టేకు దుంగల పట్టివేత
ఆదిలాబాద్ : అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు..అటవీ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇండికా వాహనంలో ఆరు టేకు దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని, టేకు దుంగలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కాగా, దుంగలు తరలిస్తున్న నిందితులు వాహనాన్ని వదిలేసి పరారైనట్లు అటవీ అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(కానాపూర్)