illegal danda
-
బస్టాండ్లు అక్రమదందాలకు అడ్డాలు
-
ఆ నలుగురు
గుట్కా దందాకు సూత్రధారులు వారే.. గుట్టుగా ప్యాకింగ్, సరఫరా కాశిబుగ్గలో నకిలీ ఉత్పత్తుల తయారీ యూనిట్ ? హన్మకొండ : ప్రభుత్వ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ... గుట్కా, ఖైనీ ఉత్పత్తుల అక్రమ దందా వరంగల్ నగరం కేంద్రంగా జోరుగా సాగుతోంది. ఈ చీకటి దందా వెనుక ఓ నలుగురు వ్యక్తులు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు. వరంగల్‌లోని పిన్నవారి వీధి, బీట్ బజార్లు ప్రధాన కేంద్రాలుగా మూడు ఖైనీలు ఆరు గుట్కాలు అన్న చందంగా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. కొంగొత్త పోకడలతో జిల్లా నలుమూలలకు ఇక్కడి నుంచే గుట్కా పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నారుు. అంబర్, షేర్, జోడాబైల్ వంటి ఖైనీ తయారీదారులు, పంపిణీదార్లతో సంబంధాలు నెరుపుతూ అక్రమార్కులు గల్లా పెట్టెలు నింపుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఆ నలుగురి గుట్కా దందాలోనూ ఎన్నో రహస్య కోణాలు ఉన్నారుు. అవి ఏమిటంటే.. ఈ వ్యాపారంలోకి ఒకసారి ప్రవేశించిన వారు ఎవరైనా సరే ఆ నలుగురు సరఫరా చేసే బ్రాండ్లకు సంబంధించిన గుట్కాలు, ఖైనీ, జర్దాలనే కొనాలి. వారి మాటను జవదాటితే వేధింపులు మొదలవుతారుు. పాత బీట్ బజార్‌లోని ఓ దుకాణం కేంద్రంగా ఈ నలుగురు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వారంతా కలిసి కాశిబుగ్గ ప్రాంతంలో నకిలీ గుట్కా, ఖైనీలు తయారుచేసే యూనిట్ నిర్వహిస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. అసలే చీకటి వ్యాపారం కావడంతో నకిలీ వస్తువులు అంటగట్టినా ఎదురు చెప్పేవారు లేరు. -
హరితం.. ఆవిరి
♦ గడప దాటుతోన్న కలప ♦ మామూళ్ల మత్తులో అధికారులు ♦ జోరుగా అక్రమ దందా హరితం ఆవిరవుతోంది. కలప గడప దాటిపోతోంది. అక్రమార్కులు పచ్చని చెట్లను నరికి కలపను అక్రమంగా తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో నిత్యం కలప అక్రమ రవాణా అవుతున్నా అడ్డుకునే వారు లేకుండా పోయారు. వాల్టా చట్టం ఉన్నా అమలు చేసేవారు లేరు. మామూళ్లకు ఆశపడుతున్న సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తోండడంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. నంగునూరు, కొండపాక, సిద్దిపేట మం డలాలకు చెందిన కలప వ్యాపారులు గుట్టుగా అక్రమ దందాను సాగిస్తోన్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల, ఖాత, అక్కెనపల్లి, నర్మేట, ఆంక్షాపూర్, తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, నాగరాజుపల్లి, నంగునూరు, ఓబులాపూర్ తదితర గ్రామాల్లో చింత, మామిడి, తుమ్మ చెట్లను ఇష్టారీతిగా నరికివేస్తున్నారు. చెట్లను నరకాలంటే తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. అనంతరం ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ అనంతరం వారు ఇచ్చే ఎస్టిమేషన్ ఆధారంగా డీడీ తీసుకొని అటవీ అధికారులకు అందజేయాలి. కానీ కలప వ్యాపారులు ఇదేమి పట్టించుకోకుండా అనుమతులు లేకుండా ఇష్టారీతిగా చెట్లను కూల్చివేస్తున్నారు. ఆపై కలపను అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నర్మేట నుంచి దుద్దెడకు అక్రమ రవాణా... కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేటకు చెందిన సామిల్ వ్యాపారులు నంగునూరు మండలంలోని చాలా గ్రామాల నుంచి నిత్యం ట్రాక్టర్ల ద్వారా కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. ఉదయం పూట చెట్లను నరికి చీకటి పడగానే నర్మేట నుంచి కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి మీదుగా బందారం నుంచి దుద్దెడకు అ క్రమ రవాణా సాగిస్తున్నారు. నంగునూరు మండలానికి చెందిన పలువులు కలప వ్యాపారులు దుద్దెడలోని సామిల్ వ్యాపారులతో బే రం కుదుర్చుకొని చెట్లను అమ్ముకుంటున్నారు. 15 రోజుల కిందట కలపను తరలిస్తున్న క్రమంలో ముండ్రాయి శివారులో లారీ బోల్తా పడడంతో కూలీలకు దెబ్బలు తగిలినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టాలని అటవీ అధికారులకు ఫోన్ చేస్తే ప ట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. నెలనెలా మామూళ్లు ఇవ్వకుంటే కేసులు... కొందరు వ్యక్తులు గ్రామాల్లోని రైతుల వద్ద తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేసి రెట్టింపు ధరకు ఇతరులకు అమ్ముకుంటున్నారు. సాయంత్రం చెట్లను నరికివేస్తూ రాత్రికి రాత్రే రవాణా చేస్తున్నారు. ప్ర తినెలా ఫారెస్ట్ అధికారులకు మాముళ్లు ఇ స్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తారో ముందుగా అధికారులకు చెబు తూ గుట్టుగా అక్రమ దందా సాగిస్తున్నా రు. నంగునూరు మండలం నుంచి రోజు ఐదు ట్రాక్టర్ల ద్వారా కలపను తరలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా అధికారు లు స్పందించి అంతరించిపోతున్న వనాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
కోల్ మాఫియా డాన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో ‘నల్ల బంగారం’ అక్రమ దందా అంతా ఓ వ్యక్తి కనుసన్నల్లో జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం వంటవాడిగా, హరిదాసు వేషాలు వేస్తూ పొట్ట నింపుకున్న సదరు వ్యక్తి బొగ్గుదందాలోకి ప్రవేశించి నేడు ఏటా రూ.100 కోట్ల విలువైన బొగ్గును నల్ల బజారుకు తరలిస్తూ మాఫియా డాన్‌గా ఎదిగాడు. బొగ్గు గనుల ప్రాంతం నుంచి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఇతర పరిశ్రమలకు రైల్వే వ్యాగన్ల ద్వారా వెళ్లే బొగ్గును తస్కరించి దానిని లారీలు, ట్రాక్టర్లలో రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లడం వరకు అంతా అతడి డెరైక్షన్లోనే నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. సామాన్యులెవరైనా బొగ్గు దందాకు ఎదురుతిరిగితే ఎంతకైనా తెగిస్తాడని తెలుస్తోంది. ఇక పోలీసులు, ఎన్టీపీసీ, సింగరేణికి చెందిన వారిని మాత్రం మామూళ్లతో కొడుతుంటాడు. కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు అడ్డుతగిలినప్పుడు తన చీకటి వ్యాపారానికి కొంత విరామమిచ్చి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత షరా‘మామూలు’గానే దందాను కొనసాగించడం అతని ప్రత్యేకత. రామగుండం ఎరువుల కర్మాగారం స్థాపించిన సమయంలో వేములవాడ నుంచి బతుకుదెరువు కోసం ఓ వ్యక్తి వలసవ చ్చాడు. టౌన్షిప్ సమీపంలోనే నివాసముంటూ చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి పనులు చేసేవాడు. సంక్రాంతి పండుగకు హరిదాసు వేషం వేసేవాడు. తర్వాత కొంతకాలం చిన్న హోటల్ ప్రారంభించి వంటవాడిగా అవతారమెత్తాడు. ఆ తరువాత సింగరేణికి చెందిన 7వ గని వద్ద గల బంకర్ నుంచి బొగ్గును సేకరించి సంచులలో నింపుతూ సైకిళ్లపై తీసుకెళ్లి ఎఫ్‌సీఐ టౌన్షిప్లో విక్రయించేవాడు. 1999లో ఎరువుల కర్మాగారం మూతపడ్డ తర్వాత ‘హరిదాసు’ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 2010 నుంచి అక్రమ బొగ్గు దందాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని రూ.కోట్లు ఆర్జిస్తూ కోల్ మాఫియా డాన్‌గా మారాడు. ఈ అక్రమ దందాకు ఎవరైనా అడ్డుతగలకుండా ఉండేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులతో ‘ఎస్కార్ట్’ తయారు చేసుకున్నాడు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ వీరు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. చీకటి పడిన తర్వాత బొగ్గుతో నిండిన లారీలను ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఈ ఎస్కార్ట్ ఆరు ద్విచక్రవాహనాలతో (లారీకి మూడు ముందు, మరో మూడు వెనకాల) రక్షణ కవచంగా ఉంటాయి. ఇందుకు గాను సదరు యువకులకు నెలకు రూ.2 లక్షల చొప్పున ముట్టజెపుతున్నట్లు సమాచారం. నకిలీ వేబిల్లులతో... సింగరేణి నుంచి ఎన్టీపీసీకి వెళ్లే రైలువ్యాగన్ల నుంచి అక్రమంగా తస్కరించిన బొగ్గును లారీలలోకి ఎక్కించి రాచమార్గంలో తరలించేందుకు మార్గమధ్యంలో వే బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా నేతలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటాడని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులైతే కొంత ఎక్కువ... మాజీలైతే వారికంటే కొంత తక్కువ సొమ్మును ఇస్తాడు. అలాగే ఎఫ్‌సీఐ నుంచి ఎల్కలపల్లి గేట్లోకి ఎవరైనా వస్తే... వారి సమాచారాన్ని వెంటనే చెప్పేందుకు ఏజంట్లను కూడా పెట్టుకున్నాడు. వారు ఆయా హోటళ్ల వద్ద తిష్టవేసి సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు. ఇక సింగరేణి నుంచి వ్యాగన్లు బయలుదేరిన తర్వాత రైలును నెమ్మదిగా నడిపించేందుకు లోకో పైలట్లకు, ఈ తతంగం జరుగుతున్నా చూసీచూడనట్టుగా వ్యవహరించినందుకు సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులకు, గార్డులకు కూడా నెలవారీగా లక్షల రూపాయల్లో మామూళ్లు ముట్టుజెపుతున్నట్లు సమాచారం. ఈ అక్రమదందా ఇన్నాళ్లుగా సాఫీగా సాగడానికి పోలీస్ వ్యవస్థ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించినట్లుగా స్పష్టమవుతోంది. ఇందుకోసం కోల్‌బెల్ట్ ఏరియాలోని పోలీస్స్టేషన్లతో పాటు రాజీవ్ రహదారిపై ఉండే పోలీస్స్టేషన్లకు కూడా నెలవారీగా లక్షలాది రూపాయల నజరానాలను ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సైకిల్ నుంచి స్కార్పియో దాకా... ఒకప్పుడు సైకిల్‌పై బొగ్గు సంచులను పెట్టుకుని క్వార్టర్లు, ఇళ్లల్లో బొగ్గును అమ్మిన వ్యక్తి స్వస్థలం వేములవాడ. హరిదాసు వేషాలేసినా, వంట పని చేసినా కాలం కలిసిరాకపోవడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర అనుచరుడిగా చేరి బొగ్గు రవాణా చేయడం ఆరంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సదరు ఆంధ్రావ్యక్తి ఇక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇక తానే రంగంలోకి దిగి మాఫియా డాన్‌గా మారాడు. ఒకనాడు సైకిల్‌పై తిరిగిన ఈ వ్యక్తి ప్రస్తుతం రూ.కోట్లకు పడగలెత్తాడు. సుల్తానాబాద్ రాజీవ్ రహదారి సమీపంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. వేములవాడలో పెద్ద భవనం. ఎల్కలపల్లి ప్రాం తంలో ఇండ్లు, భూములు కొన్నాడు. రాజకీ య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో తన అనుచరులపై కేసులు నమోదైతే బెయిల్ ఇప్పించడం, తిరిగి దందాకు ప్రోత్సహించడం, వినాయకచవితి నవరాత్రోత్సవాలకు భారీగా చందాలు ఇవ్వడం ఇతని ప్రత్యేకత. ఇంటి వద్ద నిత్యం పదుల సంఖ్యలో యువకులు తిరుగుతుం టారు. దాదాపు వంద మందికిపైగా యువకులను పెంచిపోషిస్తూ తన అక్రమ బొగ్గు దందాను మూడు ట్రాక్టర్లు, ఆరు లారీల లాగా కొనసాగిస్తున్నాడు. -
ఐవీఎఫ్ కేంద్రాల్లో అక్రమ దందా!
సాక్షి, విశాఖపట్నం: అక్కడ జరుగుతున్నది అక్రమమని తెలుసు.. పేగు పచ్చి ఆరని పసి గుడ్డును విక్రయిస్తున్నారనీ తెలుసు.. అయినా ఏమీ జరగనట్టే ఉంటున్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసు.. ఎలా నడిపిస్తున్నారో తెలుసు.. కానీ ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంత నిర్లక్ష్యం? ఎవరి కోసం ఈ నిర్లిప్తత? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ‘బేబీ ఫ్యాక్టరీ’ వ్యవహారంలో ప్రభుత్వం, అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. కేవలం వివరాలడిగి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేతులు దులుపుకుంటే, ఈ వ్యవహారంపై దష్టి పెట్టేందుకు పోలీసులు సాహసించడం లేదు. పైగా ఫిర్యాదు లేనిదే తామేమీ చేయలేమని తప్పించుకుంటున్నారు. ఏజెంట్లతో ఒప్పందాలు విశాఖపట్నంలో 10 ముఖ్యమైన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) కేంద్రాలు ఉన్నాయనేది అధికారుల లెక్క. ఇవి కాకుండా చిన్నాచితకా కేంద్రాలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రధాన ఐవీఎఫ్ కేంద్రాలకు అనుబంధంగా నడుస్తున్నాయి. ఐవీఎఫ్‌కు వచ్చిన వారిలో సంపన్న వర్గాల వారుంటే వారికి పిల్లలను విక్రయించేలా కేంద్రాల నిర్వాహకులు కొందరు ఏజెంట్లతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తమ వద్ద ఉన్న దంపతుల వివరాలను ఏజెంట్లకు అందజేస్తున్నారు. దత్తత తీసుకోవాలంటూ కౌన్సెలింగ్ సంతానం కోసం తమ వద్దకు వచ్చే వారిని ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులు ట్రీట్మెంట్ పేరిట సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారు. పరీక్షలంటూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇంతచేస్తున్నా ఈ కేంద్రాల్లో సంతాన భాగ్యం కలిగేది కొందరికే. ఎక్కువ శాతం దంపతులకు సరోగసీ ద్వారా కూడా బిడ్డలు కలిగే అవకాశం ఉండటం లేదు. ఇక ప్రయోజనం లేదని, ఎవరినైనా దత్తత తీసుకోవడమే మేలని నిర్వాహకులు కౌన్సె లింగ్ ఇస్తున్నారు. దానికి ఒప్పుకున్న దంపతులను అప్పటికే సిద్ధంగా ఉన్న ఏజెంట్లకు అప్పగిస్తున్నారు. ఐవీఎఫ్ కేంద్రాల వద్ద ముగ్గురు చొప్పున ఏజెంట్లు ఉంటున్నారు. బేబీ ఫ్యాక్టరీల నుంచి పిల్లలను తీసుకువచ్చి దంపతులకు విక్రయిస్తున్నారు. మంత్రి ఆదేశాలు బేఖాతరు ఐవీఎఫ్ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేదు. ఇప్పటివరకు ఎంత మంది పుట్టారు. వారి వివరాలేమిటనే రికార్డులు వైద్య ఆరోగ్య శాఖ వద్ద లేవు. ఐవీఎఫ్లలోని పిండాలు ఏమవుతున్నాయనే దానిపై సమాచారం లేదు. ఐవీఎఫ్ కేంద్రాల్లో అవకతవకలపై విచారణ జరపాలని సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో 13 పెద్ద ఐవీఎఫ్ సెంటర్లు ఉండగా 10 సెంటర్లకే నోటీసులిచ్చారు. మిగతా మూడు సెంటర్లను ఎందుకు వదిలేశారో అధికారులకే తెలియాలి. ఇక చిన్నాచితకా సెంటర్ల బాగోతాన్ని పట్టించుకోవడమే లేదు. అన్నీ పట్టించుకోవాలంటే సిబ్బంది లేరు ‘‘ఐవీఎఫ్ కేంద్రాలకు పిల్లల విక్రయాలతో సంబం ధంఉండకపోవచ్చు. పిల్లలను విక్రయిస్తున్న వారు కావాలనే ఐవీఎఫ్ కేంద్రాల పేరు చెబుతుండవచ్చు. అయినప్పటికీ 10 ఐవీఎఫ్ సెంటర్లకు నోటీసులిచ్చాం. అన్నీ పట్టించుకోవాలంటే మా వద్ద తగిన సంఖ్యలో సిబ్బంది లేరు’’ -జె.సరోజిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, విశాఖపట్నం -
అక్రమ దందాను ఆపివేయాలి
నకిరేకల్ : అధికారిక పేరుతో అక్రమంగా ఇసుక దందా కొనసాగుతోందని, తక్షణమే ఆపివేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాలిగౌరారంమండలంవంగమర్తి సమీపంలోని మూసీనది నుం డి అధికారికంగా ఇసుక క్వారీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. అధికార పార్టీ పెద్ద నేతల అండదండలతోనే ఈ అక్రమ రవాణా దందా జోరుగా సాగుతుందని ఆరోపించారు. 20 టన్నులు ఇసుక వెళ్లాల్సి ఉండగా 35 నుండి 45 టన్నుల మేర ఇసుకను లారీలలోకి ఎత్తి తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా లారీల రవాణాతో గ్రామీణ రహదారులన్ని పూర్తిగా పాడవుతున్నాయన్నారు. మూసీనదిలో అధికారికంగా తెరిచిన ఇసుక క్వారీని తక్షణమే ఎత్తివేసి అక్రమ రవాణాను కట్టడి చే యాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హె చ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు ఎండి మహబుబ్ అలీ,యాస కార్ణకర్‌రెడ్డి ఎంపీటీసీ గుర్రంగణేష్,నాయకు లు పన్నాల రాఘవరెడ్డి, రాచకొండ సైదులు, సుంకరబోయిన నర్సింహ,గందమల్ల జానయ్య,ఆరుట్ల శ్రవణ్, వంటెపాక జాని, కర్ణాకర్, గుండ్లపల్లి యాదగిరి, పల్లె విజయ్, చౌగోని లక్ష్మణ్, దాసరి సైదులు, ఈదుల్ల వెంకరమణ, ఉదయ్ పాల్గొన్నారు. -
గులాబీ నేతల్లో ఇసుక గుబులు
అక్రమ దందాలోనూ ఆధిపత్య పోరు సాక్షి, హైదరాబాద్: రాజకీయంగానే కాదు, చివరకు అక్రమ సంపాదనలోనూ కొందరు గులాబీ నేతలు ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నారు. ‘సొంత పార్టీ వాడైతే నాకేంటి? నా మాములూ నాదే..’ అంటూ అక్రమ సంపాదనలో కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీరి మధ్య పోరుకు ఇసుక అక్రమ రవాణా వ్యాపారం కారణమవుతోంది. అత్యధిక జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకుల మధ్య పంచాయితీ నడుస్తోందని తెలుస్తోంది. చివరకు ఆయా జిల్లాల మంత్రులు సైతం ఈ పంచాయితీలను పరిష్కరించలేక చేతులెత్తేస్తున్నారని వినికిడి. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీ మేరకు గుర్తించిన అధికారిక క్వారీల్లోనే ఇసుక తవ్వకాలు జరగాలి. కానీ, అనధికారిక క్వారీల్లోనే తవ్వకం ఎక్కువగా జరుగుతోంది. ఆర్థికంగా బలోపేతం కావడానికి దగ్గర దారిగా కనిపిస్తున్న ఇసుక వ్యాపారంపైనే గులాబీ నేతలు ఆధారపడుతున్నారు. దీంతో ఒకరి వాహనాలను మరొకరు అడ్డుకుంటూ ఘర్షణలకు దిగుతున్నారు. ఉత్తర తెలంగాణలో గొడవలు ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో గులాబీ నేతలు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడంతో ఇసుక పంచాయితీలు ఎక్కువగా నడుస్తున్నాయని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరికి ఉప నదిగా ఉన్న మంజీర నదిలో భారీ ఎత్తున ఇసుక వ్యాపారం నడుస్తోంది. ఒక ప్రజాప్రతినిధి తనయుడు ఈ వ్యాపారంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. దీంతో మరో ప్రజాప్రతినిధి అనుకూల వర్గం ఆయన తీరును ఆక్షేపిస్తోంది. దీంతో ఆ జిల్లా పంచాయితీని కేబినెట్లో కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఒక మంత్రి తీర్చాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ జిల్లాలోని రెండు వర్గాల మధ్య ముఖ్యనేత ఒకరు రాజీ చేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్కడి ఇద్దరి మంత్రుల అనుచరులు వర్గాలుగా విడిపోయి కత్తులు దూస్తున్నారని అనుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ముందు నుంచీ ఇసుక వ్యాపారంతోనే వెనకేసుకున్నారని, ఇప్పుడాయన తన ఆధిపత్యానికి గండిపడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని తెలిసింది. దీంతో ఇతర ఎమ్మెల్యేలకు చెందిన వాహనాలనూ ఆయన అడ్డుకుంటున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. తన కమీషన్ తనకిస్తే ఫర్వాలేదంటూ రాజీ ఫార్ములానూ ముందు పెడుతున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌కు తాకిన సెగ ఖమ్మం జిల్లాలో ఇసుక పంచాయితీ మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ రెండు వర్గాలు బహిరంగంగానే పనిచేస్తున్నాయి. ఈ గ్రూపుల గొడవ తీవ్రత చివరకు హైదరాబాద్ నేతలను తాకిందని, ఓ ‘ముఖ్య’ నేత మందలింపుతో కొంత సద్దుమణిగినట్లు సమాచారం. హైదరాబాద్‌కు సరిహద్దుగా ఉన్న నల్లగొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ప్రధానంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దందా ఎక్కువగా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో పాటు హాలియా వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య పేచీలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలను నియంత్రించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇసుక నిల్వలు అధికంగా ఉన్న క్వారీలనూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. -
సర్కారుకు సున్నం..ఖజానాకు కన్నం
పల్నాట తెలుగుదేశం నేతల దందా వందల ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు టీడీపీ నేతల కొమ్ము కాస్తున్న అధికారగణం సాక్షి ప్రతినిధి, గుంటూరు : పల్నాడులో పేరొందిన ప్రాంతమది. అక్కడి తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమ దందాలకు అధికారులు సైతం కొమ్ముకాస్తున్నారు. అక్రమ క్వారీ యింగ్ నడుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నా కిమ్మనడం లేదు. తమ ఉనికి కాపాడుకునే యత్నం కూడా చేయడం లేదు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల కళ్లెదుట అనుమతులు లేకుండా 20 నుంచి 30 అడుగుల లోతు వరకు సున్నపురాయిని తవ్వేస్తున్నా, పర్మిట్లు లేకుండా వందల లారీలు తిప్పేస్తున్నా చోద్యం చూస్తున్నారు. కనీసం అక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపే యత్నమే చేయడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు అక్కడి దందాపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నెల రోజుల క్రితం ఇచ్చిన వినతిపత్రాలు బుట్టదాఖలు కావడంతో అధికార యంత్రాంగం పనితీరును ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేటీ అనే రీతిలో అధికారులు ఉండటంతో విసుగెత్తిన వైఎస్సార్ సీపీ నేతలు ఆ క్వారీ లోని అక్రమ దందాను వెలుగులోకి తీసుసుకువచ్చే యత్నం చేస్తే, అక్కడా దౌర్జన్యం. అక్రమ క్వారీయింగ్ తామే చేసుకుంటున్నామని, ఎవరి ప్రమేయం లేదంటూ చేస్తున్న తప్పును సమర్థించుకునే యత్నం. ఉపాధికోసం ఈ వ్యవహారం జరుగుతోందని నమ్మబలికే ప్రయత్నం. అధికారంలోకి వచ్చిన తరువాత గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ దుర్నీతిపై ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్న విమర్శలు, విపక్షాల ఆందోళనలు అధికారుల చెవులను తాకకపోవడం వెనుక ఆంతర్యం తెలియందేమీ కాదు. నియోజకవర్గంలో తెల్లరాయి వ్యాపారం చేసుకుంటున్న కొందరిని టీడీపీ నేతలు బెదిరించి ఆ క్వారీలను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వం నుంచి తెల్లరాయి తవ్వకాలకు అనుమతులు పొందిన సిమెంట్ కంపెనీల భూములు, ప్రభుత్వ భూములు, కొందరి వ్యాపారుల భూములను కబ్జా చేసి అక్రమ మైనింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుమతులు కలిగిన క్వారీలకు ఉండే పొక్లయిన్లు, లారీలు, ట్రక్కులు ఈ నిర్వాహకులకు ఉండటమే కాకుండా వందలాది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల పరిధిలోని వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ అక్రమ దందా జరుగు తోంది. ఇంత జరుగుతున్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు జమ కావడం లేదు. ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా, ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ప్రశ్నించే సాహసం చేయలేక పోతోంది. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, సిబ్బందికి నెలవారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. తెలుగు తమ్ముళ్లు చేస్తున్న అక్రమ క్వారీయింగ్‌తో గురజాల నియోజకవర్గంలో తెల్లరాయి గనులన్నీ కరిగిపోతు న్నాయి. లోటు బడ్జెట్లో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుతమ్ముళ్ల అక్రమ క్వారీయింగ్‌ను నిలువరిస్తే కొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. -
సర్కారు ఇసుకకు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఇసుక విక్రయాలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వమే ఇసుక విక్రయించాలని నిర్ణయించిన విషయంవిధితమే. ఈ మేరకు ప్రత్యేక ఇసుక పాలసీని ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ద్వారా ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో తొలిసారిగా వేమనపల్లి మండల పరిధిలో ప్రవహించే నీల్వాయి నది నుంచి ఇసుక తవ్వకాలు జరుపనున్నారు. ఇక్కడి నుంచి ఇసుకను సమీపంలోని ఓ డంప్ యార్డుకు తరలించి విక్రయించేందుకు టీఎస్ఎండీసీ ఏర్పాట్లు చేస్తోంది. నీల్వాయి నది నుంచి డంప్ యార్డుకు ఇసుకను తరలించేందుకు టీఎస్ఎండీసీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇసుక డంప్ యార్డు కోసం ప్రభుత్వ భూమిని ఇవ్వాలని టీఎస్ఎండీసీ అధికారులు మంచిర్యాల ఆర్డీవోకు లేఖ రాశారు. నీల్వాయిలో ఇసుక నిల్వలపై సంయుక్త అధికారుల బృందం ఇటీవల సర్వే చేపట్టింది. ఇందులో సుమారు 1.92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు తేల్చింది. దీన్ని డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి విక్రయించనున్నారు. ఇసుక అవసరం ఉన్న వారు నిర్ణీత మొత్తాన్ని చెల్లించి, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వారికి టీఎస్ఎండీసీనే ఇసుకను సరఫరా చేస్తుంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇసుక విక్రయ కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలో కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. మరో రెండు రీచ్‌ల గుర్తింపు.. జిల్లాలో ఇసుక లభ్యతపై జిల్లా ఉన్నతాధికారుల బృందం ప్రత్యేక సర్వే నిర్వహించింది. గనులు, భూగర్భ జలాలు, నీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సంయుక్త పరిశీలన చేపట్టారు. గోదావరి నదిలో 16 ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఇందులో 14 రీచ్‌లలో ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ లేనట్లు గుర్తించారు. రెండు రీచ్‌లు కోటపల్లి మండలం కోనంపేట్లో 2,500 క్యూబిక్ మీటర్లు, జైపూర్ మండలం వేలాలలో మరో 2,500 క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులో ఉంది. ఈ రెండు రీచ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. వాల్టా చట్టం ప్రకారం నదిలో 500 మీటర్ల మధ్యలో తవ్వకాలు చేపట్టాలి. ఆరు మీటర్ల మేరకు ఇసుక పేరుకుపోతే కేవలం ఒక మీటరు మాత్రమే తవ్వాలి. ఎనిమిది మీటర్లు ఇసుక ఉంటే రెండు మీటర్లు తీయూలి. అయితే అధికారుల బృందం గుర్తించిన 14 రీచ్‌లలో ఈ పరిస్థితులు లేవు. -
వసూళ్ల దందా
రవాణా శాఖ అధికారుల అక్రమదందాకు అలంపూర్ అంతర్రాష్ట్ర రవాణా చెక్‌పోస్టు అడ్డాగా మారింది. రెండురోజుల క్రితం చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసినా వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. సగటున రోజుకు రూ. రెండు లక్షలపైనే అనధికారికంగా వాహనదారుల నుంచి వసూలు చేస్తూ వాటాలు పంచుకుంటున్నట్లు తెలిసింది.‘సాక్షి’ పరిశీలనలో ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారులకు సైతం వాటాలు అందుతున్న తతంగం వెలుగుచూసింది. చెక్‌పోస్టు వద్ద జరుగుతున్న వసూళ్ల దందాపై దృష్టి సారించడంతో అనేక విషయాలు వెలుగుచూశాయి. * అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్టు అడ్డా * రోజువారీ కలెక్షన్ రూ.2లక్షలపైనే * ప్రైవేట్ సిబ్బందితో ప్రత్యేకటీం * అధికారులు సహా అందరికీ వాటాలు * ఏసీబీ నివేదిక అందేదెన్నడో? * ఏఎంవీఐపై చర్యకు మీనమేషాలు కల్వల మల్లికార్జున్‌రెడ్డి: హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై అలంపూర్ రవాణా శాఖ చెక్‌పోస్టు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారింది. ఈనెల 20న అర్ధరాత్రి చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ నుంచి రూ.1.08లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులను నియమించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఏసీబీ దాడుల తర్వాత కూడా చెక్‌పోస్టు వద్ద వసూళ్ల దందా యథాతథంగా కొనసాగుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. నిబంధనల ప్రకారం అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంది. లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న పర్యవేక్షణ అధికారులు రోజుకు 12 గంటలు చొప్పున రెండు షిఫ్టుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టులో మొత్తం 9 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వీరికితోడు అదనంగా మరో 10 మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. చెక్‌పోస్టు పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తుల సంచారం ఉండకూడదనే నిబంధన పాటించడం లేదు. ఈ ఏడాది అక్టోబర్ 9న చెక్‌పోస్టును అధికారి కంగా ప్రారంభించగా, రెండు నెలల ముం దు నుం చే అనధికారిక చెక్‌పోస్టు ఏర్పాటుచేసి వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఏసీబీ కేసు తేలేనా? చెక్‌పోస్టుపై దాడిచేసి ఓ ఎఎంవీఐతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుకున్న నిందితులపై శాఖాపరమైన చర్య తీసుకోవాలని లేఖ రాసింది. డిపార్ట్మెంట్ ప్రొసిడింగ్ వచ్చిన తర్వాతే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని చెబుతోంది. ప్రా థమిక సమాచారాన్ని ఉన్నతాధికారులకు పం పిన ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను మరో నెల రోజుల్లో సమర్పిస్తామని చెబుతున్నారు. ఏ సీబీ పూర్తిస్థాయి విచారణ నివేదిక తరువాతే అ క్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అన్ని స్థాయుల అధికారులకు వాటాలు అందుతుండటంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలు గాలికి జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్డీఓ పర్యవేక్షణ, నియంత్రణ, మార్గనిర్దేశనంలో పనిచేయాల్సిన చెక్‌పోస్టు సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. విధుల్లో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న నగదు వివరాలను సంబంధిత రిజిస్టరులో నమోదు చేయాల్సి ఉన్నా పాటించడం లేదు. * విధుల్లో ఉన్న సిబ్బంది హోదా, పేర్లు బోర్డుపై రాయాల్సి ఉన్నా రావడం లేదు. * విధులు నిర్వహించే సిబ్బంది కచ్చితంగా యూనిఫామ్స్ ధరించాలనే నిబంధన కూడా అమలుకావడం లేదు. * చెక్‌పోస్టుగా మీదుగా వెళ్తున్న వాహనాల వివరాలను అరకొరగా నమోదు చేస్తున్నారు. * సరైన అనుమతి పత్రాలు, ఫిట్నెస్ ధ్రువీకరణపత్రాలు లేకుండా సరిహద్దు దాటుతున్న వాహనాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. * పన్నులు చెల్లించకుండా సరిహద్దు దాటుతున్న వాహనాల నుంచి వసూళ్లు చేస్తూ అరకొర తనిఖీలతో వదిలేస్తున్నారు. * వాహనాల నంబర్లు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేయాలన్న నిబంధన పాటించడం లేదు. -
పగలు ఖాకీ.. రాత్రి లే
రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అధికార టీడీపీ నాయకులకు కూడా (తప్పుడు పనులు చేసే వారికి) చెమటలు పట్టిస్తూ జిల్లాస్థాయి పోలీసు అధికారులు తమ పవర్ చూపిస్తున్నారు. అయితే.. కొంతమంది పోలీసులు మాత్రం తమ సహజ ధోరణిలోనే అవినీతి, అక్రమ దందాల్లో మునిగితేలుతున్నారు. ఏలూరులోని కొంతమంది ఖాకీలైతే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల మాదిరిగా డబ్బుల వసూళ్లకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏలూరు నగరంలోని ట్రాఫిక్‌ను తగ్గించేందుకు భీమవరం, నరసాపురం, కైకలూరు మీదుగా వచ్చే వాహనాలను మినీ బైపాస్ మీదుగా జాతీయ రహదారి వైపు మళ్లిస్తున్నారు. రాత్రిపూట భారీ వాహనాలు, లారీలు ఎక్కువగా ఆ రహదారి మీదుగా వెళ్తుంటాయి. ఇదే అదనుగా నగరంలోని కొంతమంది పోలీసులు రాత్రి 10గంటల తర్వాత అక్కడ కాపుకాసి తనిఖీల సీన్ క్రియేట్ చేసి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మినీ హైవేపై ఓ పాయింట్లో జీపు ఆపుకుని ఓ పోలీసాయన ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. ముగ్గురు, నలుగురుకానిస్టేబుళ్లు అటుగా వచ్చే లారీలను ఆపి డ్రైవింగ్ లెసైన్స్ మొదలు.. ఫిట్నెస్ సర్టిఫికెట్ వరకు మొత్తం చూపించాల్సిందిగా డ్రైవర్, క్లీనర్లను హడావుడి చేస్తారు. మీరెవరని పొరపాటున ఎవరన్నా అడిగితే.. ‘ఆర్టీఏ సార్ జీపులో కూర్చున్నారు. ఆయన దగ్గరకు వెళ్తే నేరుగా స్టేషన్‌కే.. లేదా ఫైన్ ఇంకా ఎక్కువవుతుంది’ అని బెదిరిస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవని లారీ డ్రైవర్లు పచ్చనోట్లు తీసి ఖాకీల జేబుల్లో కుక్కి వెళ్లిపోతున్నారు. అయితే, సదరు పోలీసులు ప్రైవేటు బస్సుల జోలికి మాత్రం పొరపాటున కూడా పోరట. ఎందుకంటే ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు ఆర్టీఏ ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉంటాయి. దీంతో వీరి బండారం బయటపడుతుందని బస్సుల వైపు కన్నైత్తి చూడరట. ఇలా నిశిరాత్రి దాటిన తర్వాత నాలుగైదు వేల రూపాయలు వసూలు చేసుకుని ఇవాళ్టికి ఇది చాలు అని సదరు ఖాకీలు ఇళ్లకు వెళిపోతున్నారట. మరి పోలీసులు ఇలా ఆర్టీఏ ముసుగులో లేకిగా వసూళ్లకు పాల్పడుతుంటే వీళ్లకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన రవాణా అధికారులు ఏం చేస్తున్నట్టబ్బా..! కార్పొరేటర్ల చిల్లర నొక్కుళ్లు మొక్కల పేరిట అధికారులు లక్షలు బొక్కితే.. ప్రజాప్రతినిధులైన తాము తీసిపోయామా అంటూ ఏలూరు కార్పొరేటర్లూ అందిన కాడికి దోచేస్తున్నారట. రూ.లక్షలు ఖర్చుచేసి గెలిచి 6 నెలలైనా ఇప్పటికీ నిధుల్లేక, పనుల్లేక కార్పొరేటర్లు అల్లాడిపోతున్నారు. దీంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పడితే.. మరికొంత మంది నగరపాలక సంస్థనే నమ్ముకుని ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వస్తాయనే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే చివరకు కొంతమంది కార్పొరేటర్లు ‘చిల్లర’ కూడా వదలడం లేదని అంటున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని నగరంలోని చాలా డివిజన్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కొన్ని డివిజన్ల కార్పొరేటర్లు రూ.12 వేల చొప్పున ఖర్చరుు్యందంటూ బిల్లులు పెట్టారట. మహా అయితే 50కుర్చీలు, ఒక టెంట్‌వేసి సభ నిర్వహించినందుకు జమా ఖర్చులు చూస్తే చాలా డివిజన్లలో రెండు, మూడు వేలు కూడా ఖర్చు కాలేదని తేలిందట. అయినా రూ.వేలకు వేలు బిల్లులు పెట్టారట. ఇలా చిన్నపాటి కార్యక్రమ నిర్వహణకే చిల్లర నొక్కుళ్లకు పాల్పడితే భవిష్యత్‌లో రూ.కోట్లతో చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో ఎంత దిగమింగుతారో! ఏమో.. పాలకులకు తప్ప ఎవరికెరుక. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు