
తూము వద్ద నుంచి పాకాలను వీక్షిస్తున్న పర్యాటకులు
ఖానాపురం : వరంగల్ రూరల్ జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా నిలిచిన పాకాలలో బుధవారం పర్యాటకుల సందడి నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పర్యాటకులు పాకాలకు తరలివచ్చి అందాలను వీక్షించారు. కట్టపై నుంచి నడుచుకుంటూ వెళుతూ పాకాల అందాలను ఆస్వాదించారు.
లీకేజీ ద్వారా వెళ్తున్న నీటిలో జళకాళాడారు. పార్కులు చిన్నపిల్లలతో కలసి ఉత్సాహంగా గడిపారు. నిండుకుండలా కనిపిస్తున్న పాకాల సరస్సులో బోటింగ్ చేస్తూ మంచి అనుభూతిని పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఎస్సై సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment