
సాక్షి, నల్గొండ : వ్యాపార అవసరాల నిమిత్తం అమెరికా వెళ్లి లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీఆర్‌ఎస్ నాయకుడు మన్నెం రంజిత్‌యాదవ్ సొంత గడ్డపై అడుగుపెట్టారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన రంజిత్ యాదవ్ వ్యాపార పనుల నిమిత్తం మార్చి 13న అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో కరోనా వైరస్ విజృంభించటంతో భారత్ లాక్‌డౌన్ విధించి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో దేశానికి వచ్చే అవకాశం లేక ఆయన అక్కడే చిక్కుబడి పోయారు. అయితే భారత ప్రభుత్వం విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడంతో ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment