Posting tahsildar
-
త్రిశంఖు స్వర్గంలో తహశీల్దార్లు
- జిల్లాకు తిరిగొచ్చిన 32 మంది.. - వారం గడిచినా దక్కని పోస్టింగ్‌లు - రాజకీయ జోక్యంపై సర్వత్రా ఆసక్తి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తహశీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లి.. తిరిగి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు వారం రోజులు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఈ పోస్టింగ్‌లలో జిల్లా మంత్రి జోగు రామన్నతోపాటు, ఎమ్మెల్యేల ప్రమేయం తప్పకుండా ఉంటుందనే అభిప్రాయం ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 54 మంది తహశీల్దార్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికలు ముగిసిన వెం టనే జిల్లా నుంచి వెళ్లిన ఈ తహశీల్దార్లలో 40 మంది తిరిగి జిల్లాకు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఈనెల 12నుంచి 16వరకు కలెక్టరేట్లో రిపోర్టు చేశారు. వారం రోజులు దాటుతున్నప్పటికీ వీరిలో ఎవ్వరికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఖాళీగా ఉన్న మండలాల్లో డిప్యూటీ తహశీల్దార్లను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.. వీరికి మాత్రం ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అలాగే ఎన్నికల సందర్భంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మంల నుంచి 41 మంది తహశీల్దార్లు జిల్లాకు వచ్చారు. వీరికి ఇటీవల వారు తిరిగి సొంత జిల్లాలకు బదిలీ అయింది. ఇందులో 31 మంది తహశీల్దార్లు రిలీవ్ అయ్యారు. మిగిలిన పది మందిని ఎన్నికల లెక్కలు సమర్పించాల్సి ఉందని కలెక్టర్ రిలీవ్ చేయలేదు. ప్రస్తుతం జిల్లాలో 31 మంది తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. ఈ ఫైలు ప్రస్తుతం కలెక్టర్ పరిశీలనలో ఉంది.ఒకటీ రెండు రోజుల్లో ఈ ఫైలుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మండలాల్లో పనిచేసేందుకు తహశీల్దార్లు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. పాత స్థలాలకు ఎంపీడీఓలు.. : ఈసారి ఎన్నికల సందర్భంగా ఎంపీడీవోలకు కూడా బదిలీలు అయ్యాయి. జిల్లా నుంచి 16 మంది ఎంపీడీవోలు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం వీరిలో 13 మంది తిరిగి జిల్లాకు వచ్చారు. వీరు గతంలో ఎక్కడైతే పనిచేశారో.. అదే పోస్టుల్లో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తహశీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టింగ్‌లు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తహశీల్దార్లను పోస్టింగ్‌ల విషయంలో కలెక్టర్ల నిర్ణయమే కీలకం అవుతోంది. -
ముగిసిన బది‘లీలలు’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. రెండు రోజులుగా సాగిన బదిలీల కసరత్తు బుధవారం సాయంత్రానికి పూర్తయింది. కొత్త ప్రభుత్వం పాలనా యంత్రాంగంపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ముందుగా రెవెన్యూ యంత్రాంగం ప్రక్షాళనకు సర్కారు ఉపక్రమిం చింది. ఇందులో భాగంగా జిల్లా/ రెవెన్యూ స్థాయి రెవెన్యూ అధికారుల పోస్టింగ్‌ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఉద్యోగ సంఘాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గ్రామీణ మండలాల తహసీల్దార్ల బదిలీలపై ఎలాంటి నిర్ణయానికి రాలేక పోయింది. ఈ నేపథ్యంలో బదిలీల జాబితాపై మల్లగుల్లాలు పడిన కలెక్టర్ బి.శ్రీధర్ బుధవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 30 మంది తహసీల్దార్లకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరిని కలెక్టరేట్లో రిపోర్టింగ్ చేయాలని ఆదేశించారు. పైరవీలకు పెద్దపీట! ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో తహసీల్దార్ల పోస్టింగ్‌ల వ్యవహారంలో నానాయాగీ జరిగింది. తమ కనుసన్నల్లో మెలిగే అధికారులకు కోరుకున్న మండలాల్లో పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో బదిలీల పర్వంలో పైరవీకారులదే పైచేయి అయింది. సమర్థత, పనితీరు ప్రాతిపదికన పోస్టింగ్‌లు ఇవ్వాలని భావించిన జిల్లా యంత్రాంగం ఆశలపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలోనే నాలుగైదు సార్లు బదిలీల జాబితాలో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. పోస్టింగ్‌లపై అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో మంగళవారం రూపొ ందించిన జాబితాను పక్కనపెట్టిన యంత్రాంగం.. బుధవారం మరో జాబి తాను తయారు చేసింది. జాబితాలో పలు మార్పులు, చేర్పులుచేసి ఎట్టకేలకు బుధవారం సాయంత్రం బదిలీల పర్వానికి ముగింపు పలికింది. ఇదిలావుండగా, పది మంది తహసీల్దార్లను బదిలీచేస్తూ కలెక్టర్ తొలి జాబితాను విడుదల చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్నదే తడువు సదరు తహసీల్దార్లు నిర్దేశించిన మండలాల్లో బాధ్యతలు కూడా స్వీకరించడం గమనార్హం. తహసీల్దార్ పనిచేస్తున్న చోటు బదిలీ డి.శ్రీకాంత్‌రెడ్డి కందుకూరు మేడ్చల్ ఎస్.రాజేశ్వర్ నల్గొండ శామీర్‌పేట సీహెచ్ రవీందర్‌రెడ్డి హైదరాబాద్ కీసర కె.విష్ణువర్దన్‌రెడ్డి కలెక్టరేట్ ఘట్కేసర్ ఎస్.రాజేశ్‌కుమార్ కలెక్టరేట్ ఉప్పల్ ఎల్.రమాదేవి సెలవు మల్కాజిగిరి కె.రాజేందర్‌రెడ్డి హైదరాబాద్ చేవెళ్ల కె.అనంతరెడ్డి నిజామాబాద్ శంకర్పల్లి బి.వసంతకుమారి హైదరాబాద్ యాచారం కె.వెంకటరెడ్డి కేఆర్ఆర్సీ శంషాబాద్ కె.సుశీల బషీరాబాద్ కందుకూరు వి.లచ్చిరెడ్డి హైదరాబాద్ రిపోర్ట్ టు కలెక్టరేట్ ఎ.వెంకటేశ్వర్లు మంచాల గండేడ్ వెంకటేశ్వరరావు నిజామాబాద్ దోమ వి.వెంకట్‌రెడ్డి హైదరాబాద్ కుల్కచర్ల పి.సత్యనారాయణరాజు నల్గొండ షాబాద్ బి.యాదయ్య మహబూబ్‌నగర్ నవాబ్‌పేట కె.శ్రీనివాసులు పూడూరు బంట్వారం బి.రవీందర్ తాండూరు మోమిన్‌పేట ఎం.ప్రేమ్‌కుమార్ హైదరాబాద్ యాలాల కె.గోవింద్రావు డీఏఓ, వికారాబాద్ తాండూరు ఆర్.జనార్దన్ నల్గొండ డీఏఓ, వికారాబాద్ డి.దేవుజా హైదరాబాద్ పూడూరు వి.బాల్‌రాజ్ మెదక్ మంచాల ఎం.షర్మిల ఘట్కేసర్ కలెక్టరేట్(ఎఫ్అండ్జీ) ఎస్.రాజేశ్వరి కలెక్టరేట్ కేఆర్ఆర్సీ ఎస్.రవీందర్ మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎన్.విజయలక్ష్మి చేవెళ్ల భూ పరిరక్షణ విభాగం పి.నర్సింహరావు హైదరాబాద్ రిపోర్ట్ టు కలెక్టరేట్ ఎం.శ్రీనివాసరావు హైదరాబాద్ ధారూరు ఎన్ఆర్.సరిత సెలవు ఐటీడీఏ, వికారాబాద్ భిక్షపతినాయక్ ఐటీడీఏ, వికారాబాద్ బషీరాబాద్