడంతో స్మగ్లర్లు 30 టేకు దుంగలను వేరే స్థావరానికి తరలించినట్లు తెలుస్తోంది. మిగిలిన 50 దుంగలను వాహనంలో నింపుతుండగా అధికారులు పట్టుకున్నారు.