కిరాణా షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏటూరునాగారం: కిరాణా షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన భవాని కిరాణ దుకాణంలో అక్రమంగా ఖైనీ, గుట్కా ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో దుకాణంలో సోదాలు జరిపి రూ. 5 లక్షల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా దుకాణ యజమాని శివప్రసాద్ రూ. 1.20 లక్షల విలువ చేసే టేకు చక్కలను అక్రమంగా నిల్వ ఉంచినట్టు పోలీసలు గుర్తించారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని టేకు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.