
నల్లగొండ, నిడమనూరు(హాలియా) : మండలంలోని ఎర్రబెల్లికి చెందిన మన్నెం రంజిత్‌యాదవ్ బిజినెస్ పనిమీద ఈ నెల 13న అమెరికాకు వెళ్లారు. కాగా కరోనా వైరస్ నివారణలో భాగంగా అక్కడ మీటింగ్‌లు అన్నీ రద్దు చేశారు. దీంతో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాకపోకలపై నిషేధం ఉండడంతో ఇబ్బందిగా ఉందని శుక్రవారం ఆయన సాక్షితో ఫోన్‌లో మాట్లాడారు. భారత ప్రభుత్వం సైతం ఈనెల 22నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇండియాకు రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపాడు. అమెరికాలో కరోనా అందరినీ కంగారు పెడుతోందని, ప్రభుత్వం చెబుతున్న విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు)