హరితం.. ఆవిరి
♦ గడప దాటుతోన్న కలప
♦ మామూళ్ల మత్తులో అధికారులు
♦ జోరుగా అక్రమ దందా
హరితం ఆవిరవుతోంది. కలప గడప దాటిపోతోంది. అక్రమార్కులు పచ్చని చెట్లను నరికి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో నిత్యం కలప అక్రమ రవాణా అవుతున్నా అడ్డుకునే వారు లేకుండా పోయారు. వాల్టా చట్టం ఉన్నా అమలు చేసేవారు లేరు. మామూళ్లకు ఆశపడుతున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తోండడంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.
నంగునూరు, కొండపాక, సిద్దిపేట మం డలాలకు చెందిన కలప వ్యాపారులు గుట్టుగా అక్రమ దందాను సాగిస్తోన్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల, ఖాత, అక్కెనపల్లి, నర్మేట, ఆంక్షాపూర్, తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, నాగరాజుపల్లి, నంగునూరు, ఓబులాపూర్ తదితర గ్రామాల్లో చింత, మామిడి, తుమ్మ చెట్లను ఇష్టారీతిగా నరికివేస్తున్నారు.
చెట్లను నరకాలంటే తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. అనంతరం ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ అనంతరం వారు ఇచ్చే ఎస్టిమేషన్ ఆధారంగా డీడీ తీసుకొని అటవీ అధికారులకు అందజేయాలి. కానీ కలప వ్యాపారులు ఇదేమి పట్టించుకోకుండా అనుమతులు లేకుండా ఇష్టారీతిగా చెట్లను కూల్చివేస్తున్నారు. ఆపై కలపను అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
నర్మేట నుంచి దుద్దెడకు అక్రమ రవాణా...
కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేటకు చెందిన సామిల్ వ్యాపారులు నంగునూరు మండలంలోని చాలా గ్రామాల నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. ఉదయం పూట చెట్లను నరికి చీకటి పడగానే నర్మేట నుంచి కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి మీదుగా బందారం నుంచి దుద్దెడకు అ క్రమ రవాణా సాగిస్తున్నారు. నంగునూరు మండలానికి చెందిన పలువులు కలప వ్యాపారులు దుద్దెడలోని సామిల్ వ్యాపారులతో బే రం కుదుర్చుకొని చెట్లను అమ్ముకుంటున్నారు. 15 రోజుల కిందట కలపను తరలిస్తున్న క్రమంలో ముండ్రాయి శివారులో లారీ బోల్తా పడడంతో కూలీలకు దెబ్బలు తగిలినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని అటవీ అధికారులకు ఫోన్ చేస్తే ప ట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు.
నెలనెలా మామూళ్లు ఇవ్వకుంటే కేసులు...
కొందరు వ్యక్తులు గ్రామాల్లోని రైతుల వద్ద తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేసి రెట్టింపు ధరకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. సాయంత్రం చెట్లను నరికివేస్తూ రాత్రికి రాత్రే రవాణా చేస్తున్నారు. ప్ర తినెలా ఫారెస్ట్ అధికారులకు మాముళ్లు ఇ స్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తారో ముందుగా అధికారులకు చెబు తూ గుట్టుగా అక్రమ దందా సాగిస్తున్నా రు. నంగునూరు మండలం నుంచి రోజు ఐదు ట్రాక్టర్ల ద్వారా కలపను తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా అధికారు లు స్పందించి అంతరించిపోతున్న వనాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.