
హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2018, జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి...నోటీసులు జారీ చేస్తారు. అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.
సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను సోమవారం విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ తెలిపారు. జాబితా సవరణ, ఇతర ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులతో ఆదివారం సాయంత్రం ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. 2018 జనవరి 1 ప్రాతిపదికగా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,861 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో బుత్ స్థాయి అధికారులు ఉంటారన్నారు. బీఎల్‌ఓలుగా నియమితులైన అంగన్‌వాడీ, ఇతర శాఖల సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. ఎన్నికల విధులు సందర్భంగా నేటి నుంచి ప్రతి ఒక్కరికి సెలవులను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇళ్లను సందర్శించి ఓటరు జాబితా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. ఈనెల 25వ తేది వరకు అభ్యంతరాలు స్వీకరించి నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 4 వరకు అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
నేడు రాజకీయ పార్టీలతో సమావేశం
ఓటర్ల జాబితా సవరణపై సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నియోజకవర్గ స్థాయిల్లోనూ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment