కిస్సా కుర్సీకా | TO day election nomination | Sakshi
Sakshi News home page

కిస్సా కుర్సీకా

Published Thu, Jul 3 2014 2:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కిస్సా కుర్సీకా - Sakshi

కిస్సా కుర్సీకా

 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ మరికొద్ది గంటలో జరగనుంది. ‘పుర’పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సంఖ్యాబలం ఉన్న చోట చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై పార్టీలో ఏకాభిప్రాయం కుదుర్చుతున్నారు. గద్వాల, షాద్‌నగర్ మునిసిపల్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలో చేరనున్నాయి.

‘పేట’లో బీజేపీ, అయిజలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్‌ఎస్ పరంకానున్నాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. మూడుచోట్లా కాంగ్రెస్ ఇతరపార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొవడంతో ఎంపీ నంది ఎల్లయ్య ఓటు ఎక్కడ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు హోరాహోరీగా పావులు కదుపుతున్నాయి. చివరి క్షణంలో కౌన్సిలర్లు ఎదుటి శిబిరంలోకి వెళ్తారేమోననే ఆందోళన అన్ని పార్టీలను కలవరపెడుతోంది. హంగ్ ఏర్పడిన చోటచివరి నిముషం వరకు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు ఎవరికి దక్కుతాయో తెలియని ఉత్కంఠ నెలకొంది. సొంత పార్టీ సభ్యులు చేజారకుండా విప్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.
 
 గద్వాల    మునిసిపాలిటీ
 వార్డులు    : 33
 కాంగ్రెస్    : 23
 టీఆర్‌ఎస్    :  9
 స్వతంత్రులు : 01
 చైర్‌పర్సన్     : జనరల్ మహిళ
 కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కినా చైర్మన్ అభ్యర్థి ఎంపికపై పార్టీలో ఏకాభిప్రాయం కుదర లేదు. మాజీమంత్రి డీకే అరుణ వార్డుల వారీగా పార్టీ కౌన్సిలర్ల నుంచి చైర్మన్ అభ్యర్థిపై అభిప్రాయ సేకరణచేశారు. పద్మావతి (13వ వార్డు), కృష్ణవేణి (27వ వార్డు)లో ఒకరికి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది.
 
 నారాయణపేట మునిసిపాలిటీ
 వార్డులు    : 23
 బీజేపీ        : 12
 టీడీపీ        :  3
 టీఆర్‌ఎస్    :  2
 కాంగ్రెస్    : 3
 ఎంఐఎం    :  2
 స్వతంత్రులు     :  1
 చైర్‌పర్సన్    : బీసీ మహిళ
 బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కడంతో చైర్మన్ పదవి దక్కడం ఖాయమైంది. అయితే చైర్మన్ అ భ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. గందె అనసూ య (3వ వార్డు), కమల (15వ వార్డు) పదవి ఆశి స్తున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పార్టీ పరిశీలకులుగా వస్తున్నారు. పార్టీ అధిష్టానం సీల్డ్ కవర్‌లో పంపే పేరును చైర్మన్ పదవికి ప్రతిపాదించనున్నారు.
 
 కల్వకుర్తి నగర పంచాయతీ
 వార్డులు    : 20
 కాంగ్రెస్    : 6
 బీజేపీ        :3
 టీఆర్‌ఎస్    :5
 వైఎస్సార్‌సీపీ    :4
 ఎంఐంఎ    :1
 స్వతంత్రులు    :1
 చైర్‌పర్సన్    : బీసీ జనరల్
 హంగ్ ఏర్పడటంతో వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం మద్దతు తో చైర్మన్ పదవి కోసం టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. మ రోవైపు బీజేపీ మద్దతు కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నా లు చేస్తున్నా ఇంకా అవగాహన కుదరలేదు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య ఓట్లు కీలకం కానున్నాయి. వైఎస్సార్‌సీపీ సభ్యుల మద్దతు రెండు శిబిరాలకు కీలకంగా మారింది. టీఆర్‌ఎస్ నుంచి ఆనంద్‌కుమార్ (11వ వార్డు) చైర్మన్ పదవి ఆశిస్తున్నారు.
 
 నాగర్‌కర్నూల్ నగర పంచాయతీ
 వార్డులు    : 20
 కాంగ్రెస్          :  6
 బీజేపీ        :7
 టీఆర్‌ఎస్    : 6
 స్వతంత్రులు    :1
 చైర్‌పర్సన్    : బీసీ జనరల్
 బీజేపీ మద్దతుతో కాంగ్రెస్, స్వతంత్రులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ శిబిరంలో చీలికలపై ఆశతో టీఆర్‌ఎస్ పీఠం కోసం ప్రయత్నిస్తోంది.
 
  కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మోహన్‌గౌడ్ (7వ వార్డు)కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు పదవి దక్కేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 వనపర్తి మునిసిపాలిటీ
 వార్డులు:  26
 కాంగ్రెస్ : 8
 టీడీపీ    : 8
 టీఆర్‌ఎస్: 2
 బీజేపీ    : 4
 స్వతంత్రులు :4
 చైర్‌పర్సన్: జనరల్
 కాంగ్రెస్, బీజేపీలు పీఠం కోసం యత్నిస్తున్నాయి. టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవి దక్కకూడదనే ఉద్దేశంతో తొలి రెండున్నరేళ్లు బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చేలా కాంగ్రెస్ అవగాహన కుదుర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు స్వతంత్రు లు, టీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కుర్చీ కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది.  చివరి నిముషంలో ఎవరు గోడదూకుతారో తెలియని పరిస్థితి. ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఓట్లు కూడా కీలకం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి లోక్‌నాథ్ రెడ్డి (23వ వార్డు), బీజేపీ నుంచి బి.కృష్ణ (19వ వార్డు), టీడీపీ నుంచి రమేశ్‌గౌడ్ (25వ వార్డు)  పదవిని ఆశిస్తున్నారు.
 
 
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ
 వార్డులు: 41
 కాంగ్రెస్: 14
 టీఆర్‌ఎస్: 7
 బీజేపీ    : 6
 టీడీపీ    : 3
 ఎంఐఎం: 6
 వైఎస్సార్‌సీపీ: 1
 స్వతంత్రులు : 4
 చైర్‌పర్సన్:
 జనరల్ మహిళ
 స్పష్టమైన సంఖ్యా బలం లేకపోవడంతో చైర్మన్ పీఠంపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు కన్నేశాయి. బీజేపీ, టీడీపీ మద్దతుతో కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ, స్వతంత్రుల మద్దతుతో టీఆర్‌ఎస్ పదవి దక్కించుకునేందుకు క్యాంపు లు నిర్వహిస్తున్నా యి. రెండు పార్టీలు ఎదుటి శిబిరంలో చీలిక కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఓట్లు కీలకం కానున్నాయి. కాంగ్రెస్ నుంచి రాధ అమర్, పద్మ గోపాల్, టీఆర్‌ఎస్ నుంచి వనజ, బురుజు కల్పన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.
 
 షాద్‌నగర్
 మునిసిపాలిటీ
 వార్డులు    : 23
 కాంగ్రెస్    : 15
 టీఆర్‌ఎస్    :  1
 ఎంఐఎం    :  1
 స్వతంత్రులు :  6
 చైర్‌పర్సన్    : బీసీ జనరల్
 కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ దక్కడంతో చైర్మన్ ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి అభిప్రాయం కీలకం కానున్నది. వన్నాడ లావణ్య (3వ వార్డు), కొందూటి మహేశ్వరి (18వ వార్డు) చైర్మన్ పీఠాన్ని ఆశించినా అగ్గనూరు విశ్వం (13వ వార్డు) పేరును చైర్మన్ పదవికి ఖరారు చేశారు.
 
 అయిజ నగర పంచాయతీ
 వార్డులు    : 20
 టీఆర్‌ఎస్    : 16
 కాంగ్రెస్    :  4
 చైర్ పర్సన్    : ఎస్సీ జనరల్
 టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ దక్కింది. రాజేశ్వరి (13వ వార్డు) పేరు చైర్‌పర్సన్‌గా దాదాపు ఖరారు చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికపై పార్టీలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement