కాజల్ కల్లుకు సమంతాతో పోటీ | toddy tappers name trees after tollywood heroines | Sakshi
Sakshi News home page

కాజల్ కల్లుకు సమంతాతో పోటీ

Published Thu, Jun 5 2014 11:58 AM | Last Updated on Sun, Jul 14 2019 4:54 PM

కాజల్ కల్లుకు సమంతాతో పోటీ - Sakshi

కాజల్ కల్లుకు సమంతాతో పోటీ

కాజల్.. ఇలియానా.. సమంతా.. తమన్నా.. నయనతార.. ఐశ్వర్యారాయ్.. వీళ్లంతా హీరోయిన్లు మాత్రమేనని అనుకుంటున్నారా? కాదు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో ఉన్న తాడిచెట్లకు కూడా ఇవే పేర్లున్నాయి. అంతేకాదు, ఈ చెట్ల కల్లుకు ఎక్కడ లేని డిమాండు ఉంది. టాలీవుడ్, బాలీవుడ్లలోనే కాదు.. ఇక్కడ చిరుమర్రిలో కూడా హీరోయిన్లు తెగ పోటీ పడుతున్నారు. ఒక్కో హీరోయిన్ చెట్టు నుంచి వచ్చే కల్లుది ఒక్కో టేస్టు అని, తమకు ఫలానా హీరోయినే కావాలని కల్లుప్రియులు ఇక్కడికొచ్చి గారాలు పోతుంటారు. స్వచ్ఛమైన, కల్తీ లేని కల్లుకు చిరుమర్రి ఫేమస్ అని వాళ్లు చెప్పుకొంటున్నారు. అయితే.. ఏ చెట్టు నుంచి ఏ రుచి ఉండే కల్లు వస్తుందో గుర్తుపెట్టుకోవడం కష్టం కావడంతో, ఓ కల్లుగీత కార్మికుడికి ఈ ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆధీనంలో ఉన్న చెట్లకు కాజల్, సమంతా, ఇలియానా అని పేర్లు పెట్టేశాడు.

సరిగ్గా ఈ ఐడియా ఇక్కడి కల్లుగీత కార్మికులందరి జీవితాలను మార్చేసింది. అంతే, ఇక్కడున్నవాళ్లంతా తమ తమ చెట్లకు తమకు ఇష్టమైన హీరోయిన్ల పేర్లు పెట్టుకుంటూ వచ్చేశారు. అంతేకాదు, ఆ చెట్లను గుర్తుపట్టేందుకు వీలుగా చెట్టుకు హీరోయిన్ల బొమ్మలు అతికించేశారు. ప్రస్తుతం నయనతార, తమన్నా, కాజల్‌, త్రిష, సమంత పేర్లున్న చెట్లకు డిమాండ్ ఉంది. ఇలా కల్లుకు సినీ తారల పేర్లు జోడించడంతో కల్లు ప్రియులకు ఏ రకం కల్లు కావాలో తెలుసుకుని, దాన్ని అమ్మడానికి సులువు అవుతోందంటున్నారు కల్లు గీత కార్మికులు. మొత్తానికి సినిమా తారల పేర్లతో .. ఇక్కడ జరుగుతున్న కల్లు విక్రయాలకు మంచి డిమాండే లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement