ముగిసిన బది‘లీలలు’ | transfers ended | Sakshi
Sakshi News home page

ముగిసిన బది‘లీలలు’

Published Wed, Jun 4 2014 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

transfers ended

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. రెండు రోజులుగా సాగిన బదిలీల కసరత్తు బుధవారం సాయంత్రానికి పూర్తయింది. కొత్త ప్రభుత్వం పాలనా యంత్రాంగంపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ముందుగా రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళనకు సర్కారు ఉపక్రమిం చింది. ఇందులో భాగంగా జిల్లా/ రెవెన్యూ స్థాయి రెవెన్యూ అధికారుల పోస్టింగ్‌ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఉద్యోగ సంఘాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గ్రామీణ మండలాల తహసీల్దార్ల బదిలీలపై ఎలాంటి నిర్ణయానికి రాలేక పోయింది. ఈ నేపథ్యంలో బదిలీల జాబితాపై మల్లగుల్లాలు పడిన కలెక్టర్ బి.శ్రీధర్ బుధవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 30 మంది తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరిని కలెక్టరేట్‌లో రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు.

 పైరవీలకు పెద్దపీట!
 ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో తహసీల్దార్ల పోస్టింగ్‌ల వ్యవహారంలో నానాయాగీ జరిగింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కోరుకున్న మండలాల్లో పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో బదిలీల పర్వంలో పైరవీకారులదే పైచేయి అయింది. సమర్థత, పనితీరు ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇవ్వాలని భావించిన జిల్లా యంత్రాంగం ఆశలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే నాలుగైదు సార్లు బదిలీల జాబితాలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.

 పోస్టింగ్‌లపై అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో మంగళవారం రూపొ ందించిన జాబితాను పక్కనపెట్టిన యంత్రాంగం.. బుధవారం మరో జాబి తాను తయారు చేసింది. జాబితాలో పలు మార్పులు, చేర్పులుచేసి ఎట్టకేలకు బుధవారం సాయంత్రం బదిలీల పర్వానికి ముగింపు పలికింది. ఇదిలావుండగా, పది మంది తహసీల్దార్లను బదిలీచేస్తూ కలెక్టర్ తొలి జాబితాను విడుదల చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్నదే తడువు సదరు తహసీల్దార్లు నిర్దేశించిన మండలాల్లో బాధ్యతలు కూడా స్వీకరించడం గమనార్హం.

 తహసీల్దార్              పనిచేస్తున్న చోటు               బదిలీ
 డి.శ్రీకాంత్‌రెడ్డి              కందుకూరు                  మేడ్చల్
 ఎస్.రాజేశ్వర్              నల్గొండ                       శామీర్‌పేట
 సీహెచ్ రవీందర్‌రెడ్డి       హైదరాబాద్                    కీసర
 కె.విష్ణువర్దన్‌రెడ్డి           కలెక్టరేట్                    ఘట్‌కేసర్
 ఎస్.రాజేశ్‌కుమార్        కలెక్టరేట్                         ఉప్పల్
 ఎల్.రమాదేవి              సెలవు                        మల్కాజిగిరి
 కె.రాజేందర్‌రెడ్డి             హైదరాబాద్                   చేవెళ్ల
 కె.అనంతరెడ్డి              నిజామాబాద్                 శంకర్‌పల్లి
 బి.వసంతకుమారి        హైదరాబాద్                   యాచారం
 కె.వెంకటరెడ్డి             కేఆర్‌ఆర్‌సీ                       శంషాబాద్
 కె.సుశీల                    బషీరాబాద్                     కందుకూరు
 వి.లచ్చిరెడ్డి               హైదరాబాద్                   రిపోర్ట్ టు కలెక్టరేట్
 ఎ.వెంకటేశ్వర్లు           మంచాల                            గండేడ్
 వెంకటేశ్వరరావు         నిజామాబాద్                        దోమ
 వి.వెంకట్‌రెడ్డి              హైదరాబాద్                       కుల్కచర్ల
 పి.సత్యనారాయణరాజు    నల్గొండ                       షాబాద్
 బి.యాదయ్య                 మహబూబ్‌నగర్               నవాబ్‌పేట
 కె.శ్రీనివాసులు               పూడూరు                       బంట్వారం
 బి.రవీందర్                   తాండూరు                       మోమిన్‌పేట
 ఎం.ప్రేమ్‌కుమార్             హైదరాబాద్                       యాలాల
 కె.గోవింద్‌రావు          డీఏఓ, వికారాబాద్                  తాండూరు
 ఆర్.జనార్దన్                నల్గొండ                           డీఏఓ, వికారాబాద్
 డి.దేవుజా               హైదరాబాద్                         పూడూరు
 వి.బాల్‌రాజ్                మెదక్                            మంచాల
 ఎం.షర్మిల              ఘట్‌కేసర్                         కలెక్టరేట్(ఎఫ్‌అండ్‌జీ)
 ఎస్.రాజేశ్వరి             కలెక్టరేట్                           కేఆర్‌ఆర్‌సీ
 ఎస్.రవీందర్           మహబూబ్‌నగర్                      కలెక్టరేట్
 ఎన్.విజయలక్ష్మి    చేవెళ్ల                               భూ పరిరక్షణ విభాగం
 పి.నర్సింహరావు    హైదరాబాద్                         రిపోర్ట్ టు కలెక్టరేట్
 ఎం.శ్రీనివాసరావు    హైదరాబాద్                      ధారూరు
 ఎన్‌ఆర్.సరిత    సెలవు                                 ఐటీడీఏ, వికారాబాద్
 భిక్షపతినాయక్    ఐటీడీఏ, వికారాబాద్                  బషీరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement