సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ పోలీసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్ బండ్ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు.
♦ కర్బాలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్ క్లబ్ నుంచి కవాడీగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపుతారు.
♦ ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్ స్టాట్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్
మీదుగా వెళ్లాలి.
♦ సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ స్టాట్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మీనార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి.
♦ సాధూరామ్ కంటి ఆసుపత్రి నుంచి సెక్రటేరియేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాలి.
ట్యాంక్‌బండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
Published Sat, Apr 14 2018 8:59 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment