నేడు జిల్లాకు ఎంపీ పొంగులేటి | Today the district   MP ponguleti | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు ఎంపీ పొంగులేటి

Published Sat, Jun 7 2014 3:22 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

నేడు జిల్లాకు  ఎంపీ పొంగులేటి - Sakshi

నేడు జిల్లాకు ఎంపీ పొంగులేటి

ఖమ్మం హవేలి, : ఖమ్మం ఎంపీగా పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం  జిల్లాకు రానున్నారు.  కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పొంగులేటికి ఘనస్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. నాయకన్‌గూడెం నుంచి పాలేరు, కూసుమంచి, తల్లంపాడు, వరంగల్ క్రాస్‌రోడ్, కాల్వొడ్డు, మయూరిసెంటర్, జెడ్పీసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్, రోటరీనగర్‌ల మీదుగా భారీ ప్రదర్శనగా పొంగులేటి జిల్లా కార్యాలయానికి చేరుకోనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి శ్రేణులు తరలివచ్చి శీనన్నకు ఘనంగా స్వాగతం పలకాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement